Pages

Thursday, August 22, 2013

                  ప్రియమైన    మాలతిగారు
                                                         మహిళా ప్రపంచంలో     తన     "ప్రమదావనం "తో ఒక    ప్రభంజనం
సృష్టించిన    ప్రతిభాశాలి      శ్రీమతి     మాలతీ చందూర్   గారు.   ఆంధ్ర ప్రభ   వీక్లీలో    వారం వారం స్త్రీలకోసం
వ్రాస్తూ   పిండివంటలతో,  కుట్లు-అల్లికలతో   ,అందరినీ     ఆకట్టుకొన్నారు. ప్రశ్నలు    జవాబులు శీర్షిక    ఆడవాళ్ళ కోసమే అయినా ప్రభ రాగానే     జవాబులు    మగవాళ్ళే ఎక్కువ   చదివేవారు. ఎవరో ఒకరు వేసిన ప్రశ్నకి     పాఠ కులకి     ఎందరికో     సమాధానం దొరికెది. "మా అమ్మాయికి   పేరేమి పెట్టను?     "నేను పదవ క్లాసు చదివాను.ఇప్పుడేమి చెయ్యమంటారు? "  "నేను కాలేజీకి    బస్సులో వెడుతుంటే    రోజు ఒక అబ్బాయి   కిళ్ళీ       కొట్టు దగ్గర       నిలబడి   నన్నే   చూస్తూ వుంటాడు .ఇది ప్రేమే నంటారా? " వంటి    వేల ప్రశ్నలకు    తాపీగా సమాధానం వ్రాసెవారు. కుట్లు వంటల దగ్గర నుంచి      వనితలను  నెమ్మదిగా   స్సాహిత్యం వేపు,రాజకీయాల వేపు  తిప్పిన రచనలుఆమెవి. సాదా సీదాగా     వుంటూ    నాలుగురితో            కలిసిపోయి     ,తన ప్రత్యేకతను నిలుపుకొంటూ    జేవనం సాగించారు. .ఈమె భర్త   గారు   జగతి అనే పత్రిక   నదిపేవారు.   ఆసాంత         చదివితే గాని    ఆపత్రికని    వదల  లెము.    చందూర్   గారి,సహాయము, ప్రోత్సాహము   మాలతి గారి కలం లో   కొత్త సిరా పొసెవి.    మాలతిగారు     చిర   స్మరణీయురాలు .  స్త్రీలలో    చైతన్యం    నింపిన   యోధురాలు. ఆమె  ఆత్మకు శాంతి   కలగాలని ప్రార్ధిస్తున్నాను.     

1 comment:

susee said...

ammaa- malathi garini pogottukuni telugu saahithee saraswathi - shokaparitapthuraalu ayindi -- malathi gari smruthi ki nivaalulu-voleti venkata subbarao, Vernon hills IL-60061 /USA