వేప చిగుళ్ళ వంటి అనుభవాలు జీర్ణించుకొని ఉగాది సందేశం
వల్లమాలిన ప్రేమతో తియ్యగామాట్లాడు,
వగరు మామిడి ఆరగించినా ,వినయంగా
విలక్షణంగా ,వినోదంగా ప్రవర్తించు
కొత్త చింత పండు పులుపు తిన్నా
కోపాన్ని, కక్షని కంఠం దాటి రానీకు
కొత్త బెల్లం తీపినంతా లోభానికి అడ్డుకట్టు
అన్దమైనఅరటిపండు మెత్తదనం మదికియ్యి
షడ్రుచుల సమాహారమే సహజీవన సౌభాగ్యం
ఎక్కువ తక్కువ లొద్దు ,గడి తప్పక చరించు
దీన,హీన పతితులకై సాయం చేయాలనుకో
నీదీ నాదీ కాదు మనది అని వప్పుకో
కన్నులేక,కాలు లేక ,అవివున్నా తోడులేక
తిండిలేక,బట్టలేక తల్లడిల్లే జీవులెన్నో
మాటసాయం,మనిషి సాయం నీడ సాయం
చాలువారికి, నీకున్నవి కొంచెం పంచు
తలుచుకొంటే కాదు కష్టం, చేయిజాస్తే పోవు దుఖం
సేవలోనే దోవవుంది, దోవలోనే దివ్యత్వమున్ది
కొత్తరోజుకు రంగులద్ది ,చిత్త వృత్తిని సానపట్టి
మత్తువదిలి మున్దుకుఅదుగువెయ్యి కొత్తలోకం తలుపుతెరు
No comments:
Post a Comment