ఓట్ మీల్స్
ఈమధ్య కాలంలో బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. బ్రెడ్ ,బన్ ,బిస్కెట్స్ తినేవాళ్ళు. ఇప్పుడు ఓట్స్ తెగ వాడుతున్నారు. ఓట్స్ తినడం వల్ల లాభాలు చాలా వున్నాయి.కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది,గుండె జబ్బులు రానియ్యదు ,తేలికగా అరుగుతుంది,విటమిన్లు ,ఐరను సప్లయ్ చేస్తుంది,వట్టినే తినాలంటే చప్పగా వుంటుంది. మైక్రోవేవ్ లోగాని,స్టౌ మీద గాని త్వరగా ఉడికిపోతుంది.
కొంచెం పెరుగు కానీ,పాలు కా ని పోసుకొని ,పంచదార ,లేక ఉప్పు తో తినవచ్చు.ఆకలిని ఆపుతుంది.
చూడటానికి మన అటుకుల్లా అనిపిస్తుంది. కాని దీని రుచి వేరు. ఇప్పుడు ఓట్స్ తో ఎన్నోరకాలు వంటలు చేస్తున్నారు.తీపి కారం కూడా! ఓట్స్ ఉడికించాక అందులో పండిన అరటిపండు సన్నగా ముక్కలు తరిగి వేసుకొని తినవచ్చు. తేనే కలిపి తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకు తినవచ్చు,నల్ల ద్రాక్ష వంటి పళ్ళు వేసుకు తినవచ్చు.
బిస్కెట్స్ తుంపి వేసుకు తిన వచ్చు, సీరియల్స్ కలిపి తినవచ్చు ఇలా ఎన్నోరకాలుగా తినవచ్చు.
మొన్న ఎవరో నోము నోచుకోని బోలెడు శనగలు ఇచ్చారు. రెండు రోజులు నీళ్ళల్లో పెట్టాను. ఇవాళ శనగలతో కూర చేసాను. రొట్టెల లోకి బాగుంటుందని. అదే ఓట్స్ లో వేసుకు తింటే బాగుంది. పుల్లపుల్లగా కమ్మకమ్మగా .ఈ కామ్బినేషను మీకు చెపితే బాగుంటుంది అనిపించింది.
శనగలతో కూరకి కావలసిన పదార్ధాలు. శనగలు .టమోటాలు ,ఉల్లిపాయలు పచ్చి మిర్చి ,కొత్తిమీర,అల్లం , మసాలా ,ఉప్పు,కారం,పసుపు ,నూనె .శనగలు ఒకరాత్రి నానబెట్టి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక పావుకిలో శనగలకి రెండు టమోటాలు ,రెండు ఉల్లిపాయలు,నాలుగు పచ్చిమిర్చి ,ఒక చిన్న కొత్తిమీర కట్ట, కావాలి.ఉల్లిపాయలు,టమోటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి తరిగి వేసుకోవచ్చు,లేకపోతె కాయ పళం గా వేసుకోవచ్చు.తరిగితే కారం ఎక్కువ అవుతుంది,కాయ పళం గా వేస్తె తక్కువ.అల్లం దంచి వేసుకోవచ్చు
బాణలిలో నూనెవేసి కాగాక ఉల్లిపాయలు వేసి దోరగా వేగనిచ్చి ,రెండు టీ స్పూనులు మసాలా ,కాస్త పసుపు,ఉప్పు,కారం కావలిసినంత వేసి వేగాక అందులో టమోటా ముక్కలు వేసి అడుగంట కుండా కలుపుతూ మెత్తగా దగ్గరపడే దాక ఆగి అల్లం పచ్చిమిర్చి వేసి అప్పుడు శనగలు వేసి మరికాసిని నీళ్ళు పోసి కుక్కరు లో పెట్టి మూడుకూతలు వచ్చేదాకా శనగలు ఉడక నివ్వాలి. చల్లబడ్డాక కుక్కరుమూతతీసి
వేరే బౌల్ లోకి కూరతీసుకొని పైన కొత్తిమీర సన్న గాతరిగి జల్లితే బాగుంటుంది. ఇది కొందరు అన్నంలో కలుపుకొని తింటారు.

No comments:
Post a Comment