చిలకమర్తి వారి వర్ణన
ప్రకాశం గారు,చిలకమర్తివారు సహాధ్యాయులు.టంగుటూరి వారికి వల్లెవాటు అలవాటు చిన్నతనం నుండి ఉండేదట .ఆరోజుల్లో ధవళే స్వరంలో జరిగే ఉత్సవానికి ఇద్దరూ వెడుతూ వుండేవారట .ఒకసారి ఆ యాత్రలో టంగుటూరి వారిని వర్ణించారు చిలక మర్తివారు.ఆ పద్యం ఇది-
సీ-ఈగ వ్రాలిన గాని వగా జారేడు నట్లు
మవ్వంపు కురులను దువ్వినాడు
వరలలాటమునండు తిరు చూర్ణ రేఖను
ముద్దుగారేడు భంగి దిద్దినాడు
అరుణ పల్లవ మట్లు కరము రంజిల్లు,చెం
గావి వస్త్రంబును గట్టినాడు
చారలన్గారఖాను జక్కగా ధరియించి
వలె వాటు కండువా వైచినాడు
చెవుల సందున గిరజాలు చిందులాడ
మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త
టంగుటూరి ప్రకాశము రంగు మెరయ
ధవళ గిరి తీర్ధము నకును తరలివచ్చే!
No comments:
Post a Comment