Pages

Sunday, February 17, 2013

" తుమ్మిండా"

                    "   తుమ్మిండా "

                                   చిన్నప్పు డు      సెలవుల్లో   అందరం మా      అమ్మమ్మగారింటికి   చేరేవాళ్ళం.    పొద్దున్నపూట       చద్దిన్నాలుతినడం     అందరికి    అలవాటే! పెద్దవాళ్ళు    ఒకళ్ళు     ఒకే కంచంలో   ఆవకాయ అన్నం,పెరుగన్నం కలిపి ,మమ్మల్ని గుండ్రంగా    కూర్చోమని    ముద్దలు కలిపి చేతుల్లో పెట్టేవారు. తినడం అయాక ఇక బయటికి పోయి ఆడుకోండి అని పంపేవారు.
                          తొక్కుడు  బిళ్ళ ,ఒప్పులగుప్ప,  దాగుడుమూత, తాడాట ,చెమ్మచెక్క,  తుమ్మిండా ఇలా  ఆడుకొనే      వాళ్ళం.  తుమ్మిండా లో మొగపిల్లలు చేరేవారు. నలుగురుకంటే ఎక్కువ పిల్లలుంటే బాగుంటుంది. ఇంకాఎక్కువవున్నా మజాగా వుంటుంది. నలుగురు నలుగురు జట్టుగా  చేతులు కలుపుకు  పంతవేసుకోనేవాళ్ళం.అంటే మన చేతిలో చెయ్యి వేసుకొన్నపుడు తిరగ వేస్తె పంట సరిగావేస్తే   దొంగ అలా    అనుకోని చివరికి      మొగిలిన వాళ్ళు దొంగ   ,వాళ్ళు తక్కిన వాళ్ళని పట్టుకొని "తుమ్మిండా"అని నేలమీద కూర్చోపెట్టేసి ,ఇంకోల్లని పట్టుకోడానికి పరుగేట్టేవాళ్ళు. చివరికి మిగిలిన వాడు దొంగ అయ్యేవాడు అనుకొంటా,సరిగా గుర్తులేదు కానీ ,"తుమ్మిండా "పెట్టి కూర్చో పెట్టడం మాత్రం      బాగా    జ్ఞాపకం వుంది.
                        ఎవరైనా   ఒకే చోట కదలకుండా    చాల సేపు కూర్చొని వుంటే"తుమ్మిండా"   పెట్టినట్లు   అలా   కూర్చుండి   పోయావేమిటి?అనేవాళ్ళు. ఇంకేమి చదువు వాదేప్పుడో    చదువుకి "తుమ్మిండా పెట్టేసాడు"అనేవారు.
ఆవిడ కాపురానికి వెళ్ళగానే      అత్తగార్ని,ఆడబడుచుల్ని    తుమ్మిండా పెట్టేసింది.అనేవారు.
                       ఇదంతా   ఎందుకు    చెప్తున్నానంటే    ఆమధ్య     నా  పని      "తుమ్మిండా"పెట్టినట్లే అయింది.
అమెరికాలు వెళ్లి ఆర్నెల్లు,ఎనిమిది నెలలు వుంది వచ్చాక       జీవన క్రమం అంతా     అస్త వ్యస్తం అయిపోతుంది. అసలా విమాన ప్రయాణ మ్     24ఘంటలు    చేసివచ్చాక  శరీరంలో నరాలన్నీ     మాగీ    తీగల లాగా      చుట్టలు చుట్టుకు  అతు క్కుపోతాయి.  ఇల్లంతా ఈ లోతున  దుమ్ము.  పనివాళ్ళు గై రు హాజరు.  ఫోన్లు,టివి లు,వాషింగ్ మిషన్లు     ఆలనాపాలనా  లేక బిగుసుకుపోతాయి.ఇంటికి వచ్చి వంటింటి తలుపు తియ్యగానే    వంటిల్లంతా  ట్యూబ్ లైట్    పగిలి ముక్కలు పరుచుకొని వున్నాయి.  తీరా చూస్తె ఎక్జాష్ట్  ఫాన్ బిగించిన  చెక్క ఊది   ఫాన్ కిందకి వ్రేలాడుతోంది.   అది ట్యూబ్ లైట్ మీదపడి అది బద్దలయి ,హోల్దరుకూడా విరిగిపోయింది. ఏదైనా తగిలి ఆఫాన్ కిందపడుతుందేమో!అనిభయం.   వంటిల్లంతా   బాగుచేసుకొని   ఎలెక్ట్రి షియన్ కి,   కార్పెంటర్కి ఫోన్ చేసాను. అందరికి సెల్ ఫోన్లు వుంటాయి,కాని స్విచ్ ఆఫ్ చేసివుంటాయి.  వాళ్ళు విశాల హృదయంతో  ఆన్ చేసి వుంది నా కబురు అందుకోడానికి  రెండు రోజులు పట్టింది.   "రేపు వచ్చేస్తానమ్మగారు "అని చెప్పి రెండురోజులు పత్త  లేదు. వృత్తి ధర్మం నిలబెట్టుకొని    చిన్నపనైనా     స్వీకరించి   సమస్య పరిష్కారం చేస్తారనే నమ్మకం ఏమాత్రం లేకపోయినా ,పనిజరగాలికదా !అని     త్రిసంధ్యలలో         ఫోన్లు చేస్తూనేవున్నా.   ఎలె ఎలెక్ట్రి షియన్    వచ్చి కరెంట్ కనెక్షన్   తీసేసి వెళ్ళాడు.ఇంకో కార్పెంటర్ నిపిలిస్తే అత ను వచ్చి    "లైఫ్ లాంగ్      గారంటీ    వుండే   మంచి వాటర్ ప్రూఫ్  చెక్క.క్లాస్  ఫాన్ తెచ్చి అంతా   నేనేబాగుచేస్తాను అన్నాడు. నామొ ఖం వెలిగిపోయింది. ఎంత అవుతుంది అన్నాను. "ఎనిమిదివేలు కొంచెం అటు,ఇటు నా,ఫీజు వేరే!అన్నాడు.  నామొ ఖం  లో వె  లుతురంతాపోయి  గాలితీసిన      బెలూన్ అయిపొయింది.   ఆలోచించి ఫోన్ చేస్తా అన్నాను.  
           మళ్ళీ రెండురోజులు గాప్.  పాత కార్పెంటర్ వచ్చాడు.  వీళ్ళు అన్నదమ్ములు నలుగురు   తలోపని చేస్తారు. మేము   భాగ్య నగరం వచ్చినప్పటినుంచీ       వీళ్లే   మాకాధారం. హమ్మయ్య అనుకొన్నా. కొత్తగా పెళ్లయింది ట సంక్రాంతికి అత్తారింటికి వెళ్ళిపోయాడు. ఏరోజుకారోజు వస్తాడని   పడిగాపులు.   ఫ్యాన్ బిగించే చెక్క కోలుచుకోడం మర్చిపోయానని కొలుచుకొని వెళ్ళాడు.  మర్నాడు ఫోన్ చేస్తే    వంటింటి గోడ కున్న రంగు   మాచ్  అయేది దొరకలేదు దొరకగానే వచ్చి చేస్తా నని       సమాధానం.  మా పిన్ని వాళ్ళతో షిర్డీ      ప్రయాణం పెట్టుకొన్నా.ఏడున్నరకి     కారువస్తుంది,వెళ్ళాలి సర్డుకొంతున్నాను.ఫోన్ చెయ్యకుండా    బ్రష్ లు,రంగులు,చెక్క
ఇద్దరు సహోద్యోగులు    తయారు.  నాగొంతులో వెలక్కాయ పడ్డది,"ఇప్పుడొ చ్చావా ?"అన్నాను.  ప్రయాణం సంగతి చె ప్పి,ఘంట లో కారు వస్తుందన్నాను. అయిపోతున్దమ్మా !అని నలభై నిముషాలలో    పనిపూర్తి చేసాడు.
సరే నేనూ      చీపురు పుచ్చుకు శర వేగంతో     వంటిల్లు శుభ్రం చేసుకు వెళ్లాను. ఈకాస్త  పనికి ఎన్నాళ్ళు "తుమ్మిండా"పెట్టాడు అనుకొన్నాను.
                                                  కద  అయిపోయిన్దనుకోకండి.  ఫాన్ కి కనెక్షన్  ఇవ్వద్దూ!   బస్తీలలో ఫ్లాట్లలో    వంటింట్లో కిటికీలు అరుదు. ఎక్జాశ్ట్ ఫాన్ లేకపోతె పోపువేస్తే      ఆజిడ్డు వేడి,ఘాటు   మన చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే వుంటాయి. మళ్ళీ     వేట మొదలు.    ఇంతలో మా  తమ్ముడు వచ్చాడు.   వచ్చిన రోజునే ఈ  పని అప్పగిస్తే చేసేవాడే!కానీ   వాడువేల్లెరోజున కానీ     వాడు ఎలెక్ట్రికల్ ఇంజనీరని   ఈ పని చేసి పెట్టగలదని ఆలోచన రాలా.
వాడు కొత్తవైర్ తెచ్చి క్షణం  లో కనెక్షన్ ఇచ్చాడు.  జై బజరంగబలి అనిఫాన్ స్విచ్ వేస్తె      అది తిరగలేదు. స్క్రూ డ్రైవరు తే! రెంచ్ తే!అంటే అన్ని అందించా .ఫాన్ ఊడదీసి.  పరిశీలించాడు. అదేడో తెలియాలా.దాన్ని చంకన పెట్టుకొని  బజారువెళ్ళాడు . సాయంత్రం రైలుకి    వెళ్ళాలి వాడు. తీరా ఏదో షాపులో రేపెరుకిచ్చి వెళ్ళిపోతే    మళ్ళీ తెవాలికదా !ఎన్నాళ్ళ కిస్తాడో!  అంతదాకా    వంటింట్లో కంత. వెంటనే ఫోన్ చేసాను."తమ్ముడూ! వాడు వెంటనే రిపేరు చేస్తానంటే ఇయ్యి. లేకపోతె తెచ్చేయ్యి.అని.   ఘంటకి వెనక్కి వచ్చాడు. ఇందులో ఒక పార్ట్ కాలిపొయిన్దిటె అక్కా! అడికోనివేసి వెల్డింగ్ చెయ్యలిట !ఇప్పుడుకాదులే అని తెచ్చేశాను.  అని మళ్ళీ  దాన్ని యధాస్థానం లో బిగించాడు.
                   నిన్న మధ్యాన్నం నిర్మల ఫోన్ చేసి    ఎలక్ట్రి షి యన్    వచ్చాడు పంపిస్తున్నానని పంపింది.  అతడు వచ్చి ఫాన్ ఊడదీసి పట్టుకెళ్ళి    నాలుగువందలవుతుంది    చెయ్యనా !అనిఫోన్ .చేయ్యిబాబూ!అన్నాను. ఇంతకుముందే ఫాన్ తెచ్చి బిగించాడు.   ఫ్యాన్ ఉషారుగా తిరుగుతోంది.ఇక జంతికలు వండుకోవచ్చు.
         కాలం ఎలావుందంటే     ఆడా మగా బేధం లేకుండా     అన్ని పనులు చేసుకోవడం నేర్చుకోవాలి. చిన్న చిన్న రి పెర్లకి వచ్చేతీరిక ఎవరికీ వుండటం లేదు . 

1 comment:

Kottapali said...

we feel your pain .. but possible only for you to describe even such irritations so entertainingly.