Pages

Wednesday, June 29, 2011

మా పెరటిలో పూలు


మా పెరటిలో పూలు 






                                        మా పెరట్లో   పూసిన   పూలు 


బజారు వెళ్లి  కూరలు,పళ్ళు,  పూలు కొంటె     కొట్టువాళ్ళు చెప్పిన  ధరకి    సగం తగ్గించి  బేరం 
మొదలు పెడతాము .అవన్నీ వాళ్లకి ఆకాశం నుంచి జారి పడ్డట్టుగా   వారిని ఉద్ధరించడానికి   కొంటున్నట్లుగా  
మొహం పెడతాము.  ఇల్లు కట్టి చూడు ,పెళ్లి చేసి చూడు  అన్నట్లుగా  మొక్కపెంచి  చూడు అంటాను నేను.
విత్తనం భూమిలో   పాతిన  మరుక్షణం నుండి    మనసు రాబోయే   అంకురాన్నే  తలుచుకొంటూ  వుంటుంది.
భూమిని  చీల్చుకొని మొక్క అంకురించి,మారాకు వెయ్యగానే   అది ఎప్పుడు ఎదుగుతుందా! ఎప్పుడు పూలు,పళ్ళు ఇస్తుందా?అని వేయి కళ్ళతో ఎదురు చూస్తాము.ఒక్క పువ్వు పూస్తే,ఒక్క కాయ  కాస్తే అపురూపంగా చూసుకొంటాము.

పెంచిన  ప్రేమలోని  తియ్యదనం  అట్లాంటిది.  మా అబ్బాయి  అమెరికాలో మంచి పెరడు వాకిలి వున్నా ఇంట్లో ఉంటాడు. కిందటి సంవత్సరం నేను అమెరికా   రాలేదు. మా అబ్బాయి  నాలుగు రోజుల కొకసారి  ఫోన్ చేసి    ఎండా  బాగా వుంది.నువ్వు రాలేదు వస్తే మంచి మొక్కలు  పెట్టె వాళ్ళం , మేమే ఏవో  టమోటా అవి పెట్టాము.అనేవాడు. ఈమాటు అన్ని అనుకూలించి అబ్బాయి  దగ్గరికి వచ్చాను. రాగానే కొన్ని మొక్కలు,కొన్ని విత్తనాలు తెచ్చాము.
పాతది  ఒక పొద లాటిది వుంది.ఆకులు మొగలి రేకుల్లా వుంటాయి. దానికి పూలు,కాయలు ఏమిరానట్లున్నాయి,పీకి పారవేస్తే సరి అంది మా కోడలు. కొన్నాళ్ళు చూదాము అన్నాను,నేను ఇక్కడనుంచి ఇండియా  వచ్చాక మా అబ్బాయి మెయిల్ లో ఒక ఫోటో పెట్టాడు.  ఆపొద  పెద్ద గుత్తి వేసి  విరగబూసింది.నయం పీకి పారవేసాముకాదు  అనుకొన్నా. ఎండలు మొదలెట్టాక  దానికి  నీళ్ళు పోయడం మొదలెట్టాను.ఒక్క వారం లో  ఆపొద   లో  మూడు    మూడ  పెద్ద కాడలు వచ్చాయి చిన్నగా తరిలాకులాగా ఆకుపచ్చాదనం,దానిపై  చారలా  ఆకు పచ్చ రంగు  వచ్చాయి.మరో వారంలో   తక్కిన రెండు కాడలు పున్జుకోన్నాయి.   ఇవాళ నీళ్ళు   పోయడానికి  వెడితే మొదటి కాడకు రెండు మోగ్గలునిమ్మకాతంతవి  వచ్చాయి.  మొగ్గ తొడిగిన  మొక్కను  చూస్తె  నాకు సూలింతరాలులా     అనిపిస్తుంది    నాకు.అవే  ఫోటోలు    పెట్టాను.  గులాబీలు అలాగే  విరగబూసి బరువుకు ఒరిగిపోయాయి.ఈతెల్లపూల  పొద  పక్కన సుకుమారంగా    ఒక మొక్క  పెరిగింది.  నిండా  మొగ్గలు వచ్చాయి. మొక్క సుకుమారం  పూలూ సుకుమారమే   లేత  గులాబి  రంగులో   పూసాయి.మొన్న గాలివాన  వచ్చి ఒక కొమ్మ్క నేలకొరిగింది.  దాన్ని దారంతో  పక్క ఫెన్సింగ్ కు  కట్టాను. అందులోనే ఒక మొక్కకి    చంద్ర  కాంత  పువ్వు రంగులో రెండు పూలు  పూసాయి.ముద్దుగా వున్నాయి.
           
 ఎండాకాలం పూసే పువ్వుల విత్తనాలు    వాకిట్లో బుష్ ల పక్కగా వేసాను.  అవి మొలకెత్తాయి.
పక్క వేపు టమోటా మొక్కలు,కాబేజీ,కాలి ఫ్లవరు,ఏవో రకాల పచ్చి మిర్చి మొక్కలు వేసాము. టమాటోబుద్ధిగా పూలు పూసింది.  వాటి  పెరుగుదల తరవాత వ్రాస్తాను.   మొక్కల  మధ్య తిరు గాడితే  ఎంతొ హాయిగా వుంటుంది.      

4 comments:

Prashanth said...
This comment has been removed by the author.
జయ said...

చాలా చక్కటి పూలు పూయిస్తున్నారు. ఎంతబాగున్నాయో.

soujanya said...

Poolu bagunnayi.

Veda Tatavarty said...

amma ...flowers look great!!!!