గురు పూర్ణిమ
గురు పూర్ణిమ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు.
గురువు అనేవాడు ఎక్కడో లేడు ,నీ మనస్సులోనే వున్నాడు. ఆ మహా చైతన్యాన్ని
మేల్కొల్ప గలిగితే విద్యకి కొదవ వుండదు. అనాది నుంచి మన భారతీయ సంస్కృతిలో గురువులకి పెద్దపీటవేసి గౌరవిస్తూ వచ్చారు. ఎంతమంది గురువులో?ఎన్ని విద్యాలయాలో? ఎన్ని పాఠ్య పుస్తకాలో? విద్యార్ధుల చెవుల్లో ఇల్లు కట్టుకొని బోధ చేస్తూనే వున్నారు.
విద్యాలయం నుంచి బయటికి వచ్చాక మనం కాలాన్ని ఎలా గడుపుతున్నాము? పుస్తకంలో చదివింది ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతున్నాము? అనేదిప్రశ్న ? విద్య వలన వచ్చిన జ్ఞానంతో తనను తాను సంస్కరించుకోగలిగితే అదే గురువు కు గురుదక్షిణ. చెడు పనులు చెయ్యకుండా వుంటే,మిగతావి మంచి పనులే అవుతాయి. మన దేశం, మన వూరు, మన అమ్మ,నాన్న, అక్క,చెల్లి,అన్న,తమ్ముడు, మనబడి,మనగుడి , మన మిత్రుడు అన్నిటిపట్ల గౌరవము ,శ్రద్ధ కలిగి ఉండటమే మానవ లక్షణం. ఈ అన్నిటికి
విద్యయే దారి చూపేది. అక్షరాల్ని నిర్లక్ష్యం చెయ్యకండి, శ్రద్ధగా వ్రాసి, శ్రద్ధగా చదివి ముందుతరాల వారికి అందించండి. ఇంట్లో తెలుగే మాట్లాడండి. అమ్మ!నాన్నా! అని తెలుగులోనే పిలిపించుకోండి.

No comments:
Post a Comment