కృష్ణా పత్రిక
అందరికి శుభోదయం
పైన ఇచ్చిన మూడు బొమ్మలు కృష్ణా పత్రికలోని వి. మొదటిది మా నాన్నగారు వారం వారం వ్రాసే "వడగళ్ళు" హాస్యప్రధానమైన వ్యాసానికి వేసేవారు.రెండవది మానాన్నగారు కృష్ణా పత్రికలో "పాలవెల్లి ' అనే నవలకు వేసిన బొమ్మ .ఇక మూడవది పూజ్యులు శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు వ్రాసే సంపాదకీయానికి వేసే బొమ్మ.ఈమధ్య ఎక్కడో పంతొమ్మిది వందల యాభై లోని కృష్ణా పత్రిక దొరికింది. ఈబోమ్మలు అందరికి చూపిద్దామని పెట్టాను.కృష్ణాపత్రికలో తోట వెంకటేశ్వర రావు గారు చిత్ర కారుడుగా వుండేవారు,ఎంత అందమైన బొమ్మలు వేసేవారో!ఉత్తమ కళాకారులని తలుచుకొంటే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఇక ముట్నూరివారు
గగన వీధిలో మబ్బుల రధంపై ఎంత ఠీవిగా చేతికర్ర పుచ్చుకొని కూర్చున్నారో,అంట థీ వి గాను ఆఫీసులో వుండేవారు.నా చిన్నతనంలో క్రిష్ణాపత్రికే నా ప్రపంచం.అది మాకుటుంబానికి స్వర్ణ యుగం ఇప్పటికి బందరు,కృష్ణా పత్రిక తలుచుకోగానే నా మనసు ముద్దయిపోతుంది.కళ్ళు చిప్పిలుతాయి.
1 comment:
అరుదైన జ్ఞాపకం అందించారు . బాగున్నాయి .
Post a Comment