Pages

Saturday, September 4, 2010

కృతజ్ఞత





ఒక అడవిలో సింహం చిత్తుగా దెబ్బలుతిని చావడానికి సిద్దంగావుంది.

ఒకామె జాలిపడి సింహాన్ని తనతో తీసుకు వెళ్లి మందులు వేసి, సేవ చేసింది.కొన్నాళ్ళకి సింహం వెనుకటిలా ఆరోగ్యంగా తయారయింది.

తర్వాత ఆమె జూ వాళ్లకి కాల్ చేసి ఈ సింహాన్ని వాళ్ళు తీసుకు వెళ్లి రక్షణ కల్పించాలని కోరిందట. వాళ్ళు వచ్చి సింహాన్ని తీసుకు వెళ్లి, జూ లో పెట్టి కాపాడారు.

కొన్నాళ్ళు గడిచాక ఆమె సింహం ఎలావుందో! చూద్దామని జూకి వెళ్ళింది.బోను కటకటాలకి ఇద్దరు చెరో వైపు వున్నారు. సింహం ఆమెను చూడగానే ముందుకాళ్ళు రెండూ బయటకు చాపి ఆమె భుజాలపై వేసి ఆమె తలను దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టుకొంది.ఆమె తలని తన మెడ దగ్గరగా చేర్చుకొని,తన తలను ఆమె తలపై పెట్టి ప్రేమను,కృతజ్ఞతను వెల్లడించింది . ఇది వింటే నాకనిపించింది-


ప్రేమకి లొంగని దెవరు?
ప్రేమించడం తెలిస్తే
సేవకు మురియని దెవరు?
సేవ చేసే దోవ తెలిస్తే!
పశువులో మానవత్వం
పశుత్వం లో మానవత్వం
ప్రేమా సేవల -కలిమి-లేములే!

5 comments:

శ్రీలలిత said...

అద్భుతంగా వుంది..

gajula said...

pashutvamtho polchukunte maanavatvam uniki lekundaa pothundi.gamaninchandi.

శ్రీనివాసరాజు said...

అవును ప్రేమకు లొంగని దెవరు?

భావన said...

అవునండి ప్రేమకు మరి లొంగనిదెవరు..

పరిమళం said...

కొందరు మానవులు పశుత్వం అలవరచుకొంటుంటే ...పశువులు మానవసహజమైన కృతజ్ఞత , ప్రేమాభిమానాలు చూపడం అద్భుతమే !