"బాధ పడుతున్నావా"అందిపాంట్
చీర కనురెప్పలు కిందికి వాల్చింది.
ఇంతకంటే మంచి వాళ్ళే కొంటారులే!విలువ తెలియని వాళ్ళకి అమ్ముడు పోవడం కంటే ఆత్మ హాని మరొకటి లేదనుకో!అంది.
'ఏమిటో!రోజూ ఇలా దుమ్ములో వేలాడ వలసినదేనా!'అంది చీర.
ఇంతలో పొడుగ్గా సన్నగా వున్నా ఒక వ్యక్తీ లోపలికి వచ్చాడు.అతని వంటిపై లాల్చీ ,పంచ చూసిపాంట్ నీళ్లు గారిపోయింది.ఆ వ్యక్తీ లోపలికి వెళ్లి పై పంచాతో ఒకసారి మొహం తుడుచుకొని శాపంతా కలయ జూసాడు.
"పంచలు చూపించ మంటారా?"అన్నాడు గుమాస్తా.
వాకిట్లో పాంట్ కిసుక్కున నవ్వింది.అవును .అతనికి అంతకన్నా ఏమికావాలిలే!అని, చీరవంక చూసి "ఎంతకాల మైనా సరే!మాంచి దర్జాగా వుండే అందగాడి దగ్గరికి వెళ్ళాలి.అస్తమానూ బండనేసి బాడే వాళ్ల దగ్గరికి పోకూడదు బాబూ!ఎక్కడ నలిగిపోతానో,ఎక్కడ మాసిపోతానోఅనుకొనే వాళ్ల దగ్గరికి వెళ్ళాలి.మామూలు వాళ్ల దగ్గరికి వెడితే పోగుపోగుకి రంగు వెలిసెలా ఉతికి బతికుండగానే చంపేస్తారు.
"అవును నాకూ అలానే అనిపిస్తుంది.మొన్న ఆమధ్య కామాక్షమ్మ నూట యాభై పెట్టి ఎర్ర చీర కొనుక్కెల్లిండా? నిన్న కట్టుకొచ్చింది,తొంభై ఎల్ల తోక్కులా చేసింది చీరని.ఏమి మనుషులో!కొనేదాకా వుండే ఆరాటం కొన్నాక వుండదు. హాయిగా కాలేజి అమ్మాయి కొనుక్కొంది అనుకో ఎంత బాగా చూసుకొంటుంది? ప్రాణం కంటే ఎక్కువగా!ఎప్పుడన్నా తొందర పడి మనం ముడుచుకొన్నా,వెంటనే కనిపెట్టి ఎంత పనిలో వున్నా సర్ది సరి చేసుకొంటుంది.అసలు వాళ్లు విస్త్రీ చేసిన చీరకట్టి పొడుగ్గా పమిట వేసుకొంటే తెరచాప లా వుంటుంది."అని ముసిముసి నవ్వులు నవ్వింది.
తను నిజం గానే కాలేజి అమ్మాయి వంటి నలన్కరించినట్లు -రోడ్ల మీద పోయే ప్రతివారూ తననే చూస్తున్నట్లు ఉహల్లో తేలిపోయింది.తీరా చూస్తె అక్కడ పాంట్ లేదు. లోపలికి తొంగి చూసింది చీర.ఆపంచే కట్టు ఆయన పాంట్ ని చేతిలోకి తీసుకొని దీపం వెల్తురులో రంగు,డిజైను పరిశీలిస్తున్నాడు.చివరికి తృప్తి చెంది బిల్లు వ్రాయించాడు. పాంట్ కి ఆయన దగ్గరికి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు.అన్చేతరెండు సార్లు ఆయన చేతిలోంచి కిందపడింది.మల్లి గుమాస్తా జాగ్రత్తగా మడిచి జైలు లాటి సంచీలోకి దోపి పిన్ చేసాడు.ఆ వ్యక్తీ పాకెట్ చేతి సంచీలోపెట్టుకొని వెళ్ళిపోయాడు.ఆఖరు సారి చూడలేక పోయినందుకు చీర చింతించింది.పోనీలే!తనయనా బయట పడ్డాడు.నిజానికి ఆ పాంట్ కొనుక్కొన్న మనిషికి మనసుంటే చీరకూడా కొంటాడు.అదే గనక నన్నే కొంటె ఇద్దరం ఒక చోటే ఉంటాము.
పంచెకట్టు వ్యక్తీ పాంట్ ని చాలా రోజులు పెట్టెలో దాచాడు.అతి స్వేచ్చని భరించలేక విసుక్కొంటే చీకటి జైలు వచ్చింది. అనుకోండి పాంట్.తెచ్చిన పెద్ద మనిషి కుట్టించుకోని వేసుకోదేమి?
పెట్టెలో పక్కనున్న చీరలు తగిలి నప్పుడల్లా పూల చీర గుర్తుకు వచ్చేది.పాపమెలావుందో?ఎవరైనా కొనుక్కోన్నారో,లేదో?ఎలాగైతేనేమి పంచకట్టు ఆసామి పంటని ఒకరోజు బయటికి తీసాడు.టైలర్ షాపుకి వెళుతున్నా అనుకోండి పాంట్ బట్ట.కాని చాలా హడావుడిగా వున్నా ఒక ఇంటికి తీసుకు వెళ్ళాడు.తను వుండి వచ్చిన షాపును మించి లైట్లు వేలుగుతున్నాయక్కడ.రంగు రంగుల కాగితం పొట్లాలు చేతిలో పట్టుకు,రకరకాల దుస్తులు ధరించిన వాళ్లు వస్తూనే వున్నారు.పంచెకట్టు వ్యక్తీ అక్కడ ఓమూల నుంచున్నాడు.ఆ ఇంటి యజమాని ఒకసారి తన వంక చూస్తాడేమో,వచ్చాను అని ఇకిలిద్దామని ఆశ పడుతూ.చాలా సేపటికి చూసి తల పంకిన్చాడాయన.మల్లి తన వంక చూడడేమో అని తన చేతిలో వున్నా పోట్లాము గభాలున ఆయన చేతిలో పెట్టేసాడు.యజమాని ఒకసారి తల పంకించి పొట్లం పక్క నున్న నౌకరు చేతికిచ్చాడు.ఆవాల పంచెకట్టు ఆయన అధికారి ఇంట్లో గృహ ప్రవేశం.ఉద్యోగ రీత్యా వెళ్లక తప్పదు.వెళితే ఏదో ప్రెజెంట్ తీసుకు వెళ్ళాకా తప్పదు.గృహ ప్రవేశం కదా!కొత్త బట్ట పెట్టినట్లున్తుందని
తీసుకొచ్చాడు. దానితో అతనికి పదినెలల వాయిదాల అప్పు కూడా వచ్చింది. తన కర్తవ్యమ్ నేర వేర్చా
ననుకొన్నాడు.ఆ ఇంట్లో రకరకాల ప్రేజేంట్ల మధ్య ఒక రోజు గడిపింది పాంట్.ఆ ప్రేజెంట్లలో స్టీలు బిందెలూ వున్నాయి,ఎలెక్ట్రిక్ సామాన్లూ వున్నాయి.వెండి బగారు ఆభరణాలు వున్నాయి.ఇస్త్రీ పెట్టె ఎర్రని కంటితో చూస్తూ స్టీలు బిందెతో అంది
"ఎవరు తెచ్చారు !నిన్ను!
"అదే! రామలింగం -ఆయన ఏది తెచ్చినా కళ్ళకి నిండుగా ఉండాలంటాడు.
"ఆ!దీనికింత లాభం ఏదో పొందే ఉంటాడులే!పక్కనున్న ప్లాస్టిక్ డబ్బాలోని గొలుసు ఒళ్ళు విరుచుకోండి.తననయినా గొప్పగా చూసుకొంటారేమో అనుకొంది.వీళ్ళకి బంగారం అన్నా లెఖ్ఖ లేడుకాబోలు?అనుకొందిగోలుసు.ఆ మర్నాడు నౌకరు ఇంటి యజమానురాలు కలిసి అన్నిటిని సర్దారు.పాంట్ బట్ట చక్క బీరువాలో అడుగుకు వెళ్ళింది.
అబ్బ! మళ్లిజైలా ?అనుకొంది.
* * * * * *
అనుకోకుండా ఎరియర్స్ వచ్చాయి వేణు మాధవ్ కి ,చాలాకాలంగా సుజాతకి ఒక చీర కొని ఇయ్యాలని ఉహ.వాళ్ళాయన బోలెడు కొంటాడు.నిజానికి తను కొనాల్సిన అవుసరం లేదు.కాని అది ఒక కోరిక.తనుకొన్న చీర సుజాత కట్టుకొంటే చూడాలని.తీరా కొని ఇస్తే కట్టుకొంతుందో లేదో?అయినా కాని ప్రయత్నం చేస్తే పోయేదేముంది? కల్పనా షో రూములోనికి జొరబడ్డాడు వేణు.వేల్తూన్డగానే పూల చీర తలకి తగిలింది.అదే పాక్ చేయించి తీసుకు వెళ్ళాడు.సాయంత్రం ఆరున్నర దాటాక సుజాత ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడో సుజాత తనకి అప్పు ఇచ్చింది. అది ఇలా తీర్చాలని అనుకొన్నాడు.సుజాత అది అప్పుగా ఇవ్వలేదు.చీరకిదేమీ అర్ధం కాలేదు.పాకెట్లో గిల గిలా కొట్టుకొంది.తన యజమానురాలు ఎలావుందో?సుజాత పనిలో మునిగి వుండి.ఆమె భర్త తో కాసేపు మాట్లాడి వేణు పాకెట్ బల్ల మీద పెట్టాడు."ఇదేమిటి?"అన్నాడు సుజాత భర్త.
"అబ్బే!ఏమిలేదు.నిన్న మా ఆవిడ బజారు వెళ్లి చీరలుకోంది.ఈ చీర సుజాత కి బాగుంటుంది అనిపించి పంపించింది.అన్నాడు.
"ఎంత?అన్నాడు సుజాత భర్త.
అదేమీ వద్దు అని వేణు లేచి వెళ్ళిపోయాడు.
భర్త సుజాత నిపిలిచి చీర ఇచ్చాడు.
చిచి ఆవిడ నాకు చీర కొనదమేమిటి.కొంటె తనే తెచ్చి ఇయ్యోచ్చుగా మధ్య ఈ మాంధాత ఎందుకు? అనవసరం చనువు తీసుకొని పనులు చేసే వాళ్ళంటే నాకు మహా చిరాకు"అని ఆ చీరని పురుగులా విసిరేసింది సుజ్స్స్త."మళ్లి వస్తే ఇచ్చెయ్యండి"అంది.
"వెనక్కి ఇస్తే ఏమి బాగుంటుంది?చీర చించి రెండు ఓణి లు cheyyi,ఒకటి పనిపిల్ల పోచంమకి,రెందోదిమా కామ్పౌందర్ చేల్లెలికియ్యి.చిన్న వయస్సు లోనే పక్ష వాటం వచ్చి మంచంలో పడివుంది". అన్నాడు.
వాళ్ల మాతలువినగానే చీర గుండె రెండుగా చీలిపోయింది.ఏమి ఉహించింది తను?ఏమి జరుగుటింది?బల్లిలా వుండే పనిమనిషి ఒంటిమీదికా?మరోకతిరోగా గ్రస్తురాలైన కామపౌందర్ చేల్లెలికా?అనికుమిలింది.సుజాత వెంటనే నిర్దాక్షిణ్యం గా చీరని రెండు ముక్కలు చేసింది.చేరోకరికి అమ్పిందికూడా!
* * * * *
ఆఫీసరుగారి బామ్మరిదికి ఖర్చుకి చేతులో డబ్బులులేక ఆత్రంగా బీరువాలన్నీ వెదికాడు.ఏది తీసినా ఆచూకి తెలియ కుండా వుండాలి.బీరువా అడుగు అరలో అయిదారు పాంట్ బట్టలున్నాయి.అందులో ఒకటి పోయినా పట్టించుకోరులే!అని పంచెకట్టు ఆసామీ ఇచ్చిన పాంట్ బట్ట తీసుకొన్నాడు.అది పట్టుకుపోయి కనిపించిన రిక్షా వాడికి అమ్మి ఆపూటకి అవసరం తీర్చుకొన్నాడు.పాంట్ కుట్టించుకొన్న క్షణం నుంచి వదల లేదు గంగన్న.వానలో ఎండలో అదే శరణ్యం.కనీసం ఒక్కసారి ఒళ్ళు రుద్దుకు స్నానం చేయాలనిపాంట్ కోరిక,rప్చ్ తీరలేదు.రిక్షాలోంచి పెట్టెలూ,బెదాలూ లాగుతూంటే పాంట్ కోర్రులు పట్టిపోయింది.తెల్లటి మాసికలు వేయించాడు గంగన్న. పోనీ ఇప్పుడయినా నన్నోదలకూదడూ?అనుకొంది పాంట్.
చాలా రోజులకి రిక్షాలో తనకు తెలిసిన చీర hకనిపించింది పాంట్ కి .కాని సగామయిపోయింది.తనకంటే మురుకిగ అయింది.బాగా ఎరుగున్నాడుకనక తను గుర్తు పట్టాడుకానిమరోకరయితే పూల చీరని గుర్తు పట్టే వారే కాదు.
"బాగున్నావా?" అని పలకరించాడు.
ఉలిక్కిపడింది సగం చీర.అటూఇటూ చూసింది.రిక్షా గంగన్న వంటిపై మాసికలతో పాంట్ బట్ట.అయ్యో!ఎలా అయిపోయాడో!
'చూస్తున్నావుగా?"అంది.
"నేనూ నీలాగే " షాపులో బతుకే బాగుంది.పాట ముందు వచ్చే వాయిద్యం లాగా జీవితం ఉహలలోనే బాగుంటుంది.చాలా nరోజులకి క్యలిసాం.ఎప్పుడయినా కష్టం,సుఖం కనుక్కొంటూ హుషారుగా ఎగిరింది ఓణి -అంటే రిక్షా చక్రంలో చుట్టుకుపోయి కట్టిరించుకు పోయింది.మిగిలిన కాస్త ముక్క గుండెల కడ్డం పెట్టుకొని పరుగెత్తింది పనిపిల్ల. aసైకిలు చక్రానికి అజేబులో కుక్కు కొన్నాడు రిక్షా వాడు,ఉతుక్కొంటే మొఖం తుడుచుకొందుకు పనికి వస్తుందని.పాంట్ జేబులో ముడుచుకు కూర్చున్న చీరముక్క ఇప్పటికింతే చాలు అనుకొంది,కన్నీళ్ళలో పన్నీటి పరిమళాలు నిండాయి
No comments:
Post a Comment