Pages

Tuesday, April 16, 2013

బొస్టన్ లొ బాంబులు

                

            ఇవాళ     పొద్దున్నే  మా  చిన్నవాడు    ఫోన్ చేసాడు .   
'అమ్మా!  ఏం   చేస్తున్నావ్?   "
'ఏమీ   లేదు  నాన్నా!  ఇప్పుడే    చాయ్    తాగాను,  పుస్తకం     చదువుకొంటున్నా!'
సరే!ఇవాళ     ప్రోగ్రాం     ఏమిటి?   "
మంగళ వారం ఆర్ట్ స్కూల్ కి సెలవు.     ఇంటిలోనే    ఉంటా,ఎక్కడికి వెళ్ళను ."
"డిన్నరు చేస్తున్నా    మళ్ళీ     మాట్లాడుతా   !"అని ఫోన్ పెట్టేసాడు . 

ఒక్క క్షణం     అనిపించింది     ఇవాళ      సండే     కాదుకదా   ఫోన్ చేసాదేమిటి?   అని,మళ్ళీ    అనిపించింది వేర్రినాన్నకి      అమ్మతో  మాట్లా డా లనిపించిన్దెమో !అని నవ్వుకొన్నా!
               ఇంకొంచెం      సేపటికి     నా ఫ్రెండ్     ఫోన్ చేసి     చిన్నాడితో   
మాట్లాడావా?  అంది 
ఆ మాట్లాడానన్నాను 
ఎప్పుడు మాట్లాడావు?అన్ది. 
ఇప్పుడే రెండు నిముషాలయింది . 
ఏమంటున్నాడు? 
  ఇంట్లోనే వున్నాడు డిన్నరు చేస్తున్న నన్నాడు . 
టీ వి    చూసావా? న్యూస్ విన్నావా?అన్ది. 
లేదే 
బోస్తోన్లో    రెండు బాంబ్   బ్లాస్ట్   లయాయిట  మా    మనవడు    మాట్లాడాడు బాగానే వున్నాడట. అని పెట్టేసింది . 
వెంటనే టీ వి    పెట్టాను    ఘోరం    అమాయిక ప్రజలపై    అన్యాయం 
చిన్నాడికి   ఫోన్ చేస్తే ఎత్తలెదు. సెల్ ఫోన్లు   కట్   చేసారని న్యూస్.  మెయిల్ 
పెట్టాను . ఫోన్ చేసినందుకు   సంతోషం వ్యక్తపరుస్తో మా  ఇంటి   ఇల వేల్పయిన  బాలా   త్రిపుర    సుందరికి   వేయి నమస్కారాలు   చెప్పుకొన్నా! బిడ్డలు   ఎక్కడున్నా    రక్షించేది    ఈశ్వరుడే  !  నేను ఖంగారు పడతానని బాంబ్ ల సంగతి చెప్పలెదు. తెలియ నప్పుడు ఏమీ లేదుకానీ   తెలిసాక    కాళ్ళు గజగజ లాడాయి . 
పిల్లల    క్షేమ సమా  చారం   తెలియక ఎంతమంది   తలిదండ్రుల    గుండెలు   గిలక్కయల్లా    కొట్టు కొంటు న్నాయో!   సముద్రాల    అవతల  పిల్లలు, సముద్రాల    ఇవతల    తల్లులు. 
    మనిషి ప్రాణం కానీకి కొరగాకుండా   వున్ది. ఎవరిమీదో కక్ష,మరెవరికో శిక్ష 

రాక్షస ప్రవృత్తులు    పెరిగిపొతున్నాయి.   ఎవరికీ  అందని ప్లాన్లు వేసి  ఘోరక్రుత్యాలకి    పాల్పడు తున్నారు. బోస్తోన్లో పేలిన బాంబుల శబ్దం   దేశం లో అందరిచేవుల్లో  మ్రోగి   భయభీతుల్ని చెసిన్ది.    బోస్తోన్లో గాయపడ్డవారి కుటుంబ సభ్యులందరికీ   సురుచి సానుభూతి   తెలుపు కొంటోంది . వారు త్వరలో కోలుకోవాలని ప్రార్ధి స్తోంది . మనుష్యులలో    మానవత్వాన్ని    పెంచి  కసిని,కాఠి న్యాన్నిఅణిచి వేయమని     సర్వేశ్వరు ని  వేడు కొంటున్నది . 


1 comment:

శ్రీలలిత said...


అంతే..అంతే..
ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధించడం తప్ప మనం చెయ్యగలిగేది ఏదీ లేదు..
మీకు బెంగ లేకుండా మీ అబ్బాయి ఫోన్ చేసినందుకు సంతోషంగా ఉంది.