Pages

Thursday, February 21, 2013

బాతుపువ్వు-నేను

                 బాతు పువ్వు -నేను 

                          చాలా ఏళ్ల    తరువాత    ఈమధ్య ఒక  స్నేహితురాలి ఇంటికి వెళ్ళా ను. ఆకబురు,ఈకబురు అయాక"మా  పూల తోట   చూపిస్తా!రా!అని తీసుకు వెళ్ళింది .పూ ల తోటలు పెంచడం,చూడటం   నాకూ  ఇష్టమే!ప్రభ నేనూ   పోటీలు వేసుకొని   రకరకాల పూలు పూయించేవాళ్ళం .ఇప్పుడు   మహానగరాలలో   పూల తోటలకి చోటేదీ!   నీరజ తన తోటంతా  చూపించింది .కూ రగాయలు,క్రోటన్స్ ,పూల చెట్లు ఎన్నో వున్నాయి.అన్నీ అయాక "నీకో తమాషా     చూపిస్తారా!అని లాక్కు వెళ్లి ఒక తీగ చూపించి "ఇది చూడు,దీనికి బాతు లాటి పువ్వులు  పూస్తాయి,అచ్చం బాతులే !చూడు!అని పువ్వు చూపించింది .పువ్వు యొక్క తొడిమ   ఆకు పచ్చగా బాతు ముక్కులావచ్చి తరువాత నేరేడు పండు రంగులో పువ్వు బాతు  పొట్టలా వస్తుంది .దానిపైన తెల్లగా ,పచ్చగా చుక్కలు వుంటాయి . నేరేడు పండు రంగు వెల్వెట్ లా వుంటుంది .పువ్వు చూడటానికి గమ్మత్తుగా    ఆకర్షణీయం గా వుంటుంది ."ఎంతో  బాగుంది కదూ!అంది .నాకా ప్రశ్న వినిపించనే లెదు. నామనస్సు ఎన్నో ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది . 
                          నేను పుట్టినప్పుడే    మా  నాన్నగారు   బందరులో కృష్ణా పత్రికలో చెరారు. నాచిన్నతనం అంటా  బందరులో గడిచింది ఆ  రోజుల్లో బందరులో మూడు  సినిమాహాలులు వుండేవి మి నర్వాహాలు,బృందావన్ టాకీస్ ,సరస్వతీ టాకీస్ .కృష్ణా పత్రిక వార పత్రిక .శ్రీ ముట్నూరి కృష్ణారావుగారి  సంపాదకత్వం లో వెలువడేది నాన్నగారు హాస్య రస గుళికల వంటి  "వడగళ్ళు" అనే వ్యాసం   ప్రతివారం   వ్రాసెవారు. ఇంకాఇతర శీర్షికలు కూడా నడిపే వారు. సినిమారివ్యు వ్రాసెవారు. 
                       కృష్ణా పత్రిక శుక్రవారం నాడు విడుదల అయెది. కొత్త సినిమాలు శుక్రవారం విడుదల చెసెవారు. మినర్వాహాలు వారు గురువారం నాడు పత్రికల వారికి ప్రీవ్యూ చూపించేవారు . బందరులో వారంతా  ఈరివ్యూ చదివి సినిమాకి వెళ్ళేవారు .కృష్ణా పత్రికలో  బాగుందని వ్రాస్తే వెడదామని, బాగాలేదని వ్రాస్తే మానేద్దామని అనుకొనెవారు. 
                     గురువారం తొమ్మిది ఘంటలకల్లా   మావాకిట్లో గుర్రపుబండీ తయారుగా  వుండేది .బన్దరులొ అంతా  ఎద్దు బండీ  మీదే తిరిగెవారు. గుర్రపు బండీ అంటే గొప్ప్‌హోదా!ఏడెనిమిదేళ్ళ  వయస్సునాది .మా నాన్నగారు ప్రతిసారీ నన్ను తీసుకెళ్ల కుండా వెళ్ళాలని ప్రయత్నం చెసెవారు..నెను ఆయన కంటే  మున్డుగావెళ్లి  బండీలో కూర్చునేదాన్ని గుర్రపు బండీలో షికారు,నేను వెళ్ళడానికే   ఘట్టిగా  నిశ్చయం చెసుకునెదాన్ని.  ఆ సినిమా తెలుగయినా ,తమిళం అయినా,హిన్దీఅయినా,ఇంగ్లీష్ అయినానాకు తేడావుండేది కాదు. అలా సినిమాకు వెళ్ళడానికి ముఖ్య కారణం సినిమా  ఇంట్రవెల్ లో హాలువాళ్ళు అందరికీ డ్రింక్లు ఇచ్చెవారు.కిళ్ళీలు ఇచ్చెవారు. మానాన్నగారు డ్రింక్ ఒకసారి సిప్ చేసి నాకిచ్చెసెవారు.  రెండు డ్రింకులు తాగెదాన్ని. కిల్లీకూడా  నాన్న నాకే ఇచ్చెవారు.నెను చాలా కిళ్ళీలు తినివుంటాను అందుకే చదువురాలెదెమో! కిళ్ళీ భలే రుచిగా అతి మధురం గా  వున్దెది. ఇప్పటికి నేతినే ప్రతి కిళ్ళీ లో  ఆరుచి వెతుక్కొంటూ వుంటాను దొరకలెదు.. సినిమాలు తొందర తొందరగా   మారిపోవాలని,గుర్రపు బండీలో సినిమాకేల్లి కిళ్ళీలు తినాలని దేముడికి మొక్కుకునెదాన్ని. 
అక్కడనుంచి నాన్నగారు కృష్ణా పత్రిక ఆఫీసుకు వెళ్ళేవారుసినిమా రివ్యు వ్రాయదానికి. నేను ఆయనతో వెళ్ళే దాన్ని  .కృష్ణా పత్రికకు  మా నాన్న ప్రత్యక్ష పూజారి,నేను పరోక్ష పూజారిణిని . మాకు అంత  గౌరవం మా నాన్నగారు వ్రాసుకొంటుంటే నేను మౌనంగా ఆయనకు సేవ చేసేదాన్ని కాఫీ ఇయ్యడం,కలం సిరాబుడ్డీ అందియ్యడం ,రిఫరెన్స్ కోసంకటింగు  లు దాస్తే అవవెతికి ఇయ్యడం చేసే దాన్ని. కృష్ణా పత్రికలో ఉన్నంత కాలం ఆయన  ప్రతి అక్షరం చదివేదాన్ని . మేటరు కాగితాలని గోధుమ రంగులో సన్నగా పొడుగ్గా వున్నా పుస్తకాలపై వ్రాసెవారు. ఆయన వ్రాసుకొనే  కుర్చీ దగ్గరే కింద కూర్చునే దాన్ని. ఒక పేజీ రాయగానే చించి నా  ఒళ్ళో పడేస్ వారునాన్నగారు    అ ది చదివే లోపునే రెండో పేజీ ఒళ్లో       పడేది .తరువాత   ప్రూఫులు  దిద్దడానికి  తెస్తే    చదివేదాన్ని,ఫారాలు ప్రింటయి తెచ్చెవారు  అవి చదివేదాన్ని,పత్రిక వచ్చాక మొత్తం చదివెదాన్ని. 
                  కృష్ణాపత్రిక ఆఫీసుకు వెడితే     ముందుగా   చిన్న    నడవాలాగా వున్దెది.  దానితరవాత  వరండా .వరండాలో  ఎడమ వేపున రెండు గుమ్మాలున్దేవి ఒక గదిలో అకౌంట్స్ సెక్షను.కాజ శివరామయ్యగారు,అద్దేపల్లి  మల్లినాధసూరిగారు వున్దెవారు. ఆగదిలొంఛి ఇంకో గదిలొకి   తొవవున్దెది.    ఆగడి నిదా  బ్లాకులు వున్దెవి.లావుపాటి పుస్తకాలలో బ్లాకులు ప్రింట్చేసి బొమ్మలకి నెంబర్లు వేసి వున్దెవి.  ఆనేమ్బర్ల ప్రకారం బ్లాకులు అరలలో వున్దెవిఽఅరొజుల్లొ బొమ్మ బ్లాకు చేయించాలంటే మద్రాసు పంపించి చేయించుకోవాల్సి వున్దెది. రెండవ  గుమ్మం లోంచి వెడితే  ఎదురుగా రెండు పెద్ద మెజాబల్లలు.కుర్చీలు వున్దెవి. మొదటి ది మానాన్నగారిమేజా,రెండోది కమలాకరవెంకట రావు గారిది. ఆగదిలో కుడి చేతివేపు తలుపు పక్కగా శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు ఈజీ చైర్ లో కూ ర్చునెవారు.పత్రికతొ తనకేమీ సంబంధం లెనట్టు .కానీ   ఆయన ఉనికి వాతావరణా న్ని ఏంతో  గంభీరంచేసేది . 
                         వరండాలో ప్రతి సాయంత్రం దర్బారు జరిగెది.  మ హామహులన్తా వచ్చెవారు.వరండా    దిగి వెడితే అక్కడ ప్రెస్ కంపోజిటర్లు,మిషను నడిపేవారు వున్దెవారు.చిన్న చిన్న చేక్క      గదు ల్లో అక్షరాలూ,వత్తులు,కొమ్ములు పొసివున్దెవి..తక్కింజాగా అంతా తోటలో శిల్పాలు పలకరిస్తే    మాట్లా దుతాయే మో అన్నట్లు వుండేవి వరండా పక్కనుంచి మెడ మీదకి చెక్క మెట్లు ఉండేవి .పైన ఒక్కటే గది.  అక్కడ  తోట వెంకటేశ్వర రావు గారు ఆస్థాన చిత్రకారుడు,బొమ్మలు గీస్తోవున్దెవారు    అక్కడే       ఈ  బాతు  పూలు విరగబూసి ఉండేవి బ్రౌన్ రంగు కాగితం  సంచీ తీసుకొని   దాని నిండా జూకా  మందారాలు,బాతుపూలు నింపుకోవడం సరదా. అటూ ఇటూ  తిరిగి పూలుకోసుకొనే  సరికి మా  నాన్నగారు రేవ్యూవ్రాసి ప్రెస్     లో  ఇచ్చెసెవారు.ఇద్దరమ్ ఇంటికి వెళ్ళే వాళ్ళం . అలా   సినిమాకు వెళ్ళినప్పుడల్లా ఈ   బాతుపూ లు తెచ్చుకోవడం   అలవాటయి పొయిన్ది.తరవాత ఇప్పుడే వీటిని మళ్ళీ చూడటం  ఇదంతా    నీరజకి   చెప్పలేకపోయాను,ఆ లత దగ్గర అలా నిలబడి పొయాను. "పూలుకోసి ఇయ్యనా!నీకిష్టమా!అంది .ఇష్టం కాదు   ప్రాణం  .కానీ కోయకు వాటిని అలానే ఉం డ  నీ  ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు వచ్చి చూసుకొంటూ వుంటాను . అన్నాను . 
               ఒక దృశ్యానికి,ఒక పువ్వుకి,ఒక పరిమళానికి ఇంత శక్తి ఉందా?మస్తిష్కాన్ని ఇన్ని ఏళ్ళ వెనక్కు తీసుకు వెళ్లి ఆ ఘటన లన్నిటిని కళ్ళ ముందు పరిచి మనస్సుని ఆర్ద్రం చేసే శక్తి ఉందా?ఆసమయంలో నెనున్నాను. ఆ"నేను" ని ఈ"నేను "చూస్తున్నాను కానీ  ఈనేనుకి ఆనేనుకి ఎంత తేడా?నా  నెరిసిన జుట్టుని తన వ్రేళ్ళతో ఆప్యాయం గా నిమురుతూ"అబ్బా!ఎంతాశ ?అంటున్నాడు కాల పురుషుడు  [వనిత  నుంచి ]

No comments: