ఏదీ నా హృదయం?
ఏదీ నా హృదయం?
ఎక్కడో పడిపోయింది
ఏదీ నా హృదయం?
నన్నేపుడో వదిలి పోయింది.
రాలేను జీవా !రాలేను!
పువ్వు చూస్తె హర్షించలేని నీ మనసు
నవ్వు వింటే పులకించలేని నీ తనువూ
నాకొద్దు జీవా నాకొద్దు
అందమైన చిత్రం చూస్తె హాయి పొందని నీ మనసు
జలపాతం హోరు విన్నా చేతులు కదలని నీ తనువూ
నా కొద్దు జీవా! నాకొద్దు
సెలయేటి ఒడ్డున కూర్చున్నా సేదతీరని నీ మనసు
శ్రావ్య మైన గొంతువిన్నా చిన్డులేయ్యని నీ తనువూ
నాకొద్దు జీవా!నాకొద్దు
రాలేను మరలి రాలేను
నన్నిలా సాగిపోనీ !గాలిలో ఆడుకోనీ!
నీటిపై తెలిపోనీ !వెన్నెల్లో తాన మాదనీ n
No comments:
Post a Comment