ఈ సీతారామ లక్ష్మణ హనుమల విగ్రహాలను రాణి ఇంట్లో నిన్న నేను అలంకారం చేసాను. ఎప్పుడో ఒకసారి
రాణి ఇంట్లో శ్రీ రామనవమికి వెళ్లి నప్పుడు విగ్రహాలకు నేను అలంకారం చేస్తానులే తక్కినవి నువ్వు చూస్కో అన్నాను ,అవాళ నేను చేసిన అలంకారం అందరికి నచ్చింది. అప్పటినుంచి ప్రతి శ్రీరామ నవమికి రెండునెలల ముందునుంచి రాణి, వాళ్ళాయన రామచంద్రమూర్తి "ఏమండోయ్ !శ్రీరామ నవమి వస్తోంది, ఎక్కడికి వూరు వెళ్ళకండి,అని హెచ్చరించడం జరుగుతూనే వుంది. ఈమాటు కూడా అలానే హెచ్చరికలు హెచ్చుగా వినిపించాయి. క్రితం సంవత్సరం రాణి బ్రోకేడ్ సిల్క్ కొత్త డిజైన్ బట్ట కొనుక్కొచ్చింది. వాటికి జరీ అంచులు వేసి అన్ని విగ్రాహాలకి బట్టలు కుట్టాము. శ్రీరామా నవమి కల్యాణం చేసినతరువాత ఆ విగ్రహాలను అలానే బట్టలో చుట్టి రాణి పైన పెట్టేస్తుంది. మల్లి రామనవమికి తీసి నూతన వస్త్రాలు కడుతుంది.. ఈమాటు రాణి తెల్లజరీ దుస్తులు కుడదాము అని పంచెలు ఉత్తరీయాలు తెచ్చింది. దుస్తులు తయారు చేసి అలంకరించాము.భవాని మాకు నచ్చిన విధంగా కుట్టి పెట్టింది. పూజ మొదలుపెట్టి దండలు అవి వేసాక దుస్తులు బాగా కనపడవని ముందుగా తీసిన ఫోటో ఇది . వీలయినన్ని సంగతులు సురుచిలో మీతో పంచుకోవాలని అభిలాష.
ఇంతకీ రాణి ఎవరో మీకు చెప్పొద్దూ! నా స్నేహితురాలు వై .జయలక్ష్మి కూతురు. జయ నేను అర్ధ శతాబ్ది స్నేహితులం. మొట్టమొదట విజయవాడ హిందీ ప్రచార సభలో విశారద చదవడానికి వెళ్ళినపుడు తనని
క్లాసులో చూసాను. లేత ఆకుపచ్చ రంగు జరీ చారాల చీర కట్టుకొని,బిగించి వేసిన జడలో మందార పువ్వు పెట్టుకొని పాఠం వింటున్నది. మొదటి చూపులోనే అనుబంధం ముడి పడినది .స్నేహమంటే రుచితెలిసినప్పటినుండీ స్నేహితులమే! ఇద్దరం కలిసి ప్రవీణ ప్రచారక్ చదివాం, ఇద్దరం కలిసి కొంత కాలం ఒకచోట పని చేసాం ,కొన్ని పనులు చేయగలిగాం,కొన్ని చెయ్యలేకపోయాం.అయినా స్నేహం మాత్రం నిలుపుకోగాలిగాము.అందుకు భగవంతునికి లోలోపల ధన్య వాదాలు తెల్పుకొంటాం.
3 comments:
జ్ఞానప్రసూన గారు , విగ్రహాల అలంకరణ చాలా బాగుందండి . సీతారామలక్ష్మణ ఆంజనేయులు కళకళ లాడుతున్నారు .
జరీఅంచుల ధవళ వస్త్రాలలో సీతారాములు కళకళలాడిపోతున్నారండీ..
శ్రీరామనవమి శుభాకాంక్షలు..
decoratiojn chaala baagundi prasoona gaaru :)
Geetha - http://viriboni.blogspot.com/
Post a Comment