Pages

Wednesday, October 24, 2012

పూల పూజ

            పూల పూజ 

సౌందర్య శిఖామణి!
సౌజన్య  స్వరూపిణి!

రావమ్మా!వేదమయీ !
రావమ్మా!నాదమయీ!

తోటలో పూలన్నీ 
ఏరి కోరి  తెచ్చాను!
తృప్తిగా అలంకరించి 
ముక్తి కోరుకొంటాను!

మంకెన్న పువ్విదిగో!
కుంకుమ గా పెట్టేను 
ఆకాశ మల్లెపూలు 
జూకాలుగ పెట్టేను!

సూర్య కాంత పూలివిగో!
సూర్య చంద్రులు 
పాపిటకు ఇరుపక్కల 
పసందుగా పెట్టెను!

గులాబీలు ఎర్రనివి 
గుత్తులు గుత్తులు తెచ్చా 
ఒత్తుగా దండకట్టి  నీ 
మెత్తని మేడలో వేస్తా!

సన్నజాజి,విరజాజి 
సరాలుగా గుచ్చాను
అలినీల వేణీనీ 
సిగ చుట్టూ పెడతాను 

రాధా మనోహరాలు 
జడలల్లి వుంచాను 
మణి మేఖలలా  నడుముకు 
ముదముతో పెడతాను 

పారిజాత ప్రసూనాలు
పట్టాలుగా పెడతాను 
పొగడపూల మాలతో 
దండ కడియ మమరుస్తా !

పూల పూజ లందు కొని
మేలుదీవన లియ్యమ్మా!
***********************
              సురుచి చదువరులకు   విజయ దశమి    శుభాకాంక్షలు 


No comments: