నా కాఫీ కథ
మా చిన్నతనంలో టీ ,కాఫీ అనేమాటలు తక్కువగా వినిపించే వి. వయసుతో సంబంధం లేకుండా అందరు చద్దిఅన్నాలు తినేవారు . ఊరగాయలు, గడ్డ పెరుగుతో సుష్టుగాతిని స్థిమితంగా పనులు చెసుకొనే వారు. నెమ్మదిగా ఆధునికత పెరిగి కాఫీ వంటిళ్ళ లోకి జొరబడింది . పిల్లలకి మాత్రం కాఫీలు అందనిచ్చే వారుకాదు. చిన్నతనం నున్చికాఫీలు తాగితే ఆరోగ్యం పాడవుతుందని ముప్పొద్దులా అన్నమే పెట్టేవారు .చెప్పొద్దూ నేనుకూడా 20ఏళ్ల దాకా కాఫీ ముట్టలేదు . అమ్మ నాన్నగారు ,ఇంటికి వచ్చిన బంధువులు స్నేహితులు అందరు కాఫీ సేవించేవారు . కా ఫీకాచి అం దరికి ఇచ్చెదాన్నికాని నేను తాగెదాన్నికాదు . మా తాతయ్యకి మహా భా దగా వుండేది . ఇదేమి ఖర్మే! ఒక్కగుటకన్నా తాగవే! అని ప్రేమని,కోపాన్ని కలిపి తిట్టేవాడు . మాన్నాన్నగారు ఆరగారగా కాఫీత్రాగేవారు,అసలు కాఫీ మీదే బతికేవారు . పక్కవాళ్ళ తృప్తి కోసం నాలుగుమెతుకులు కతికేవారు . కాఫీకప్పు,సిగరెట్టూ "నేనంటే నేనుఅని" మానా న్న పెదవులతో యుద్ధం చేస్తూ వుండేవి . మా నాన్నగారు కాఫీ ఎక్కువ తాగుతారని మా అమ్మ ఫిల్టర్ డికాక్షన్ తీసి, చింతపిక్క మునగకుండా తయారు చేసి ఘుమఘుమ లాడే కాఫీ ఇచ్చెది. మా అమ్మ కాఫీకి మంచి పేరుండేది
పెళ్ళయి అత్తవారింటికి వెళ్లాను . " అత్తింటి కాపురం మోచేతి దేబ్బలాటిదని " అనేవారు అన్నిటిమాట ఎలావున్నా నా ప్రాత:కాల భోజనానికి పరీక్ష ప్రారంభమయింది . మా వారు నలుగురు అన్నదమ్ములు ,ముగ్గురు అప్ప చెల్లెళ్ళు . పెద్ద ఆడబడుచు కు పెళ్లి అయి పిల్లలు వున్నారు. వాళ్ళ పిల్లలు మా ఇంట్లో చదువుకొనే వారు. తెల్ల వారుఝామున మా అత్తగారు లేచి రాగి కాగుతో కాఫీ డికాక్షన్ కి నీళ్ళు పెట్టే వారు. మా చిన్న ఆడ బడుచు కాఫీ పెత్తనం చేసేది ఆవిడే కాఫీపొడి వెయ్యాలి. కాఫీపొడి డబ్బా ఒకచేత్తో పప్పు గరిటె ఒకచేత్తో పట్టుకొని తప్పుకోండి తప్పుకోండి అంటూ వచ్చి ఆ కాగుడు నీళ్ళ లో రెండు గరిటెలు కాఫీపోడివేసి ఇంకో గ్లాసుడు నీళ్ళు డికాక్ష న్ పై చిలకరించి మూతపెట్టి ఆకాగు లోపలి తెచ్చి వడబోసేది . ఓ గరిటె పంచదార,ఓ రెండు గరిటెలు పాలు పోసేది .పసిపిల్లబాలాది గ్లాసులు పుచ్చుకు కాగుచుట్టు చేరి కాఫీ తాగేవారు .
నేనొక్కదాన్ని పొద్దున్నే స్నానం చేసి తులసి కోటలో నీళ్ళు పోసి,బెల్లమ్ముక్క నైవేద్యం పెట్టి పీట వాల్చుకొని ,కంచం పెట్టుకొని చద్దన్నం తినేదాన్ని . అప్పుడు సీను ఏమిటంటే కాఫీతాగే వాళ్ళంతా నాచుట్టు చేరేవారు . మావారు నా ఎదురుగా బాసిం పట్లు వేసుకు కూర్చుని తీక్షణం గా నాచేయి కంచంలోంచి నోటిదగ్గరికి వెళ్ళడం,మళ్ళీ కంచం లోకి వెళ్ళడం చూస్తూ "చూడండి రా మీవదినఎంతెంత తింటున్నదో? ఇదే వరసలో మూడు పూటలా తింటావు టో య్ ,ఇలా తింటే నా సంపాదన ఏమి చాలుతుంది? అని,తనను తాను సంబోధిన్చుకొంటు ఒరేయ్ ఇక నీ పని అయిపోయిందిరా! అనిభవి ష్యత్తు గురించి బెంగ పడే వారు. ఇక నాకు ముద్దగొంతులో దిగుతుందా? మా ఆడబడుచు కూతురు నాలుగేల్లపిల్ల. అదీ ఉత్సుకతతో చూస్తూ వుండేది . మా చిన్న మరిది ఓర కంట చూస్తూ "వదిన ఎంత శుభ్రం గా తింటుందో! ఒక్కమెతుకు మిగల్చదు,కంచం కడిగినట్లుంది ,ఎవరన్న అన్నం పెట్టుకు తినొచ్చు అనేవాడు . ఒకరొజుఅని మానేస్తారేమో అంటే రోజూ ఇదే వరస. ఒక శుభ ముహూర్తాన "రేపటినుంచీ నేనూ కాఫీ తాగుతా నత్తయ్యగారూ "అనిచెప్పాను . మర్నాడు ఆవిడ నిర్లిప్తంగా కాఫీ గ్లాసు నాముందు పెట్టారు . గొంతు నొప్పి అంటే మా తాతయ్య ధనియాల కషాయం కాచేవాడు,దానికంటే ఘోరం గా వున్ది. రాగి కాగుకాఫీ రెండునెలలు తాగే సరికి కళ్ళు మంటలు,నిద్ర పట్టక పోవడం, వాళ్ళంతా ఆవిర్లు వచ్చి ,ఏమవుతుందో తెలియని స్థితి. "పెళ్ళవగానే అలా పీక్కుపోయావేమే!అన్నారు చెలులు . అపాప మంతా కాఫీదే !అన్నాను. కాఫీ నానోటికి ,వంటికి అలవాటయ్యే సరికి రెండేళ్ళు పట్టింది .
"వడ్డన అయింది, భోజనానికి రండి నాన్నగారు అంటే ,"ఒక్కసిప్ కాఫీ ఇయ్యమ్మా!రెండులైన్లు రాసి వస్తా" అనేవారు నాన్నగారు. ఫ్రిజ్ లు లేనప్పుడు రాత్రిళ్ళు పాలు నిలవ ఉంచడానికి మా అమ్మ చాలా అవస్థ పడేది. పెద్ద పాత్రలో నీళ్ళుపోసి
అందులో పాల గిన్నె పెట్టి మూత పెట్టేది అమ్మ. మా నాన్నగారు అర్ధరాత్రి లేచి మా అమ్మని నిద్రలో లేపి కాఫీ పెట్టమని కాయించుకొని తాగి వ్రాసుకొనెవారు. ఒక్కోసారి పాలు విరిగి పొయెవి. నాన్నకివిసుగు. అమ్మకి భయం . హార్లిక్స్ తాగి సర్డుకొనే వారు. నాన్నగారు పోయాక కాఫీఅంటే మనసు విరిగిపొయిన్ది. కాఫీ కప్పులో మా నాన్న ముఖం కనిపించెది. ఆక్షణం నుంచి కాఫీ మానెసాను. ఇది నా కాఫీ కద .

1 comment:
sweet & sad!!
Post a Comment