Pages

Thursday, July 28, 2011

గేయం

                                              నాటకం
        జీవితం 
      ముందే వ్రాసి పెట్టిన 
      నాటకం 
     ముందెప్పుడూ 
    చూడని 
    నాటకం 
    జీవితం 

    ఎదుట ప్రేక్షకులు 
    ఉన్నారన్న  
   మాటే మరిచి 
   ఆడే నాటకం 
  జీవితం 
                
 పైన దేవుడు 
  ప్రేక్షకుడై 
 చూస్తున్నాడని 
మరిచి 
 ఆడే నాటకం 
 జీవితం 

ఎప్పుడే రంగస్థలం మీద 
ఆడుతమో తెలియని 
నాటకం 
జీవితం 
 పక్కనుండే
వారు ఎవరో 
వారి పతా తెలియని 
నాటకం జీవితం 
 మాట వెనుక మాట 
వాక్యం వెనుక వాక్యం 
తోసుకొస్తే 
వాగుతున్న
నాటకం 
జీవితం 

రాగాలు పాడినా
వినని నటులు 
అనురాగాలందిన్చినా
అందుకోలేని మూఢ మతులు
జీవితమంతా 
కలిసి బతికినా 
చేతులుకలపని 
నటులు దొరికిన 
నాటకం జీవితం