Pages

Friday, September 9, 2011

వ్యాసాలూ - కంప్యూటర్ సంసారాలు

                                    కంప్యూటర్     సంసారాలు

                                    ఏదైనా నవీన  మైన     ఉపకరణాలు      తయారయినప్పుడు     వాటిని కొనుక్కోవాలని,
వాడుకోవాలని      తాపత్రయ పడుతూ  ఉంటాము.    అవి మన    ఆర్ధిక స్థితికి      అందుబాటులో   లేకపోతె  కొనుక్కొన్న   వారిదగ్గర   చూచి   సంబర  పడిపోతాం.     ఏదైనా   వస్తువు    కొనుక్కొంటే     దానిలో    నష్టాలేమిటి?కష్టాలేమిటి?లాభాలేమిటి?   ఉపయోగమేమిటి?    దాన్ని   ఎలా    కాపాడుకోవాలి?   ఇవన్ని  చాలా  మంది   ఆలోచించకుండానే     కొనేస్తారు.    మొత్తానికి     చాలా    మంది      కొంటారు.     ఇప్పుడు  కంప్యూటర్ ,లేక లాప్టాప్ అందరికి అందు బాటులో     వున్నా ధరలకే      దొరుకుతున్నాయి.  ఇవి ఆఫీసుల్లో ,నిత్య జీవితంలో     అల్లుకు పోయాయి.   నోరెత్తకుండా దీనితో    పనులు   చేసుకు పోవచ్చు.
                                                  మావదిన    అన్నయ్య     ఇద్దరు   ఉద్యోగాలు చేస్తున్నారు.   సాఫ్ట్ వేర్    ఇంజినీర్లు.డబ్బు    బాగానే    సంపాదిస్తారు.   మా  వదిన  కొన్ని రోజులు     ఇంట్లోంచే   పని చేస్తుంది. ఆరోజుల్లో  తెల్లవారు   ఝామునే    వండి  పెట్టేస్తుంది.    మొన్న  వాళ్ళింటికి  వెళ్లాను.   అన్నయ్య    పైన  కూర్చున్నాడు, లంచ్ టయిం అయింది.    భోజనం   చెయ్యండి  అని   మెయిల్ పెట్టింది.    పైనుంచి అన్నయ్య    దిగివచ్చి    నాకు, తనకి  టేబుల్ సెట్   చేసాడు.భోజనం    మర్నాడు   ఆదివారం    అప్పుడు  కూడా    మా  వదిన     అన్నయ్యని  భోజనానికి మెయిల్    లోనే   పిలిచింది.    "అదేమిటి  వదినా అంటే    " ఇవ్వా ళేగా      పర్సనల్ మెయిల్స్ అవి  చూసుకొనేది.అందుకని    "అంది.  కాలిక్యు లెటర్స్   వచ్చాక    ఎక్కాలు  గుర్తు పెట్టుకొనే  పనే  పోయింది.  కంప్యూటర్స్   వచ్చాక    పిలుపులు    కూడా    పోయాయి.    
                                             మొన్న వినాయక చవితికి       కావలిసిన   సరుకులన్నీ    ఇంటావిడ    భర్తకి మెయిల్    చేసింది     ఆయన తెస్తాడు   కదా   అని       ధైర్యంగా     వుంది ,భర్త    పొద్దుపోయాక    చేతు  లూపుకొంటూ   ఇంటికి వచ్చాడు. "సరుకులేవి?'  అంటే     ఏమి సరుకులు ?అన్నాడాయన .  మీరెప్పుడూ   ఇంతే 
పూజకి కావలసిన   సరుకులు    లిష్ట్   మెయిల్    చేసాకదా?మిమ్మల్ని    నమ్ముకొని     ఇండియన్   స్టోర్   కి 
వెళ్ళకుండా వచ్చా.నాకేమి తెలుసు ?మెయిల్      పెట్టానని   ఒక     ఫోన్    చెయ్యలేకపోయావా? "బాగానే  వుంది
సౌదిబ్యం    అక్కడ    ఈమధ్య    అరటి పిలకలు    కూడా   పెడుతున్నాడట.   తమలపాకులు   వుంటాయి కదా  పత్రీ  మాట ఎలావున్నా ఇవైనా      తెస్తారనుకొన్నా,   వీదినిండా    మొక్కలు చెట్లు  అయినా  లాభమేమిటి?  ఒక్కటి  ముట్టుకో కూడదు.   పైగా అన్ని పేరుకూడా  తెలియని    క్రోటన్సు      ఇలా    విసుగుతో     ప్రారంభ మయింది    .ఇవన్ని విని    వినాయకుడు     జాలి పడి  ఏదో  విధంగా      తల్చుకొంటున్నారు      చాలు.   అని  సరిపెట్టుకుని   ఉంటాడు.
                             వట్టి  పిలుపు లేమిటి?  పెళ్లి పిలుపులు    కూడా    మెయిల్    లోనేజరుగుతున్నాయి.  అమెరికాలో    వున్న       సుజాత కూతురు పెళ్ళికి     ఇండియా లోవున్న     సుభద్రని     రమ్మని     శుభ లేఖ 
మెయిల్   చేసింది    సుజాత.       సుభద్ర     తప్పకుండా    వస్తానన్నది ."నువ్వు వచ్చేటప్పుడు      వీలయినంత చిన్నవి రెండు   మంగళ సూత్రాలు   పట్టుకురా అని   మెయిల్     చేసింది.   ప్రయాణం  హడావుడిలో   ఆ మెయిల్
సుభద్ర   చూసుకోలా.  రాత్రికి పెళ్లి    అనగా     అమెరికాలో   దిగింది.   స్నేహితురాలు     వచ్చింది  కదా   మధుర మైన     ఈపెళ్ళి     వేడుక     ఇద్దరం     కలిసి      ఆస్వాదించ   వచ్చు అని     ఉబ్బి     తబ్బిబ్బయిపోయింది   సుజాత.    వీడియో     కోసం     ముఖ్య మైన   విధులు    జరపాలికదా    బ్రాహ్మణుడు    మంగళ సూత్రాలుతెమ్మన్నాడు.   సుజాత     సుభద్రని   "మంగళ   సూత్రాలియ్యి "అందిట.  సుభద్ర   నా    మంగళ   సూత్రాలివ్వ    మంటా   వేమిటే?   అంది   ఛాచా    నీవికాదే    నేను తెమ్మన్నవి!   నాకెప్పుడు చెప్పావే!  మెయిల్
పెట్టగా?   అయ్యో!నే వచ్చేటప్పుడు  మెయిల్   మెయిలే చూడలేదు .ఇప్పుడెలా?ఎలా?   అనుకొంటుంటే    పెళ్లి కొడుకు   తల్లి     పెద్దకోడలు   మేళ్లోవి  అడిగి  తీసుకొని     "మా  ఇంటి  పేరి    వాళ్ళు కట్టినవేగా    దీనితో   తంతు 
జరిపించండి    అందిట.
                  ఇలాటి తమాషాలు   జరుగుతూ  వుంటాయి   మొత్తానికి    అమ్మో కంప్యూటర్   లేకపోతె    ఎలాగా?
అని     అందరు    చింతా క్రాంతు లయ్యే టట్లు      ఎదిగి పోయింది   కంప్యూటర్ .

No comments: