ప్రమదలందరూ చేరిరి
పలకరింపుల కొరకు
పకపకల నవ్వులకు
పసందైన విందునకు
మాలా కుమార్ గారు
మహా గొప్పగా తాను
భేషైన బిర్యాని ,పూరీలు
పెరుగు,అన్నాలు పంచుకొన్నారు
శ్రీ లలిత చేసేరు
సింగారముగా "చోలే"
వరూధిని చెల్లి ఓపిక తోడ
అందముగా "ఆవడలు "అమర్చి తెచ్చే
నేనేమి తక్కువని
గురువు జ్యోతమ్మ
"సాంబారు, బజ్జీలు కలిపిన మజ్జిగ పులుసు
వింతైన పచ్చళ్ళు "వేడుకతో చేసే
"అప్టు డేట్ "గాను "యాత్ర" లక్ష్మి గారు
సుకుమారముగా" చిప్స్ ,కోకోలు "అందించే
అన్నపూర్ణ గారు "పూర్ణాలు"చేసి
విందు భోజనముకు అందాలు తెచ్చే
సుజాత "మనసులో మాట "అందుకొని
తియ్య తియ్యని వంట తీసుకొని వచ్చే
రమణి తెచ్చెను " పులిహోర "రమ్యముగను
జీడిపప్పులు దండిగా పండుగయ్యే
మిగిలియున్నది ఏమింక మెప్పు వడయ?
నోరువున్నది తిని పెడుదు జోరుగాను
జ్ఞానప్రసూన
తెలుగులో బ్లాగులు వ్రాసే ప్రమదలందరూ కూడి వేడుక చేసుకోవాలని , అనుకున్నదే తడవు గబగబా ప్రయత్నాలు చేసుకొని, ఈవేళ మాలాకుమార్ గారి ఆలీషాన్ భవనంలో కలుసుకోన్నాము. నన్ను శ్రీలలిత గారు తీసుకు వెళ్ళారు, తక్కిన వాళ్ళు ఒక్కొక్కరే గుమిగూడారు. అందరం కలుసుకొని ఆహ్లాదంగా గడిపాము. ఫోటోలు విశేషాలు తక్కిన సోదరీమణులు అందిస్తారు.
3 comments:
మీ కవిత చాలా బాగుంది.
మీ కవిత చాలా బాగుందండి .
మా ఇంటిని ఆలీషా భవనం చేసారా :) థాంక్ యు :)
kavita suuuuuuuuuuuuuper
Post a Comment