ప్రతి రోజు
ప్రతి రోజు చెసిన పనులె చెసుకొంటూ జీవన రధాన్ని ముందుకు లాక్కుపొతూ వుండాలి. ఉద్యొగస్తులైన దంపతులకి ఇంటి పనులు మరీ బొర్ కొడతాయి. కాని తప్పదు.
అడుగడుగునా సులుసూత్రాలు వెతుక్కొని పనిలొ ఆనందం కల్పించుకొవాలి. సంసారంలొ "సర్దడాలు" వెతకడాలు"
రెండు పెద్దపనులు. తీసిన వస్తువు తీసిన చొట పెట్టక పొతే "వెతకడం "అనె రాక్షసి సమయానికి మన పీక పట్టుకొంటుంది. దీనినుంచి రక్షింప బడాలంటే క్రమ శిక్షణ ఒకటె తరుణొపాయం. కొన్ని వస్తువులకి లింకులు వుంటాయి అలాటప్పుదు వాటిని విడదీయ కూడదు. కీస్,సెల్ల్.వాలెట్ ఇవి ఒకెచొట పెట్టండి. వీధి గుమ్మం పక్కనె స్తూల్ వెసి ఒక బౌల్ లొ వాటిని లొపలొకి రాగానె పడెయ్యంది. వెతుకులాట తప్పుతుంది.సూది ,దారం,కొన్నిహూక్స్ ,గుండీలు డ్రాలొ ముందుగా పెట్టూకొండి. పిల్లలు స్కూళ్ళకి,కాలెజీలకివెళ్ళే టప్పుడు,ఇంటాయన ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ద్రెస్సులకి రిపేర్లు వస్తాయి. అప్పుదు సూది దారం అందుబాటు లొ లేకపోతె వాళ్ళకి మనకి టెన్షను,చిరాకు.
పక్కమీద ఏదో దుప్పతి,కనిపించిన గలీబుదిండుకి ఎవ్వరూ వెయ్యడంలా! అసలు పక్కలమీద రెండేసి దుప్పదుప్పట్లు పరుస్తున్నారు.పగలు ఒకటి,రాత్రి ఒకటి.దిండు గలీబులుకూడా దుప్పటి రంగులొవె వాడతారు. బ్బత్తలు ఉతికి విస్త్రీ చెయించాక దిండు గలీబులొనె దుప్పటిపెట్టి గలీబు సగానికి మడిచి అల్మారాలొ పెడితే రెండూ ఒక చోట వుంటాయి.వెతుక్కొనె బాధ తప్పుతుంది.
పిల్లలకి ఆడుకొందుకు సాఫ్ట్ టాయిస్ కొంటాము.బేర్లని,బన్నీలని,మంకీలని .అవి ఆడుకొనిపిల్లలు అటూ ఇటూ పడేస్తారు,చిందరవందరగావుంటాయి,పైగా మాసిపొతాయికూడా.పిల్లల గదిలొ గోడకివాళ్ళకి అందేటంత ఎత్తులొవెల్ క్రో గోడకి అడ్డంగా అతికిస్తె పిల్లలు బొమ్మల్ని దానికి అతికిస్తారు. బొమ్మలు త్వరగా పాడయిపోకుండా,శుభ్రంగా వుంటాయి.
సేఫ్టీ పిన్స్, హైర్ క్లిప్స్ .ఇయెర్ రింగ్స్ ఎన్ని వున్నా కనిపించవు.బాత్ రూము అలమారా లొపలి తలుపుకు లైట్గా వుండె చిన్న పెము బుట్ట గానీ ,సంచీగానీ తగిలించి అందులొ పడెయ్యండి.
ఆరేసిన బట్టలు ఎగిరిపోకుందా క్లిప్పులు పెడతామా? అవి తీసినప్పుదు తాడుకె మళ్ళీ తగిలిస్తె అక్కడె పడి వుంటాయి.కానీ అలా చెయ్యరు క్లిప్పులు తీసి అటొ ఇటొ పడెస్తారు,కింద విడిచెస్తారు. ఒక అట్ట డబ్బ లోవి వెసి ఒ గూట్లొ పెడితె వెతుకులాట తప్పుతుంది.
{సేకరించినవి}
1 comment:
మీ సూచనలు, సలహాలు చాలా ఉపయోగకరంగా వున్నాయండీ.
కాని నా ఉద్దేశ్యంలో మనం ఏదైనా వస్తువుకోసం వెతికినప్పుడు అది తప్ప మిగిలినవన్నీ కనిపిస్తాయి. అందుకని మనం అసలు వెతుక్కోడం పెట్టుకోకూడదన్న మాట. ఎవరైనా వెతుకుతుంటే మనవి కనిపిస్తే మనకిస్తారు కదా..(హ..హ.. పని తప్పించుకునే ఉపాయాల్లో ఇదొకటన్న మాట..సరదాకి రాసానంతే..)
Post a Comment