పుటాకళ్ళు
కొన్ని ఆచారాలతో పాటు కొన్ని పదాలు ముడివడి వుంటాయి. ఆ ఆచారాలు అనుసరించడం తగ్గిపోతే ఆ పదాలు అదృశ్య మయిపోతాయి. పుటాకళ్ళు అనేపదం అలాటిదే!సరియైన పదం పుట్టకళ్ళు అయి ఉంటుందని నా భావన. నాచిన్నతనం లో నాగుల చవితి నాడు పొద్దున్నే వాకిట్లో పుటాకళ్ళు పుటాకళ్ళు అని కేకలు పెడుతూ అమ్మేవారు. ఇవి వెండితో చేసినవి. నలచదరం గా ఉండేవి. నాగుల చవితి నాడు పుట్టలో పాలుపోసే వాళ్ళు ఇవికొని తీసుకెళ్ళి నాగేంద్రుని పుట్టకి అతికిన్చేవారు. నాగెంద్రునికి వెండి కళ్ళు సమర్పించి మా కళ్ళు చల్లగా వుండనియ్యమని ప్రార్ధించేవారు. ఇవాళ నాగుల చవితి కనుక ఈమాట పదేపదే గుర్తుకు వచ్చింది. ఈతరం వారు ఈమాట విని వుండరు. ఆచారాలతో పాటు కొంత భాష కూడా అంతరించి పోతూంది."నాగుల చవితికి నాగేంద్ర నీకు పొట్ట నిండా పాలు పోసేము తండ్రీ!నీ పుట్ట దరికి మా పాప లోచ్చేరు పాప పుణ్య మ్ము ల వాసనే ఎరుగరు ,కరుణించి వారిని కాటేయ్య బోకు "అని తల్లులు నాగేంద్రుని ప్రార్ధించేవారు.
ఒకనాడు స్వస్తిక్,పద్మము, నాగేంద్రుడు ,సూర్య చంద్రులు ,అగ్ని, గంగ వాయుదేముడు,వరుణ దేముడు వీరే ఆరాధ్యులు. వీరి దయా దాక్షిణ్యాల మీదనే మానవ జీవితం ఆధార పడివుంది అని నమ్మేవారు. .

2 comments:
ఈ పదం నేనెప్పుడూ వినలేదండి.
కొత్తగా ఉందండి.
Post a Comment