క్రితం సారి అమెరికా నుంచి వెళ్ళినపుడు గార్డెన్ లో పూలు నిండుగా పూసి వున్నాయి. ఇండియా వెళ్ళాక అనుకొనే దాన్ని ఇక పూలన్నీ వాడిపోయి రాలిపోయి చెట్లన్నీ పోయివుంటాయి అని. మొన్న చికాగో అబ్బాయి ఇంటికి రాగానే వాకిట్లో పూలు పూసి వున్నాయి. మళ్ళీ చెట్లు పెట్టారా !అని అడిగాను. లేదు వాటంతట అవే తిరిగి మొలిచి పూలు పూసాయి అన్నారు మావాళ్ళు .పూల మదు లన్ని బోసిగా ఉంటా యనుకోన్నానేమో! ఆపూలు చూసుకొనే సరికి చాలా ఆనందమయింది. మామ్మామిడి పండు పూలన్నీ అవే వీటికి సన్నని పరిమళ ము కూడా వుంది.!అక్కడక్కడా పూసాయి. జీవితంలో ఇలాటి ఆనందాలు బోనస్ లా వస్తాయి.
ఇక కింద వున్న మూడు ఫోటోలలో పూలు తెల్లగా కనిపిస్తున్నాయికా ని లేత పసుపుపచ్చానిపూలు. ఇవేమీ పూలో చెప్పగలరా? కిందటి సారి గార్డెన్లో కాబేజీ వేసాము.పెద్ద పెద్ద కాబెజీలు వచ్చాయి మొదటిది కొయ్యగానే అయిదారు వచ్చాయి తరువాత నేను
వెళ్ళిపోయాను. వింటర్ గడిచింది. ఇప్పుడు వచ్చి చూస్తె ఆచెట్టు నేల కంటూ కొని వుంది.పక్కనించి పెద్ద పెద్ద పొడుగాటి కొమ్మలు వచ్చాయి, ఇవిగో ఈపూలు ఆకోమ్మలకి పూసినవే! కాబెజీకి పూలు పూస్తాయని నాకు తెలియనే తెలియదు. చాలా ఆశ్చర్య పడిపోయా,ఆనంద పడిపోయాను. మరి మీరందరూ చూడకపోతే ఎలా!అందుకని బ్లాగ్ లోకి తెచ్చేశాను. ఇప్పుడు కొత్త మొక్కలు నాటాలి. వాటి గురించి తరువాత తెలియబరుస్తాను.
1 comment:
super :)
Post a Comment