Pages

Wednesday, November 14, 2012

పండగ మర్నాడు

పండగ మర్నాడు
       అందరు పండగ     దిగ్విజయం గా      జరుపుకొని ఉంటారని     అనుకొంటున్నాను.
పండగ ముందు     శు భాకాంక్షలు     చెప్పే వుంటారు    ,కానీ    హడావుడిగా    చదువుకొని వుంటారు
నా శుభా కాంక్షలు    ఇవాళ తీరు బడి గా   చదువుకోండి.  అసమర్ధతని విడిచి ,ఆప్యాయతని    తోడూ చేసుకొని,
అవి నీతిని ,అన్యాయాలని   నరికి పోగుపెట్టి,  సౌభ్రా త్రుత్వము,సౌహార్ద్రము అనే దివ్వెలు రెండు చేతులలో పెట్టుకొని
ఉత్సాహంతో     ముందుకు నడవండి. కృషితో నాస్తి  దుర్భిక్షం అనే  సూక్తి  మర్చిపోకండి.ఒక్క ప్రాణికి రవంత వెలుగు నిచ్చినా     జీవితం ధన్య మే! వెలుగులో నడవండి,వెలుగు అందియ్యండి.
                         60ఏళ్ళు దాటాక    ఇలాటి సూక్తులు    చాలా    చెప్పేస్తారు  అనుకొంటున్నారా? మేము చెయ్యలేని పనులు మీరైనా    చేస్తారని    ఆశ .మొన్ననే   స్వదేశానికి తిరిగి వచ్చాను.  వేల మైళ్ళు విమానం లో ప్రయాణం చేసి వచ్చేసరికి ,శూరుడు ,ధీరుడు అయిన   హీరో    సినిమాలో విలన్ ని అరచేత్తో పైకెత్తి    గిరగిరాతిప్పి "హూ"అని కిందపదేస్తే   ఆవిలన్ స్తితి ఎలా వుంటుందో అలావుంటుంది. పిల్లల్ని విడిచిపెట్టి గుండె చిక్క పట్టుకొని
బయలుదేరుతే   అవి ముద్దకట్టుకుపోతాయి.  దుఖం చుట్టాలు చుట్టుకొని   గొంతులోంచి కాఫీ,టీలు కూడాకనక
దిగావు.
               ఇంటికి వచ్చి తలుపులుతీస్తే    దుమ్ముదూళి .ఆరు నెల్లు   తలుపులు మూస్తారా అని   వాయు దేవుడు
దుమ్మెత్తి పోసాడు .వెళ్ళేటప్పుడు    సహాయకారిణికి [పనిఅమ్మాయికి]  పప్పులు,కూరలు ,పళ్ళు ఒడి గంటి బియ్యం నింపి, రాంగానే   కన్పడమ్మా!అని గడ్డం మనసులో పట్టుకొని  వాక్కుతో బతిమాలి వెళ్లాను .వచ్చిన వారానికి కూడా  కంటికి కనిపించలా! వాళ్ళని వీళ్ళని వాకబు చేసి నేను వచ్చానని తెలుసుకొని  మాయమయ్యింది.
కొత్త సహచరిణి ని  వెతుక్కొని, బేరమాడి, బతిమాలా! ఈమధ్య ప్రతి ఏడూ  పై దేశాలకి పోవడంతో పనివాళ్ళకి నాపై
నమ్మకం పోయింది.  ఈవిడ దగ్గర పనిచేస్తే    ఏమి లాభం? ఆర్నెల్లకోసారి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త పని వెతుక్కోవాలి అని. అందుకని బతిమాలితే కానీ   పనిలోకి దిగలేదు. ఇద్దరం చెరో చీపురు కట్ట పట్టుకొంటే    వారానికి
నే ల  కనిపించింది. నడుము మాత్రం ప్రాక్చరు   అయితే    సున్నం పట్టీ వేసినట్టు     బిగుసుకు పోయింది.
                    ఇంకా    ఆనంద కరమైన విషయం ఏమిటంటే    ఫోను మొరాయించింది, నెట్ దాని తాలూకుదే కనక
అదీ లేదు.  మా పెద్దబ్బాయి ఆఫీసు పనిమీద వచ్చి   తమ్ముడింట్లో    పండగ చేసుకొందాం పద పద బెంగలూర్ అంటే అనడ్డి నేప్పితోనే   రైలెక్కాను. పండగయిన మర్నాటికి    "ఇక వేల్లివస్తానని" నెప్పి తప్పుకోంది .లాప్ టాప్  తెరిస్తే  శుభాకాంక్షలతో     కిక్కిరిసిపోయివుంది. అందుకే గబా గబా ఈ నాలుగు ముక్కలు వ్రాసా! అస్తానపు వేళ
అవుతూంది.  మళ్ళీ    దీపాలు వెలిగించండి.


2 comments:

Padmarpita said...

చక్కగా చెప్పారు....పండగ మర్నాడు పండగైపోయిందని మరచిపోకుండా ఏం చేయాలో!

Kottapali said...

We already miss you.