Pages

Monday, November 2, 2009

బ్లాగ్వనంలో వనభోజనం - క్యారెట్ జామ్




కార్తీకమాసం సందర్భంగా ప్రమదలందరూ కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకుందామా అని చర్చిస్తుంటే నాకు వంటలు ఆట్టే రావు అందుకే నోరుమూసుకొన్నా! ఐనా అమెరికాలో ఉండి మన తెలుగువంటలేం చేస్తాంలే అనుకున్నా.హైదరాబాదు వెళ్లాక చేద్దాం అంటే జ్యోతి ఊరుకుంటుందా! హెచ్చరిక చేసింది. సరే అని మీకోసం ఆపిల్ జామ్ చేశాను,


కారెట్ ,కొబ్బరి, పెసరపప్పు వేసి ,కరివేపాకు,అల్లము,పచ్చిమిర్చి, ఆవాలు,జీలకర్ర మినప పప్పు, ఒక్క ఎండు మిరప కాయ (ఎక్కువ మిర్చి వేస్తే కారెట్ రుచి తగ్గిపోతుంది) వేసి ఘాటుగా తిరగమూత పెట్టా. బటానీలు ఒక్క వుడుకు రానిచ్చి నీళ్లు ఓడ్చి జీలకర్ర ఉప్పుకారం వేసి పోగిచాను.అరటి పళ్ళు పవిత్ర మైన కార్తిక మాసంలో అన్ని విధాలా శ్రేష్టం కదా! అవిపెట్టాను. కారెట్ పడవలాచేసి వెడల్పాటి గిన్నెలో ఒక్క ఉడుకు రానిచ్చి జాగ్రత్తగా బయటికి తీసి , మధ్యలో గుజ్జు తిసేసి అందులో జామ్ నింపా. ఆపిల్ ముక్కతో తెరచాప చేశా. పడవ వాడు వున్నాడుగాని, పనికి రాదు. తక్కినవి తినవచ్చు.పరీక్షకి చదవని వాడు బలవంతంగా వెళ్లి హాజరు అవుతాడే! అలాగన్నమాట. ఏమి అన్యదా భావించకండి.


మీ జ్ఞాన ప్రసూన

10 comments:

చిలమకూరు విజయమోహన్ said...

ఇప్పటికే అందరిబ్లాగిళ్ళలో తినేసి వస్తున్నా! పెద్దవారు తినమంటున్నారు కనుక సరే ఇక తప్పుతుందా!

సిరిసిరిమువ్వ said...

మీ అలంకరణ బాగుంది..ఆ చేత్తోనే ఆపిల్ జాం ఎలా చెయ్యాలో చెప్పకూడదూ!

నేస్తం said...

బాగుంది బాగుంది

సుభద్ర said...

హామ్మ హాయ్య.....ఇప్పుడే పాలక పరాఠా విత్ క్యప్సిక౦ మసాల ఽగుత్తి వ౦కాయ కూర తిన్నా తరువాత స్వీటే గా !!!కానివ్వ౦డి..నేను టెబుల్ మీద రడీగా ఉన్నాను.
తయారీ చెప్పాలి కదా మరి నేను తినేస్తా కాని మా సాబ్ కి ,పిల్లలికి వ౦డి పెట్టాలి కదా!!
మీరు రాయాలి మరి!!!!

భావన said...

బాగుందండి అలంకరణ. చూస్తేనే తినెయ్యలనిపిస్తోంది.. ఒక గంట ఆగి వస్తానే.. చాలా తినేసా ఇప్పటీకే..

మాలా కుమార్ said...

చాలా బాగుందండి .

జయ said...

కారెట్ జామా! భలే బాగుందే. తిని చూడాల్సిందే.

శ్రీలలిత said...

చాలా బాగుంది

కార్తీక్ said...
This comment has been removed by the author.
కార్తీక్ said...

జ్ఞాన ప్రసూన గారు నేను మీ బ్లొగుకు కొత్త బావుందండి మీ బ్లాగిల్లు

ఇప్పుడే సుభద్ర గారి బ్లాగింట్లొ క్యరెట్ హల్వా తినొస్తున్ననండి

మళ్ళి ఇక్కడ మంచి క్యరెట్ జాం చాలా బావుందండి

హ అన్నట్టు అమృతబిందివు గేయం చాలా బాగుందండి

www.tholiadugu.blogspot.com