Pages

Sunday, August 19, 2012

నాగలక్ష్మి కళారూపాలు


ఈ సరస్వతి       బొమ్మ     అసలు బంగారు    రంగులో వున్నది     తెచ్చి       నాగలక్ష్మి      రంగులు వేసి   తికిలీలు మెరిసేవి పెట్టి అలంకారం చేసింది.

    దీపం     చెక్కతో        తయారు చేసింది.   స్టాండు పెట్టింది.      వేరే చిన్న ప్రమిదలు పెట్టింది.   అద్దాలతో   అలంకరించింది. దీన్ని     వాల్ పీస్      లాగా      పెట్టుకొంటే      బాగుంటుంది.

ఇది    చెక్కతో చేసిన ఓం  కింద తాళం చెవులు పెట్టుకొనేందుకు     హూక్లు    పెట్టింది.   వీధి గుమ్మం   తలుపు పక్కనే   గోడకి పెట్టుకొంటే    తాళం చేతులు   వెతుక్కో నక్కర లేదు.
వెదురు తో చేసిన పూల సజ్జ..దీపపు ప్రమిదలు శంఖాకారంతో      బాగుందికదూ !

ఇది పనికిరాని సి.డి .తో చేసింది.     రంగులు తికిలీలు అద్దాలు     పెట్టి బ్రహ్మాండం గా  అలంకారం చేసింది. ఇదీ వాల్ పీస్ లా  పెట్టుకోవచ్చు.   దేవుడి బొమ్మలకి అటు ఇటు పెట్ట వచ్చు.  మన ఇష్టం .
                                     ఈ వస్తువులన్నీ     నాగలక్ష్మి చేసింది.    ఇంటి బాధ్యతలు నిర్వర్తిన్చుకొంటూ
అశోక నగర  లో    శారదా మహిళా మండలిలో    పదవులు    నిర్వహించుకొంటూ   ఇవన్ని    తయారు చేసేందుకు
శిక్షణ  పొంది   ఆరి తేరింది     నాగలక్ష్మి.   ఇవేకాక    కుట్లు నేర్చుకోండి.   చీరల  మీద    ఎంబ్రాయిడరీ  చేస్తుంది.
నాజూకుగా    పెయింట్  చేస్తుంది.  ఇంకా ఏవేవో      నేర్చుకోవాలని    తహ తహలాడుతూ వుంటుంది. అవకాశాల
పరిధి  తక్కువయినా     ఆశనే       ఆశరా చేసుకొని    ముందుకు సాగాలని కోరుకొంటుంది.  కావలసిన వస్తువులు
,పనిముట్లు     తెచ్చుకొని   ఆర్తి ఫిషియల్     జ్యూయలరీ    తయారు చేస్తుంది.గొలుసులు,ఇయర్   రింగ్స్ ,కాళ్ళకి
పట్టాలు, చేతులకి బ్రెస్ లెట్స్  తయారు చేస్తుంది.  చేతిలో    కళ వుంటే    అన్నిటిలో ప్రతిఫలిస్తుంది  అంటారు  ఇదేనేమో!
                 ఇలాటి   వస్తువులు     షాపుల్లో షో కేసుల్లో పెడితే     బెరమాడటానికి      సిగ్గుపడి ఎంత  ఖరీదయినా
కోనేస్తాము.  కాని   గృహిణులు    ఇళ్ళల్లో    తయారు చేసినవి    కొనడానికి    ఆలోచిస్తాము.   షాపుల్లో కంటే ఖరీదు   తక్కువకే వస్తాయి.  ఎవరేనా    గుత్తగా     ఎక్కువ  ఆర్డరిస్తే   తయారు చేసి ఇస్తుంది.  ఇలాటి వారి పనితనాన్ని ప్రోత్సహించడం     మన   బాధ్యతా.  కళాపోషణ కూడా!  సినిమాలకి,టి.వి.లకి,    ఆశమ్మ -పోశమ్మ
కబుర్లకి    సమయం   వృధా చెయ్యకుండా    పోడుపుచేసుకొనే    కృషీ మణులు వీళ్ళు.  వీరిని  ఆదర్శం గా
తీసుకొని     సమయాన్ని సద్వినియోగం చేసుకొని   తృప్తిని, ధనాన్నికూడా   పొందవచ్చు.

నాగ లక్ష్మి   సెల్ నెంబర్  ---9989430217

1 comment:

చిలమకూరు విజయమోహన్ said...

చక్కటి సృజనాత్మకత!నాగలక్ష్మికి అభినందనలు!