అమ్మ
''అమ్మల గన్న యమ్మ ,ముగురమ్మల మూలపుటమ్మ " సృష్టిలో జీవులకి తన అంశ తో మాతృత్వాన్ని నింపి అందించింది. అక్షర మాలలో అక్షరాలన్నీ వాడినా అమ్మని సరిగా స్తుతించ లేము, ఆమె త్యాగానికి,సేవకి విలువ అంచనా వెయ్యలేము. అమ్మ దగ్గర మనం ఉన్నంత కాలం స్వర్గం, శ్రీ రామ రక్ష, పున్నమివేన్నెల. అమ్మ మనదగ్గర ఉన్నంత కాలం వెయ్యి ఏనుగుల బలం, ఆత్మ సంతృప్తి , నీడ నిచ్చే గొడుగు. " అమ్మ " అనే పదంలో అమృతం వుంది, "అమ్మా!"అనే పిలుపులో అమరత్వం వుంది.
అమ్మలందరికి ఆయుష్షు పెరగాలి, బిడ్డ లందరికి సంతోషం నిండాలి .
1 comment:
మీ దీవెనలకు ధన్యవాదాలండీ..
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
Post a Comment