ఏమిరా! గోపాల కృష్ణా ?
గోపికలు చిన్ని కృష్ణుడు చేసే అల్లరి పనులు భరించలేక ,కృష్ణుణ్ణి ఏమీ అనలేక యశోదమ్మ దగ్గరికి వచ్చి ఫిర్యాదులు చెస్తారు. యశోద "ఏమిరా!గోపాల కృష్ణా? నిజంగా అల్లరి చేసావా? అంటుంది .కృష్ణుడు "అబ్బే! నాకేమీ తెలియదమ్మా! అని భయపడి పోతూ నుంచుంటాడు .వీరి సంవాదం పాటలో -ఆనందించండి .
గోపిక -వినవమ్మ యశోదా!నీ వరతనయుడు చేసేటి దుడుకు పనులు విచారించ బోతే భారత భాగవత మాయెను! ఎట్లనో? ఇక నెట్లనో? యశోదమ్మా! ఎట్లనో? ఇక నెట్లనో?
యశోద - అయుదు ఏండ్ల బాలుడు వా డిం త పని ఏమి చేయు! చెప్పరే! చాటి చెప్పరే! ఆ ఘాతుకములు చెప్పరే!చాటి చెప్పరే!
గో- దొరబిడ్డ దనుచు మేము వెరచి చెప్పలేముకానీ చిరుత పనులను ఇట్లు సాయా ఎరుగ మెన్నడు ఇరుగు పొరుగుల అడగవే!నీవే! అడగవే! యశోదమ్మా! అడగవే! నీవే అడగవే!
కృ -ఇంట దుడుకు ఏమి చేస్తిని ?నా వంటి వారు లేర మీకు? ఎంతకైనా సాహసులు ఈ ఇంతులని నీ నేరుగానే!అమ్మాఎరుగనే!యశోదమ్మా!ఎరుగనే!తల్లీ!ఎరుగనే!
గో-సన్దులోను కొత్త కోడలు జలకమాడు చుండగాను ఇందుకేవ్వారు లేరు దానమిమ్మనీ చేయ్యోగ్గినాడు!ఎట్లనో? ....
యశోద -ఆడవారీ చోటికి మగవాడ వై ఏమిటికి పోతివి?చున్నపిల్లను దాన వేడ నీకచటేమి యున్నది? ఏమిరా!కృష్ణా! ఏమిరా?.....
పండ్లు పండిన కిచ్చిలి చేట్లుండగా నేనందు కరి గితి. పండ్లు ఇమ్మని దోసిలోగ్గితి పైని నా కేమియు తెలియదు .ఏరుగనేఅమ్మా! ఎరుగనే!.......
గో- పెరుగు చిలుకు చుండగాను ,మరుగునా నిలుచుంది వెన్న జురుగు చారలు తీసుకొని బిరబిరా జుర్రోచ్చినాడు,ఎట్లనో!ఇక నెట్లనో?
య -అడిగినంతా వెన్న నీకు పెడుదురా? మన ఇంట్ల లేదా?ఇరుగు పొరుగు ఇండ్లకేగి దొంగిలి తినబోవనేలా? ఏమిరా!కృష్ణా!ఏమిరా?
కృ-దేవరకును పెట్టలేదని ఆవరకే అనుకొంటూ వుండిరి దెవరేమో మింగి పోయెను తెలియక నామీద పెడితిరి ఎరుగనే!అమ్మా! ఎరుగనే!
గో - గొల్లపిల్ల లంత గూడి చల్లలమ్మ బోవు నప్పుడు చిల్ల రాళ్ళ చల్ల కుండలు చిల్లులు పడవేసి నాడు !ఎట్లనో? ఇక నెట్లనో
య - గొల్లపిల్ల లంత గూడి చల్ల లమ్మ బోవునప్పుడు చిల్ల రాళ్ళ చల్లకుండలు చిల్లులు పడవేసి నావట? ఏమిరా ? కృష్ణా ఏమిరా?
కృ -చల్లగా ఆ సమయ మందున వడగళ్ళ వర్షం కురిసి కుండలు చిల్లులైనయి ఏమోగానీ!ఎరుగనే!తల్లీ!ఎరుగనే!
గో- వేణు నాదము వూ దుకొంటు వే డు కాతో పాడుకొంటూ మేకపిల్లను పట్టుకొని ఆవుల చెదర గొట్టాడు,ఎట్లనో!ఇక నెట్లనో ? యశోదమ్మా!
య- సరస మైన సాదు పిల్లల గురుతు తోటి వుండ మంటే ,పిరికి పిల్లల వద్ద కేగి దిన దినం ఫిరియాదు తెస్తావు ఏమిరా!కృష్ణా!ఏమిరా!
కృ- అరుగుమీద చెలుల తోటి ఆడుకొంటిని ,పాడుకొంటిని ,అన్తకన్నాఏమి ఎరుగను ఎరుగనే ఓ యమ్మలారా! ఎరుగనే!తల్లీ! ఎరుగనే !
గో- నోటినిండా విడెము పెట్టుకు నీటు గోటుకు చేరిరాగా ,బాటలో నుంచున్న కాంతా భామపై ఉమ్మేసినాడు ,ఎట్లనో !ఇక నెట్లనో ?యశోదమ్మా! ఎట్లనో?
య- నోటినిండా విడెము పెట్టుకు నీటు గోటుకు చేరిరాగా ,బాటలో నున్చున్నకాంతా భామపై ఉమ్మేసినావట !ఏమిరా !కృష్ణా ఏమిరా?
కృ -చూడలేదమ్మయ్య నేను చీడీల మీద చిన్నవాణ్ణి ,ఆడుకొంటూ వుండి గోడ బారుపై ఉమ్మేస్తే పడెను ఎరుగనే తల్లీ!ఎరుగనే!
గో- చిన్ని కృష్ణుడు ఇంటికొచ్చి ,చక్కగా కూర్చున్దిపోక ,చెలుల మీద కన్ను వేసి చేడేనీ నొక్కొచ్చినాడు ఎట్లనో!ఇక నెట్లనో !యశోదమ్మా!ఎట్లనో?
య-వారి ఇంటికి పోయినీవు కుదురుగా కూర్చుండి రాక ,చేలులమీద కన్ను వేసి చేడేనీ నోక్కోచ్చినావత?ఏమిరా!కృష్ణా!ఏమిరా?
కృ- చక్కనీ శ్రీ కృష్ణ రమ్మని,చెక్కిలీ మరి ముద్దు ఇవమని ,రక్కసీవలె నన్ను నన్నుపట్టగా ఒక్కపన్ను తాకెనెమో? ఎరుగనే!తల్లీ!ఎరుగనే!
గో-ఉత్తిమీద పాలు,నెయ్యి, చక్కగానే జుర్రుకోనీ తన కెక్కువైనా పెరుగులంతా ఇంగిలీ చేసోచ్చినాడు . ఎట్లనో ఇక నెట్ల నో !యశోదమ్మా!ఎట్లనో?
య-ఇరుగు పొరుగు ఇళ్ళకు పోవడ్డురా!అంటేను వినవు,ఎరుగజెయుదు ఇప్పుడే!ఈరోటికి నిను కట్టివైతు !ఏమిరా!కృష్ణా!ఏమిరా?
ఇంటిలో నుంచి ఎపుడూ పోను పోలే దమ్మ నేను ,మాటలను కల్పనా చేసిరి మగువలందరూ నాపైన ,ఎరుగనే!తల్లీ!ఎరుగనే!
గో-నిన్నరాత్రి చల్లగాలికి నీటి ఒడ్డున కూర్చుంటే ,నీటుగా మాచేయ్యి పట్టి ,చాటునకు !రమ్మని పిలిచే!ఎట్లనో!ఇక నెట్లనో !యశోదమ్మా!ఎట్లనో?
య-చీకటనగా తిరిగినీవు,చిన్నవాడ వై యుండి,కన్నకడుపు ఎట్లుఓ ర్చును నిన్నువిడిచికన్నతండ్రీఏమిరా!కృష్ణా!ఏమిరా?
కృ- చెలులు చెప్పిన మాటలన్నీ స్నేహమై యున్నాయి నీకు ,పాము కైనా పట్టి భాషలు నేర్పెదరు నేనేమి ఎరుగా!ఎరుగానే!తల్లీ!ఎరుగనే!
గోపికల వద్దకు పోవద్దురా అంటేను వినవు,ఎన్నినాళ్ళు తపసు చేసి నిన్ను కంటిని తనయుడా!ఒచిన్ని కృష్ణా !ఏమిరా!కృష్ణా !ఏమిరా?
*************************************************

1 comment:
aa baMgaaru taMDri chinni kiTTappa allari ni goorchi eMta maMdi enni vidhamulugaa vraasinanoo, enni vinnaa eMta chadivinaa aanaMdamE aanaMdamu.
chakkagaa muddu muddu gaa unnadi allari vivaraNa.
--
raajamouLi
Post a Comment