Pages

Sunday, November 29, 2009

పూల చీర -2

పాంట్ సంతోషంగా "నేచేప్పానా!చూడుఆవిడ కొంతున్దిలే వెళ్ళు వెళ్ళు.'అంది.

శాపుకుర్రవాడు కర్రతో చీర కిందికి దించాడు.ఒళ్ళు ఝల్లు మనేలా ఒకసారి విడలించాడు.గాలిలో తేలిపోతూ చీర లోపలికి వెళ్ళింది,వచ్చిన ఇల్లాలు చీరపట్టుకొని తిరగ మరగ చూసింది.పువ్వులను గోటితో గీకింది.పమిట కొంగు చేతి మీద వేసుకోండి.

"ఎంతబ్బాయి ఇది?అంది.వాడు చీరంతా వెతికి ఒక మూల వేసిన అంకెలు చూసి"అరవై నాలుగు"అన్నాడు."నాలుగు కూడా ఎందుకుపైన?అని ఆవిడ మూతితిప్పింది.

చీరలు చూస్తోంది.దాతియైన రంగుల్లో ఉలిపిరి కాయితాలలా వున్నయవి.ఈ ఇల్లాలు చేతిలో చీరనలా వదిలేసిఅటువంగి ఆచీరలు చూడటం ప్రారంభించింది.ఆ పడుచు రెండు చీరలు ఏరి పాక్ చేయమంది.గుమాస్తా ఆ చీరల్ని లున్గాగా చుట్టి నౌకరు మొహం మీద విసిరేసి,పాక్ చేసి,బిల్లు రాయిన్చారా!అన్నాడు.చెప్పకుండా మొహం మీద పన్నీరు జల్లి నట్లయింది,ఇల్లాలికి.తనూ అదే తీసుకొంటా ననుకొంది.

అవి ఎంతబ్బాయ్? అని అడిగింది.

"ఇవండీ!ఎనభై మూడు అన్నాడతను.చీరమాడట పెడుతూ.చీర ధర వినేసరికి భర్త జ్ఞాపకం వచ్చాడు ఇల్లాలికి .ఏరీ!ఈయన!అని వెతుక్కొంది.తన తాలూకు పెద్దమనిషి వాకిట్లో నిలబడి పాంట్ బట్టల రెట్లు పరీక్షిస్తున్నాడు.ఆ ఇల్లలికి భయం వేసింది.కొంప దీసి అందులో ఒక పాంట్ ఆయనకీ నచ్చిందంటే,చెల్లెలికి చీరకి డబ్బు చాలదు.గబా గబా బయటికి వచ్చి "ఒసారిలా రండి."అంది.

నేనెందుకు?నువ్వు చూసుకో!

చూసానులెండి.మీరుకూడా ఒకసారి చూస్తె-

ఆ ఇల్లాలు ఉద్దేశ్యం చీర చూసి సెలెక్టు చెయ్యమని కాదు-ఖరీదుకు,ఊ అంటాడా లేదా?అని.ఆయన తప్పని సరిగా లోపలికి వచ్చాడు.ఆవిడ తను ఎన్నిక చేసిన చీర పరచి"ఇదుగో!ఈచారాల్ చీరండీ!బాగుందికడూ!

నీలంచారలమీద,పచ్చని పువ్వులు కొట్టొచ్చినట్లు న్నాయి.అంది.పూలేమోకానీ,ఖరీదు ఆయన్ని కొట్టింది.కాని వద్దనడానికి వీలు లేదు.రెండు రోజుల్లో మరదలు పెళ్లి.ప్రెజెంటేషను ఇవ్వాలి.తనయితే అట్లాకాడో,అప్పడాల కర్రో చదివిన్చేవాడు.కాని ఆవిడ రాత్రివేళ చల్లగా ఏమండీ మా చెల్లెలికి బాగా గుర్తుండేలా మంచి ప్రెజెంట్ ఇయ్యాలి,వెండి దేదయినా ఇస్తే నాలుగు కాలాల పాటువుంటుంది"అంది."ఇయ్యి,ఏదైనా ఇంట్లో వుంటే"!అన్నాడు.

"ఇంట్లోనా!భలేవారే!ఎప్పుడయినా చూసారా?అంది.

సరే!వెండి లోంచి వలువల్లోకి తెచ్చేందుకు ఆర్ధిక శాస్త్ర మంతా అప్ప జెప్పాల్సి వచ్చింది.అంచేత మాట్లాడకుండా "ఊ!తీసుకో!'అన్నాడు.వెంటనే ఆ చీర తీసుకోండి ఇల్లాలు.పూల చీరని తెచ్చిన దానికంటే విసురుగా తీసుకెళ్ళి వాకిట్లో పైన తగిలించాడు కుర్రవాడు.పూల చీర పాంట్ వంక చూడలేక తల పక్కకు తిప్పుకొంది.పాంట్ ఎవరికీ వినపడ కుండా"ఏయ్ !ఓయ్!అంటూ పిల్చింది.అరగంటకి తల తిప్పి చూసింది పూల చీర.



No comments: