ఇక్కడ వెనక వున్నది ఫెన్సింగ్ తెరకాదు సుమా! బుంగ మిరప మొక్కలు బుద్ధిగా వరసగా ఎలా నున్చున్నాయో?
ఇది ఆకుచాటు పిందే !
బీన్స్ లేత గా సుకుమారంగా వున్నాయి కదూ!
ఇవి టమాటాలు , గుత్తుగా స్నేహంగా వున్నాయి.
ఇవి వంకాయలనుకొంటున్నారా? కాదండి ఇదొకరకం టమాటాలుట.
పచ్చి మిర్చి మహా ఘాటు ,ఎంత ఠీవిగా వుందో చూడండి. అసలా రంగు, ఆ లేతదనం చూడగా చూడగా మరీ సోకుగా కనపడతాయి.
దీన్ని ఏమంటారో తెలియదు.
పల్లెటూరి పడుచులకి సంకేతాలు బంతిపూలు పొదుపుగా రెండు విచ్చుకొన్నాయి.
ఈ తెల్లపూలు కోమలంగా చిన్న నక్షత్రాల్లా వున్నాయికదండి.
ఈరంగు లేత వంకాయ రంగు మంచి కుటుంబ సభ్యులందరూ కూర్చుని మాట్లాడుకోన్నట్లున్నది
ఈ పూలగుత్తి. ఇవండీ, వేసవి సోయగాలు.
1 comment:
చాలా బావున్నాయండి
Post a Comment