మెంతి మొక్కలు ,చిన్న కుండీ లో సరదాగా చారెడు గింజలు జల్లాను. తోసుకొంటూ మొలకలు పైకి వచ్చాయి. దగ్గరికి వెడితే మంచి సువాసన. లేతగా ఆకుపచ్చగా నాలుగు రేకల పువ్వుల్లా వచ్చింది మెంతి. మొన్ననే ఇక పెరగదులే అని ఆకులుగిల్లి పెసరపప్పువేసి మెంతికూర పప్పు చేసాను. రొట్టెల లోకి బాగుంటుంది. పప్పు గరిటె జారుగా వుంటే పుల్కాలు ముంచుకు తిన వచ్చు. ఇదే బజారులో కొంటె గీసి గీసి బేరం ఆడటాము. పెరట్లో మొలిస్తే ఎంత అపురూపమో!ఎంత రుచో!
No comments:
Post a Comment