మాషీమా ను చూశానోచ్
మా కోడలు నేను లాంగ్ వీకెండ్ కి ఆటవా వెళ్దా మనుకోన్నాం , చాలా ఏళ్ళు అక్కడ వుండి వచ్చాము, అందరిని చూడాలి. నాలుగు రోజులు ఎమూలకి? మా అబ్బాయికి ఎక్కువ సెలవు పెట్టడం కుదరదన్నాడు. సరే మేమిద్దరమే బయలు దేరాం .మధ్యలో లండన్ ఒంటారియో లో ఆగి మనవాన్ని చూసి మర్నాడు బయలుదేరాం. ఆటవా చేరువవుతున్న కొద్ది ఆత్రం పెరిగి పోయింది. వెళ్లేసరికి సాయంత్రం నాలుగు అయింది. బాగా అలిసిపోయాము. పైగా ఆరాత్రి ఒకరింట్లో సప్పర్ ,అక్కడికి నాలుగు కుటుంబాలు మమ్మల్ని కలవడానికి వస్తున్నారు. మానడానికి చాన్స్ లేదు. రాణి ,దేవెంద్రాల తో కాసేపు మాట్లాడి, తేనీరు సేవించి ఫ్రెష్ అయి వెళ్ళాము. పోద్దుపోయివచ్చి పడుకోన్నాము. మర్నాడు పొద్దున్నే తయారయాను, మా కోడలు నన్ను మాషీమా ఇంటిదగ్గర విడిచి సెంటర్ కి వెళ్ళింది. మా షీమా వియ్యపురాలు "బహెంజి "వచ్చి తలుపుతీసింది, మాషీమా కనపడదేమి? నాకు ఖంగారు పుట్టింది,వూరు వె ళ్ళలేదు కదా? నే వస్తున్నానని తెలిసి ఎలా వెళుతుంది? అయినా వెంటనే కనపడక పొతే దిగులు.బెహంజి చెప్పింది మా పైన పూజ గదిలో వుందని ,హమ్మయ్య అనుకొన్నా, పూజలో విఘ్నం కలిగించడం తప్పుకదా?బెహన్ జి ఏదో చెపుతోంది కాని చెవుల్లో పడటం లేదు. చెవులు మెట్ల మీదినుంచి మాషీమా దిగే సబ్దంకోసం రిక్కిన్చుకొని వున్నాయి. కళ్ళు అటువేపే!
కొంచెం సేపటికి మా దిగివచ్చింది. ప్రేమగా గుండెల కట్టుకొని నువ్వు ఎప్పుడో ఒకప్పుడు వస్తావని అనుకొంటూ చూస్తూనే వున్నా!అంది. ? ఎంతహాయి? ఎంత తృప్తి? ఎంత సంతోషం? ఇంతటి పవిత్ర బంధం ఏజన్మ లోదో! మొదటిసారి మాని చూసినప్పుడు మా అమ్మ కట్టుకొన్న చీర లాటిచీరే తెల్లటి చీర మామిడి పండు రంగు అంచు. ఆ చూపుతోనే మా అమ్మ బతికి వచ్చిందేమో అనిపించింది. కిందటి ఏడాది మా ఇండియా వచ్చింది,కాని నేను కలవ లేకపోయా,ఇక జన్మలో కలవ లేనేమో అనిపించింది.యుఎస్ వచ్చినా కెనడా వెళ్ళ గలనని ఏమాత్రం నమ్మకం లేదు. కాని బచ్చేసాను. మా పక్కనే కూర్చుని బిస్కెట్ తింటావా!కేక్ తింటావా! ఇంట్లో కుకీస్ చేసాం తిను అని ఒకటేపోరు. నాకు తిండి ఎందుకు? ఎక్కడా దొరకని ఈ ఆప్యాయత ముందు అన్ని బలాదూర్ అనిపించింది. నాకు ఇవ్వడానికి కుట్టు సామాన్లు ఏవేవో దాచి పెట్టింది. ఇది పట్టుకుపో,అది పట్టుకుపో, నీకోసమే దాచి పెట్టా అంది. కాదని ఎలా అనగలను. అహర్నిశం తన పర అనే బేధం లేకుండా సేవ చేసే ఆసరీరానికి సత్తువ తగ్గిపోయింది. అనారోగ్యానికి బలి అయింది. అయినా ఇప్పటికి వందిపెట్టాలని తాపత్రయం. "వీళ్ళు నన్ను బాక్ యార్డ్ లోకి వేల్లనియ్యారు, కిచెన్లోకి రానియ్యరు ఏమిచేయ్యను? అంది.ఇంకా ఏమిచేస్తావుమా! శాంతి గావుండు అన్నాను. నువ్వు వస్తావని పొద్దున్నే అన్ని పారాయణాలు పూర్తీ చేశా.అని ఎ రోజు ఏమి చదువు వుతుందో చెప్పింది. ఆవేళ హడావుడిలో మెళ్ళో పూసల దండ వేసుకోకుండా వెళ్ళా,చుఉడగానే"ఏది చైను? వేసుకో! నీకోసం కాదు,నీసంతానానికి మేలు కోసం "అని దబాయించింది. పర్సులోంచి తీసి వెంటనే వేసుకొన్నా. ఇంతలో మా స్నేహితురాలు ఇందు కూడా అక్కడికి వచ్చింది. ముగ్గురం పాత కబుర్లు చెప్పుకొన్నాము. సాయంత్రం వచ్చేసాను,మల్లికలుస్తానని ఘట్టి నమ్మకం తో! కాని కలవ లేకపోయాను. ఒకటే తిరిగాము. కాని మా ను చూడగాలిగినందుకు భగవానునికి ధన్య వాదాలు చెప్పుకొన్నా. తీసికేల్లినందుకు మా కోడల్ని మెచ్చుకొంటూ ఇంటికి చేరా.

1 comment:
మనసును కదిలించి, అనుభవించే అనుభూతులుకదా..
మీకు ప్రీతిపాతృలైనవారిని కలిసినందుకు అభినందనలు..
Post a Comment