మహా పురుషుడు
మాబోటి హైస్కూలు విద్యార్ధులందరికి ఒక పత్రిక సన్నిహితం కాసాగింది.ఆ భాషలో మా జీవితాలు వాంఛీచిన శక్తి మిళితమై ప్రవహిస్తున్నది. మమ్ము ఆ చిన్నతనం లోనే కూర్చుండ బెట్టీ చిదివింపించుకొనే హృదయ సాన్నిధ్యం ఆ పత్రికలొ వెన్నెలలా వికసించి వున్నది.
మేము కోరిన వార్తలు అందులో వున్నవి.మెము వ్యక్త పరచలేని వాంఛలు ఆ పత్రికలొ గాఢమైన ,స్పష్ట ,ఉత్తమ మైనరూపం లో ప్రత్యక్షం కా సాగినవి. శ్రీ కవి దేశికులైన చెళ్ళపిళ్ళ వారి కవిత్వమూ ,సకల భారతావనిలొ ఉబికి పొటెత్తి వస్తున్న జాతీయతా-కావ్యాలుగా ,వ్యరాగమూ ముఖ్య సంపాదకీయమై అసాలుగా,వార్తలుగా ఆ పత్రికలో దీపించి వున్నవి.
మాకు సన్నిహితమూ ,శుభోదయ తూర్యారావమూ నైన ,ప్క అనర్గళ గంభీర రావము ముఖ్య సంపాదకీయమై మా జీవితాలు నింప సాగింది.
వారం వారం కృష్ణా పత్రిక కై ఎదురుచూసేవాళ్ళం. నవ్య కవిత్వ పితామహుడైన వేంకట శాస్త్రి గురువర్యుని శిష్యుల పద్యాలు ,కవుల వాగ్వివాదాలు ,కలను గురించిన సిధ్ధాంతాలు ,విద్యను గూర్చిన నూత్న విధానాల చర్చలు ,పుస్తకాలయాల ఉత్కృశ్టొపయోగాలు ,స్వాతంత్ర్యము,దేశభక్తి ,ఆంధ్ర సంస్కృతి ,భారతీయ సంస్కృతి ,సంఘ సంస్కరణ,ఆర్ధిక సంస్కరణ మొదలయిన అనేక విషయాల్లో మా కా పత్రిక దేశికత్వం వహించింది.ఆ దినాల్లో{1912} అవధానాలు పనికి రావని కృష్ణా పత్రికకు నెనూ వ్యాసాలు వ్రాసాను.
ఇంత మహోత్తమ మైన పత్రికను నదిపె మహా వ్యక్తి ఎవరూ అని మాలొ మేము చర్చించుకొనే వాళ్ళం .మా భీమవరంలో 1906 లొ కృష్ణ్ జిల్లా రాజకీయ మహా సభ జరిగింది. ఆ సభకు స్రీ కృష్ణ రాయలు వచ్చారు.ఆయనలో ఏదో మహాశక్తి నేనూ ,నా స్నేహితులూ దర్శించాము. ఆయన రూపం నా హృదయ ఫలకం లో చిత్రిత మైంది.మా భీమవరం సమీపంలొ కుముదవల్లి లో వీరేశలింగ గ్రంధాలయ ,ప్రార్ధన సమాజాల సంవత్స రోత్సవాని కొకదానికి ఆయన వచ్చారు.అదీ నాకు జ్ఞాపకమే!
అయినా కృష్ణా పత్రిక మాకు అంత దగ్గర అయినప్పుడు ఆపత్రికా నేతను సంపూర్ణ దర్శనం చేసుకొందామని 1912లొ వసంత కాలం లో బందరు వెళ్ళి ఆయన్ని చూచాను. నెను బాలుణ్ణి ఆయన దేశికుడు .
2
చిత్రకళా విద్యార్ధినై శ్రీ ప్రమొద కుమార చటోపాధ్యాయుల శిష్యుడనై ఆంధ్ర జాతీయ కళాశాలలో చేరాను. కళాశాలలో ఆనాడు శ్రీ కోలవెన్ను రామ కోటేస్వర రఒ ఉపాధ్య క్షుడు. శ్రీ విశ్వనాథ సత్య నారాయణ పండితుడు. చిత్ర కళా విద్యార్ధిగా చేరటానికి కారకులు వీరిరువురూ ,శ్రీ కృష్ణా రావు గారు. ఆ దసరాకు ముందు కళాశాలలొ చదువుకొంటున్న మా తమ్ముణ్ణూ చూడటానికి వచ్చినప్పుడు ,నేను రామ కోటేశ్వర రావు ,విశ్వనాథ సత్య నారాయణముగ్గురం కలిసి కృష్ణా పత్రిక ఆఫీసుకు వెళ్ళాము.ఏదో మాటా మంతీ జరిగింది.నేను అజంతా,ఎల్లోరాలగురించి వర్ణించాను.మా రామ కోటేశ్వర రావు "మా బాపిరాజు చిత్ర కారుడు,కూల్డేగారి శిష్యుడు."అని కౄష్ణా రావు గారితో చెప్పాడు.
కౄష్ణారావుగారు-అయితే మీరు భారతీయ చిత్రq కళను ఎందుకు నేర్చుకోగూడదండీ ?
నేను-నేర్చుకొందామనే వుందండీ!
కౄష్ణా-మా కళాశాలలో చేరండీ!ప్రమోదబాబు చిత్రాలు చూసారా?
రామ కోటేశ్వర రావు-ఈ రెండు మూడు రోజులనుంచీ ఈయనగారు ప్రమోద బాబు దగ్గరే కూర్చుంటున్నారు.
విశ్వనాథ -ఇదివరకే బాపిరాజు కవిత్వంలో చిత్ర లేఖనం వ్రాస్తున్నాడూ,ఇక ముందు చిత్ర లేఖనం లో
కవిత్వం వ్రాయ మొదలెస్తాడు కాబోలు.
3
నేను చిత్ర విద్యలో చటర్జీ గారికి ,కృష్ణరావు గారికి కూడా శిష్యుడనయ్యాను. పగలల్లా చటర్జీ గారి దగ్గర చిత్ర విద్య నభ్య సించదమూ
సాయంకాలము కృష్ణా పత్రికాలయంలో మితృలతో పాటుకృష్ణారావుగారి సన్నిధిని భారతీయ సంస్కృతికి సంభందించిన అనేక విషయాలు చర్చించుకొంటూ నేర్చుకోవదము ఉపక్రమణ అయ్యాయి.
స్నేహితుడై,దేశికుడై కృష్ణారావుగారు నవరసాలు పోషిస్తూ ప్రసంగాలు ఉద్భవింప చెస్తూ ,సంభాషణలలో పాల్గొంటు ,నవ్వించినవ్వుతు,కవ్వించి కవ్వుతు ,శాంతంగా,గంభీరంగా ,తీక్షణం గా,గాఢంగా విజ్ఞాన ప్రవాహాలు వరదలు కట్టించేవారు. రాజకీయాలలో త్రొక్కిస లాడేవారము,కళా విషయాలలో గల్లంతు పడేవాళ్ళము,కావ్య చర్చలు కళయపి చల్లేవారము.ఆధునిక విజ్ఞాన విషయాలకు అక్కజము పడేవారము.-దేశాలు, వాటి సౌభాగ్యాలు ,ఆచార వ్యవహారాదులు -మనుష్యులు,వారి మనో వృత్తులు అన్ని విషయాలు వారు ఆనందంతో చర్చించేవారు.
మా కావ్య రచనలు వారికి చదివి వినిపించేవారము. అన్నీ వారు వింటు సంతోషం వెలిబుచ్చుతు,వ్యాఖ్యానం చెస్తు,మౌనంతాలుస్తు మాకు హుషారు కొల్పేవారు.ఆశలు కొల్పేవారు.
నా ఆశయాలు నా స్వప్నాలు ఆ ఉత్తమ స్నేహితునికి మనవి చేసుకునేవాణ్ణి. మందమలయానిలం ప్రసరించిన పూవునై వికసించేవాడిని.చంద్ర కిరణ స్పర్శచే ద్రవించిన కలువపువ్వు నయ్యే వాడిని.వసంత సౌరభోదయ స్పందిత పికరాజునైకంఠ మెత్తి పాడే వాడిని. 4
" కళ ఆనందం కొరకే ఉద్భవించింది.కాని మనుష్యుడు ఆనందం ఉద్భవింప చేయగల ఆ శక్తితో కళల ద్వారా తన జీవిత రహస్యాన్ని అన్వేషిస్తాడు."అని కృష్ణరాయలు ఒకనాడన్నారు.
"మనుష్యుడు సలిపే అనేక కర్మల వల్ల అతనికి ఐహిక పారలౌకిక సుఖాలు లభిస్తూనే వున్నాయి. జీవిత పధం గమిస్తూ,మనుష్యుడు జీవిత రహస్యం గమనిస్తూనేవున్నాడుకదాండి.అలాంటప్పుడు ఆనంద ప్రయోజనమైన కళాశక్తిని ఇతర ప్రయోజ నార్ధముపయోగించడం దోషం కాదాండీ?అని ప్రశ్నించాను.
ప్రాపంచికంగా నష్టం వచ్చే మార్గాలు,పనులు వున్నాయి కదా?అలాగే ప్రపంచాతీత పధం అన్వేషించేవారికీ నష్టం వచ్చేమార్గాలూ,పనులు వున్నాయి. ఈరెండు పధాలేకదా మనుష్యునికి ఆనందం ఇచ్చేది.అవేకదా కళావస్తువు అయ్యేది.ఈరెండు పధాలలో మనుష్యునికి నష్టం తెచ్చే విషయాలు కథావస్తువు చేసుకోవడముమానవ నాశనానికే కారణ మవుతుంది.అందుకనే మనుష్యుడు చతుర్విధ పురుషార్ధ ప్రదాలైన ఉత్తమ విషయాలనే కళా వస్తువులుగా స్వీకరించ వలసి వుంటుంది."
ఇలా ఎన్నో సమాయాలలో శ్రీకృష్ణ రాయలు కళా రహస్యాలు అందిస్తూ వుండే వారు.ఒక కళ లేమిటి?ఒక దర్శనాలేమిటి?ఒక రాజ నీతి ఏమిటీ ?సమస్త విషయాలూ వారికి కరతలామలకములే "చదువులలో మర్మాలు చదివిన" మహా పురుషులు వారు.
శ్రీ కృష్ణ రాయలు కళా హృదయులై ,దివ్యత్వం వాంచించే తపస్వి.ఐహికాముష్మికాలనూ ,చారు చర్యా సహిత మైన కళానంద బ్రహ్మానందములను
పరామర్శించి ఉపదేశించడమే వారు సలిపిన కర్మ యోగం.ఆయన పరిశీలించి ,దర్శించిన సత్యాలు సిధ్ధాంతాలుగా ప్రవచిస్తూ ,లోకమును సుఖ మయము,,సుందరము చేయాలని కోరేవారు.ఆయన ప్రధమం నుంచీ మహా పర్వత శృంగ నివాసిలా సర్వ పధాలోకన సక్తి సంపన్నుడు.
5
మా దురువు శ్రీప్రమోద కుమార చటోపాధ్యాయుల చిత్ర రచన సర్వతోముఖ మైనది.ఆయన సిధ్ధ హస్తుడు.కానీ ఇతర విష్యాల్లో ఆయన బాలుడు.చిత్ర విద్యాభ్యసనం చేసే శిష్యులలో కర్మఠత్వం లోపిస్తెఏమాత్రమూ ఒప్పడు.కాబట్టీ కొందరు శ్ష్యులకు ఆయన నిశిత విమర్శ కోపకారణ మయ్యేది.కళాశాలాధికారులు చిత్ర విద్యా శాఖకు సరియైన సహాయం చేయడం లేదని ఆయన కొరకొర లాడేవారు.
వారీ వీరీ కోపతాపాలు శ్రీ కృష్ణరాయలు తన వాగమృతం చల్లి శాంతింప చేసేవారు.ఆసమయంలో సుందర శ్రీమూర్తి యైన శ్రీకృష్ణరాయని మోము ఇంకనూ కాంతివంత మయ్యేది.సంతోషం వెల్లి విరియ చెసే హాస్య వచనాలు ,చల్లదనాలు వికసించె పచ్చ కర్పూరపు భావాలు మా గురు వర్యునికి కోపోప శమనం చేసేవి. చటో పాధ్యాలు రచించిన మహోత్తమ చిత్రాలను శ్రీకృష్ణ దేశికులు వ్య్ఖ్యానిస్తూ వుంటేపవిత్ర కావ్యాలను దర్శించి నట్లయ్యేది. చటోపాధ్యాయులు ముగ్ధులై తన చిత్రాలను తాను నిజమైన ప్రేక్షకుడై దర్శించి ఆనంద వికసిత హృదయుడైపోయేవాడు. కళా మర్మాలూ,సౌందqర్యాలూఅరచేతి అరటి పండ్లయ్యేవి మాకందరకు.
"చిత్ర కారుని హృదయంలో మహా భావ దర్శనమే కాక తద్భావ వ్యాఖ్యానమూ దర్శనం కావాలి.అప్పుడే చిత్ర కారుడు సంపూర్ణ చిత్రం విన్యసింప గలడు." అన్నారుకృష్ణ రాయలు.
జాతీయ కళాశాల స్రష్ట శ్రీ హనుమంత రాయలూ ,శ్రీ కృష్ణ రాయలూ ఎన్నో ఆంధ్ర శిల్పాలు సేకరించేవారు.ఆ ఉత్తమ శిలా శిల్పాలు మా కళాశాల నందగించినవి.
"బాపి రాజుగారూ !ఉత్తం భావ మధ్యస్తుడై శిల్పి చిత్ర రచనకు పూనుకోవడం,ఋషి హిమాలయం లో తపస్సు చేయడం వంటిది." అని కృష్ణ రాయలు అనేవారు.
6
శ్రీకృష్ణ రాయలు సుందరాకారుడూ.మేలిమి బంగారు ఛాయ.విశాల ఫాలము. ఆకర్ణాంతైందీవర పత్రాలైన నేత్రాలు,గరుడ నాసిక ,సమమైన కోల మోము, ఆమ్ర ఫల చిబుకము,శ్రీకారాలైన లంబ కర్ణాలు,విపుల వక్షుడు,దీర్ఘ బాహుడూను .తెల్లని కోర తలపాగా ధరించి ,మోకాళ్ళ వరకూ వేళ్ళాడే తెల్లని చొక్కా ధరించి వేగం గా ఆయన నడిచి వెడుతూంటేఒక దివ్యుడు భూమికి అవతరించినట్లే వుండేది.
శ్రీకృష్ణ రాయలు ధీర లలితుడు.నేను 1935 లో ఆంధ్ర జాతీయ కళాసాలకు కులపతిగావచ్చినప్పుడు వారికి మరీ దగ్గిరగా పోయిన అంతేవాసినయ్యాను.ప్రధం పర్యాయం రామ కోతీస్వర రావు,విశ్వనాథ,నేనుశ్రీకృష్ణ రాయల చుట్టూ చేరినాము.అప్పుడప్పుడూ నండూరి సుబ్బారావు,బెల్లం కొండ రాఘవ రావూ వచ్చేవారు.
బందరులోనే చదువుకొంటున్న నాయనీ వచ్చేవాడు.చెరుకువాడ వెంకట నరసిం హం గారు వచ్చేవారు.
ఈనాడు మా కాటూరి వేంకటేశ్వర రావు బావగారున్నారు నాతో.కృష్ణాపత్రికలోదర్బారు ఏర్పాటయింది.దర్బారీయులుగా పింగళి నాగేంద్రరావు,మునిమాణిక్యం నరసిం హా రావు,మల్లాది రామ కృష్ణ శాస్త్రి,గబ్బిట బాల సుందర శాస్త్రి మొదలయిన వారెందరో వచ్చేవారు.నేనాదర్బారు చిత్రకారుణ్ణీ.శాయరు మా కాటూరి బావగారు.మునిమాణిక్యం వినోద వయస్యుడు.నేను భరత నాట్యాల బావను,పింగళి నాగేంద్రులునాటక సూత్ర ధారులు.
పన్నీటి జల్లులతొ,గంధపుబూతలతో అత్తరువులు అలందుటలతో,ధూప దీపాలతో మా దర్బారులో దిన దినమూసౌరభాలుగాటంగా అలుముకు పోయేవి.
హాస్యరస సమ్మిశ్రితమై సర్వ రసాలూ చర్చకు వచ్చేవి.సర్వ కళలూ,విద్యలూ,సర్వ విషయాలూ,సంభాషణ వస్తువులయ్యేవి.అన్నింటి లోనూ అంతర్భూత మైన సత్యాన్ని వ్యగ్యంగా శ్రీకృష్ణ రాయలు అందిస్తూనే వుండే వారు. వారి చుట్టూ ఉత్తం శిలా శిల్పులు ,దారు శిల్ప మూర్తులూ సాక్షి స్వరూపం దాల్చి మాతోపాటు మంద హాసాలు చేస్తూ,కాల ప్రవాహ తరంగాలు గమనిస్తూ కొలువుతీర్చి వుండేవి.
శ్రీకృష్ణ దేవరాయలకు ఆ దినాల్లో మౌన మూర్తి అని పేరుకానిసొంత దర్బారులోఆయన మౌన మూర్తి కారు.చంటి బిడ్డల అల్లరి,జవ్వనపు పొంగు ఎప్పుడూ మాటలలో ప్రదర్శిస్తూనే వుండేవారు.ఆయన కలానికి మౌనం లేదు.ఔచిత్య పూర్ణ మైన నిశిత విమర్శ,పొగడ్త పొంత బోని మెప్పు,సూటి తప్పనిచూపుదువ్రేలూ తమ పత్రికా బాలకు సహజాలంకారాలు చేశారు కృష్ణ రాయలు.
నేను కళా పీఠం మ్రోల ఒక అల్పోపాసిని.ప్రజ్ఞా హీనుని అన్వేషణ నాది.ఆ అన్వేషణకు పుష్టి చేకూర్చి ,ఆ ఉపాసనకుతీవ్రత ప్రసాదించినముగ్గురు గురువులలో కృష్ణరాయలొకరు.
8
ఆయన చాయాగ్రహణానికి ఒప్పుకొనేవారుకాదు."అసలు నన్ను మీరు ఫొతో తీయాలిగాని,డాంబిక మైన ఈ బాహ్య రూపాన్నా?" అని వారు తలపాగా తీసి,తమ బట్టతల ప్రదర్శించారు.కట్టూడు పళ్ళూ తీసివేసి బోసి నోరు చూపెట్టీ "ఈమాయా రూపాన్నా మీరు ఫొటొ ఎత్తడం? "అని పకపక నవుతూ ప్రశ్నించారు.ఆ ముక్కలకు నాకూ నవ్వు వచ్చింది. ఏదో వివరింపరాని సత్యమూ సాక్షాత్కార మయ్యింది.
ఓ కృష్ణరాయ దేశికా!వెడదలైన నీ కాటుక కళ్ళల్లో వెలిగేసాంతి మహా ధారగా మా కెంత శక్తినిప్రసాదించేది!
ఓ దివ్య సుందర మూర్తీ!నీ చేతలలో గర్భిత మైన వెలుగుమాకు నిజ మార్గం చూపేది.
ఓసంతత మృదు హాసాంచిత వదనా!నీ మాటలలోని అమృతము మాకు గంభీర జ్ఞాన మనుగ్రహించేది.
నీజాతీయత జాతులకు మించినమానవ సౌందర్య ప్రకాశము.
నీ ఆంధ్ర సంస్కృతి ప్రేమ దేశ కాలాతీత మైనసర్వ సంస్కృతి పూజ.
నీవు మహామునుల వంశం వాడవు.
నీవు బాపూజీ మాటలకువిశేష ప్రతిపత్తికూర్చేవ్యాఖ్యాతవు.
నీవు ఉత్తమ కళాకారుల సిధ్ధహస్తాలలో తొలంకే భావ గాంభీర్యానివి.
నీవు దివ్య కవుల కావ్యాలను వెలిగించే ఛంద సౌందర్యానివి.
ఓ దేశికా,నీకు నమస్కారాలు.
నీవు మా హృదయాలనేనీ దర్బారు చేసుకొన్నావు.
నీకు నమో వాకాలు.

No comments:
Post a Comment