ఆజ్ మేరీ జమీపర్ నహీ హై కదం
'మిల్ గయీ మిల్ గయీ ఆజ్ మేరేసనం ,ఆజ్ మేరె జమీపర్ న హీ హై కదం' నాచెయ్యి పట్టుకొని విలాసం గా ఊపుతూ పాట పాడింది సుందరి. ఎందుకో మనసు అలా అతుక్కుపోతుంది. అరవై ఆరులో అనుకొంటాను మాపెద్దా డికి జీతం కట్టడానికి బెజవాడలో జ్యోతి బాల మందిర్ కి వెళ్లి వరండాలో బెంచీమీద కూర్చున్నాను. పక్కన చూస్తె మరోఆవిడ కూర్చుంది.సన్నటి పెదవులు విప్పి హాయిగా నవ్వుతూ"మీరు జీతం కట్టడానికి వచ్చారా?అని ప్రశ్నించింది. మరే! అన్నాను.అలా మొదలైందిమా దోస్తీ. .కబుర్లలో తెలిసింది మేమూ వాళ్ళూ ఒకే సందులో ఉంటాము. వాళ్ళాయన ఆర్మీలో పనిచేస్తారు. ఆవిడకి ఇద్దరు అబ్బాయిలు,ఒక అమ్మాయి.మేము మేడ మీద వుండేవాళ్ళము,వాళ్ళు ఆవీధిలో మాకేదురు గా రెండిళ్ళ అవతలవుండేవాళ్ళు. మావీది వరండాలోకి వాళ్ళ పెరటి వరండా కనిపిస్తూ వుండేది. పిల్లలు బడికి వెళ్ళాక ఇద్దరం కలిసి బజారుకు వెళ్ళేవాళ్ళం. కాఫీపొడి,కూరలు కొనుక్కోటానికి. వాళ్ళ తమ్ముడు మాతో వచ్చి అంతదూరంలో నడుస్తూ ఉండేవాడు. తెలుగు సాహిత్యము,ఇంగ్లీషు కవిత్వమూ ,సినిమాలు,స్త్రీల సమస్యలు ఎన్నో కబుర్లు దొర్లి పోతూ ఉండేవి. నాలుగురోడ్లు వచ్చినపుడు సుందరి తమ్ముడు ఆగి "మీరు ఇటు వెళ్లి కాఫీపొడి కొనుక్కోవాలి"అనేవాడు. అప్పుడు గుర్తువచ్చేది బజారు ఎందుకు వచ్చామో!
ఆరోజుల్లో స్క్రీన్ అని సినిమాల గురించి ఇంగ్లీష్ లో వారపత్రిక వచ్చేది. మొదటి పేజీలో స్టార్స్ బొమ్మ నిలువెత్తున వేసే వాళ్ళు. ఒకసారి మీమిద్దరం అలాగే వెడుతుంటే సుందరి ఆగిపోయింది,ఏమిటా అని చూస్తె ఆవారం స్క్రీన్లో మనోజ్ కుమార్ బొమ్మ పడింది. కిల్లీకోట్టులో వారపత్రిక వ్రేలాడదీసి వుంది. "అబ్బా!మనోజ్!చూడండి ఎంత బాగున్నాడో!అని వెళ్లి కొనుక్కు వచ్చింది."తనకి మనోజ్ కుమార్ అంటే అంత ఇష్టం. సాయంత్రం పిల్లలు వచ్చేసరికి అన్నం వండే సి , వాళ్లకి టిఫిన్ పెట్టి మాఇంటికి అందరు వచ్చేవారు. మావాడు వాళ్ళు ఆడుకొనే వాళ్ళు.మా నాన్నగారు ఏవో కబుర్లు చెపుతూ వుండేవారు,మా అమ్మ ఆరగారగా వేడి కాఫీలు అందిస్తూ వుండేది. టైమే తెలిసేదికాదు. పిల్లలు ఆటలు ఆపి మధ్యలో "అమ్మ వెడదామా?అనేవారు,మాకు వినిపించేదికాదు ,మరికొంచెం సేపు అయాక ఘట్టిగా అమ్మా! వెడదామా?అని అరిచేవారు,ఒక్కనిముషం రా !అనేది సుందరి. మరో పావుఘంటకి వాళ్ళు సూర్య నమస్కారాలు మొదలెట్టి సోమ్మసిల్లిపోయే వారు. ఇక లాభం లేదని విడిపోయే వాళ్ళం. సుందరి అవిశ్రాంత పఠి త చదివిన కధలన్నీ చెపుతూ వుండేది.పిల్లల్ని అటు ఇటు తీసుకేల్లెవాళ్ళం,సినిమాలకి వెళ్ళేవాళ్ళం,పుస్తకాల షాపులకి వెళ్ళేవాళ్ళం. తీరిక దొరికితే పాత హిందీసినిమా పాటలు పాడుకోనేవాళ్ళం. అందులో ఆజ్ మేరీ జమీపర్ నహీహై కదం తరుచుగా పాడి న్చుకోనేదాన్ని.నేను పద్యాలు పాడి వినిపించేదాన్ని. చందన్ స బదన్ ,చంచల్ చిత్ వన్ దీరే సేతేరా ఎ ముస్కాన్ ,ముఝె దోష్ న దేనా జగవాలో హో జాయే అగర్ మై దీవానా "ఆపాట మా ఇద్దరికీ చాలా ఇష్టం.
ఎప్పుడైనా సుందరితో మాఫ్రెండ్ వస్తానందోయ్ అంటే "ఎవరా ఫ్రెండ్? నాకంటే గొప్ప ఫ్రెండా?అనేది.తను తప్ప వేరే ఫ్రెండ్ వుండకూడదుట . మా మరిది గ్రా మ ఫోన్, రికార్డులు హైదరాబాద్ నుండి మోసుకొచ్చి మాకు కొత్త కొత్త పాటలు వి నిపించేవాడు. మాకు ఆన్నం నీళ్ళు గుర్తుండే వికావు. ఏదైనా సమస్య వస్తే సుందరి యిట్టె కొట్టిపారేసేది,ఇలాచేస్తేపోలా? దానికెందు కింత వర్రీ అవుతారు? అని మనస్సుని తేలిక పరిచేది.తర్వాత మేము చెరో వూరు వెళ్ళిపోయాము. పెద్ద పెద్ద ఉత్తరాలు వ్రాసుకొనే వాళ్ళం. ఒకసారి ఎందుకో ఉత్తరాలు ఆగిపోయాయి.
డిల్లీ లో వుండగా ఒక సాయంత్రం సుందరీ వాళ్ళా యనా వచ్చారు.ఎంత ఆనందం వచ్చిందో!చాలా రోజులకి కలిసుకోన్నాం అని పొంగిపోయాము.పది నిముషాలు గబగబా మాట్లాడేసి రేపు మేము కొచ్చిన్ వెళ్లి పోతున్నాము,అంది. "ఈవూరు ఎప్పుడు వచ్చారు?అన్నాను. రెండేళ్ళయింది ఈయనకి ట్రాన్స్ ఫర్ అయి..నీ అడ్రస్ ఫోన్ నెంబరు పోగొట్టుకొన్నాను.నిన్న ఒకావిడ పార్టీలో కలిసి మీఆయన పేరెత్తింది నా ప్రాణం లేచి వచ్చింది..మీకుతెలుసా?అడ్డ్రెస్ ఫోన్ నెంబరు ఇయ్యండి అని తీసుకుని ఇవాళ ఈయన ఆఫీసు నుండి రాగానే వచ్చేసాం అంది.రెండేళ్ళ బట్టీ ఒకే వూళ్ళో వుండి ఒకరికొకరు కలుసుకోలేక పోయాము,శాపం పెట్టినట్టుగా! బాధతో మనస్సు ముడుచుకు పోయింది,సుందరి హహహా అని నవ్వుతూ,ఉత్తరాలున్నాయిగా ,ఇక క్రమం తప్పకుండా వ్రాసుకొందాం సరేనా!అంది.
మాన్నాగారు పోయినపుడు ఒక చారిత్రాత్మక మైన ఉత్తరం వ్రాసింది.అమ్మపోయినప్పుడూ అంతే ! పిల్లల పెళ్ళిళ్ళకి తప్పక కలిసేవాళ్ళం.అదేమిటో?తను హైదరాబాదు వచ్చినపుడు నేను ఉండను. వుంటే మాత్రం తనే రెక్కలు కట్టుకొని వచ్చేస్తుంది. ఇద్దరం కలిసి ఎటన్నా వేడ తాము , నోరార కబుర్లు చెప్పుకొంటాము. మా స్నేహానికి యాభై ఏళ్ళు. మనుష్యు లమ్ ఎంత దూరంగావున్నా కలుసుకొన్నప్పుడు నిన్ననే చూసుకోన్నట్లుగా వుంటుంది. మా మనసులు అలా అల్లుకు పోయాయి.
బెంగళూ రు లో తను వాళ్ళ చిన్నవాడి దగ్గర వుంటుంది. బెంగళూరు అంటే తనే కళ్ళముందు నిలుస్తుంది. ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు వెంపర్లా డి పోతుంది. ఇక్కదికిరాగానే ఫోన్ చేశా. నీరసంగా వుంది గొంతు.అలా ఎప్పుడూ వినలేదు. ఏమయింది సుందరీ అంటే ఏమో బాగాలేదు. స్పాండ్ లైతీస్ అంటున్నారు, చెయ్యి ఎత్తలేను,జుట్టు ముడి వేసుకోలేనుఅంది.నాకు గాభారావేసింది.రేపు హైదరాబాదు వెళ్ళుతున్నాను,అంది. ఇవాళ వెళ్లి చూసాను. మాట్లాడితే ఆయాస పడుతోంది. మెల్లగా నడుస్తోంది ,
గంజి పెట్టిన వాయిల్ చీర కుచ్చెళ్లు జిమ్మీ ,పొడుగాటి జడ ఉల్లాసం గా వూగుతూంటే "ఆజ్ మేరీ జమీపర్ నహీహై కదం"అని పాడే సుందరి ఇలా అయిపోతోందే అని మనసు మూల్గింది. నేను తను సమ వయస్కులం. జీవన సంధ్యలో పారాడుతున్నాం. వెనక రోడ్డు పెద్దదే!ముందు ఎంత వుందో తెలియదు. మనని తలచుకొనే వారు,చేయి అందించేవారూ, మన నవ్వుని చూడాలనుకోనేవారూ వున్నారంటే మనకి పుష్టి. వారు బలహీనులయిపోతే, భరించడం కష్టం. సుందరి త్వరగా కోలుకొని మల్లి నవ్వుతూ,తుళ్ళుతూ తిరగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. నాస్నేహమే తనకి బలం కల్పించాలి. తన స్నేహమే నాకు శక్తినివ్వాలి. మళ్ళీ మేమిద్దరం పాత పాటలు పాడుకోవాలి.
.

1 comment:
మీ స్నేహితురాలి aarOgyam గురించి వ్రాసారు. మా అందరి కోరిక, ప్రార్థన కూడా అదే.
మీరు మళ్ళీ కలుసుకున్నప్పుడు ఆ పాట మేము కూడా విని ఆనందించాలని ఉంది.
Post a Comment