గుండెకోత
అయిదు ప్రాణాలు గొంతులోకోచ్చి
కళ్ళు రెండు జలపాతాలై
చీకటి గోళం లో ఈడులాడిన రోజు
ప్రియమైన ప్రాణి కళ్ళు కూసుకొని
మంచు ముద్దలా పడివుంటే
చైతన్యాన్ని ప్రసాదించమని
వెయ్యి చేతులతో, వెయ్యినోళ్ళతో
భగవంతుణ్ణి వేడుకొన్న ఆ రోజు
నా ఆయుష్షు నా బంగారానికియ్యమని
బ్రహ్మ దేవుణ్ణి బతిమాలుకొన్న ఆ రోజు
పిచ్చి చూపులతో ఆసుపత్రి గోడల్ని
చిల్లులు పొడిచిన ఆరోజు
బ్లాక్ డే బ్లాక్ డే
"పిలుపులో లోపం లేకపొతే పరమాత్ముడు
తప్పక పలుకుతాడు"
అనే సత్యాన్ని నిజం చేస్తూ
పరమాత్మ కరుణించాడు
ప్రియమైన ప్రాణం కళ్ళువిప్పింది
"అమ్మా! అని పోలిచింది
ఆకాశాన్ని,సముద్రాన్ని,భూమిని
కొలవలేనట్లే
నా ఆనందాన్ని కొలవలేము
ఆ క్షణం
నేను బతికా! నేను బతికా
No comments:
Post a Comment