చెళ్ళపిళ్ళ వారు బందరు నుండి వెళ్ళిపొయే ముందు విశ్వనాథ వారు వ్రాసిన పద్యాలు.
ఎవ్వారి సత్కీర్తి మృగనేత్ర చీర కొంగుల
నాల్గు నాల్గు దిక్కులుగ దనరు
ఎవ్వారి కవితా మృగేఖ్సణ నవ్వుచు
రాజుల తోడ సరాగ మాడు
ఏరి పదాంబుజాహీన మరండంబులల
శిష్య కోటి కాపోశనములు
ఎవ్వారి వాగ్వధూ నృత్యంపు ఝణఝణ
మ్రోతలు భారతి మొల్క నవ్వు
వేరి వాక్చండి కుకవుల మీరి బండుచును
గ్రుతస్నుల విహరించుసోకుమీర
నట్టి మీరలు మమువీడి యరుగుదురని
విన్న నామది బెదరెనో వెంకటేశ!
కనరా బిడ్డలపోల్కి సేవలను మీ కల్యాణ పాదమ్ములా
దునుగా మున్ను శతావధాన రమ చేతో మోద మేపారనే
లిక మీ హస్తము మా శిరమ్ములను నిల్చిన్ బుజ్జగింపంగ నే
డెనయన్ మమ్ముల వీడిపోవుటకు కాళ్ళెట్లాడు మీకున్ గురో!
ఈయూరెందుకు వత్తురింక నెచటేనీ కానుపించంగ గ
ందోయిన్ చూర్తిగ నాస తీరమొగమందున్ గాంచుటే కాని ఏ
మీ!యెచ్చోటను గానుపించుటయెలేదే యంచు నోరార న
బ్బాఈ యంచు బల్కరించు ఘనులెవ్వారింక నో దేశికా!
మాపయి కోపమా!కరుణ మాన్ర్దరా!యిది మీకు న్యాయమా!
మాపయి నిన్ని నాళ్ళనుపమానకృపంగన బర్చి నేటి కే
పాపము లేని మమ్ములను బందరు నందున దించి పోవగా
నోవుదురెట్లు మా మనము లూగెడు మీపద మిట్టూలట్టూలన్
మిగులగ విద్దెనేరిపిన మిమ్ముల వీడూటా!ఇంతవారి నింతగ
బొనరించినట్టి తలితండ్రుల వీడుట నేనెరుంగ మా
కు గురుతరంబు ముందుగన గోయియు వెంకకు నూయి యన్న
ట్లగుపడుచుండె దోచదుగ దారొకటేనియు మా మనంబులన్
కొందరు మీకడన్ చదువుకొన్న గుణాఢ్యులు ,కొందరెచ్చటో
పొందుగ చద్వి ,ప్రేమ గురువుల్ తగ మీరనిచెప్పువారలున్
కొందరు మీ మొగమ్ము గనుగొన్న కవిత్వము చెప్పు వారలీ
యందరి శీష్యులన్ విడిచియా!జనుటల్ గురునాథ తెల్పుమా!
ఆడకు బోవరాదనుచు నంద మటన్నను కాని మాకు నో
రాడదు చిన్ని తమ్మునికి నై వెస నాతని పైన జల్లి జ
ల్లెడు,పూలున్, సుహాసములు ఎంతయు వచ్చియు రాని మాటలున్
గోదిగ వేయు తప్పటడుగుల్ మురిపమ్మున జూడ నేగగా!
3 comments:
:)
Namaskaram maammagaaru,
mee blogs rendu chaalaa baavunnayi...
maalaanti vaallaki meeru raase vishayaalu chaalaa upayogakaramgaa unnayi. meeru inkaa ilaanti vishayaalu raayaalani korukuntunnanu...
Durga Prasuna.
Post a Comment