కత్తి పోయి ముళ్ళు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్ - వాట్స్ ఆప్
ముసలి తలి తండ్రులు ఇండియాలో పడి వుంటే ,పిల్లలు ఏడూ సంద్రాల అవతల విదేశాల్లో వుంటే వాళ్ళ దగ్గరనుంచి ఒకమాట వినిపిస్తే, ఒకసారి వాళ్ళు స్కైప్ లోనో ,పేస్ టైం లోనో కనిపిస్తే కడుపు నిండిపోతుంది . మాపెద్దకోడలు దగ్గరనుంచి కబుర్లు వినడం ఆలస్యమయితే ఏమిటి సంగతి అని అడిగాను .. వాట్స్ ఆప్ లో కబుర్లు తెలుస్తున్నాయి,అందరం మాట్లాడు కొంటున్నాము,అన్నది . వాట్స్ ఆప్ అదేమిటి అన్నాను . అయ్యో !మీరు అందులో లేరా!ఎవర్నన్నా అడిగి మీ అబ్బాయి గ్రూపులో చేరండి.అన్నది. అప్పటినుంచి వాట్స్ ఆప్ గురించితెలిసిన మహానుభావుడు ఎవరన్నా దొరుకుతాడే మో అని వెతికాను .చాలా మందికి అదేమిటో తెలియదన్నారు.
చివరికి శశి హైదరాబాదు వచ్చినపుడు "నే సెట్ చేస్తాదొడ్డా !అని పెట్టాడు .వాయిస్ మెయిల్ వుంది, ఫోటో పంపించవచ్చు, టైపు చేసి సమాచారం వెంటనే పంపవచ్చు . కళ్ళు మూసి తెరిచేలోపుల అయిపొతున్ది. ఇవన్నీ ఎలా చెయ్యాలో శశి చెప్పాడు . వెనక కెనడా వెళ్ళినపుడు లాప్ టాప్ ఇమైలు గురించి తెలుసుకొంటేనే ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి . తరవాత పేస్ బుక్ ఇందులోనూ సౌకర్యం ఎక్కువే! బ్రహ్మాండంలో ఎక్కడున్నా మన స్నేహితుల్ని,బంధువుల్ని కనుక్కొవచ్చు. కబుర్లు కలబోసుకోవచ్చు .ఫొటొ లు పెట్టొచ్చు , మనకిష్ట మైన సంగతులు అందరితో పంచుకొవచ్చు. అందరికి హితవు బోధించవచ్చు, మన ప్రతాపం ప్రకటించుకోవచ్చు, చిటికలో మన కబురు సముద్రాలు దాటి వెళ్ళిపోతుంది .ఇన్దులొ మనకిష్ట మైన వాళ్ళుమాత్రం మనకబుర్లు చదువుకొనేలా కట్టుదిట్టం చేసుకోవచ్చు . పేస్ బుక్ ఎంత బాగుందో అనుకొన్నాం ,ఇప్పుడు వాట్స్ ఆప్ మరీ విచిత్రం .
మా మనుమరాలు 12 క్లాస్స్ చదివి పై చదువుకి అమెరికా వెళ్ళింది . మొదటి సారి అమ్మ,నాన్న దింపి వచ్చారు. రెండు నెలల్లో సెలవులు వచ్చాయి,వచ్చేటప్పుడు స్నేహితురాలు ,తను కలిసి వచ్చారు. ఆఅమ్మాయి ముందు వెళ్ళిపోయింది .తరవాత మా మనుమరాలు ఒక్కత్తే వెళ్ళింది . వాళ్ళ అమ్మ,నాన్న ధైర్యంగానే వున్నారుకానీ నాకు నిద్ర పట్టలేదు . ఒకటే ఆరాటం . పిల్ల ఎలావెళ్లి చేరుతుందా?అని. చికాగో లో మా పెద్దబ్బాయి,కోడలు రిసీవ్ చేసుకొని అది దిగగానే వాట్స్ ఆప్ లో కులాసాగా చేరిందని వార్తా,ఫోటో పెట్టేసారు . . హోటల్ లో ఇడ్లీ తింటుకూడా ఫోటో పెట్టేసారు అది చూస్తె ఎంత రిలీఫ్ వచ్చిందో!
ధనుర్మాసంలో వాకిట్లోవంగి ముగ్గువేయ్యలేక మానలేక ట్రాలీ ఒకటి వుంటే దానిమీద ముగ్గు వేసి , ఒక పువ్వుపెట్టి ,పసుపు కుంకుమ పెట్టి కృష్ణుని విగ్రహం ముందు పెట్టీదాన్ని ఽది మా వాళ్లకు చూపించాలనిరోజు వాట్స్ ఆప్ లో పెట్టేదాన్ని . త్రీ జి ఫోన్ వుంటే అందులో కేమారాతో ఫోటో తీసి వాట్స్ ఆప్ లో పెట్టవచ్చు సుప్రభాతం చెపుతూ రోజు పంపెదాన్ని . అప్పుడు ఎంతో తృప్తి .
ఇక కొత్తబొమ్మ వేస్తె పిల్లలకి చూపించేయ్యాలని వెంటనే పమ్పెదాన్ని. వాళ్ళు ఆహా,ఓహో అంటే సంతోషం .ఇలా వాట్స్ ఆప్ ఇప్పుడు ఏంతో అలవాటయి పోయింది.పగలు,రాత్రి అది కుయ్ కుయ్ అంటునేవుంటుంది . కళ్ళు మూతలు పడిపోతున్నా అది కుయ్ అనగానే చూడాల్సిందే! తియ్యకపోతే అందులో ఏమి సందేశం వుందో? ఆశ్చర్యమో! అర్జేంటో అని తీస్తూనే ఉంటాము . ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా వుంటుందో! సైన్సు ఎంత అభి వృద్ది చెందింది ? ఒకదాని తరవాత ఒకటి కొత్తది ఆవిర్భవిస్తున్నాయి. పూర్వం దివ్య దృష్టి ,దూర దృష్టి అనేవాళ్ళే దానికి నవీనీకరణ ఏమో అనిపిస్తుంది .
ఇంకొక విషయం ఏమిటంటే ఎంత మితభాషులయినా ,మౌన స్వాములయినా అందరినీ ఈ వాట్స్ ఆప్ ముగ్గులోకి తెస్తుంది .కుటుంబం లో సభ్యు లందరూ ఏవో మాట్లాడుతుంటే మౌన స్వాములకి కూడా ఏదో చెప్పాలని పిస్తున్ది. జోకులు చెప్తారు, విశేషాలు చెప్తారు, అనుభవాలు చెపుతారు, వేళాకోళాలు చేసుకొంటారు ,విమర్శలు గుప్పుతారు,సుదీర్ఘ మైన చర్చలు చెస్తారు. నాబోటి వాళ్లకి పుట్టినరోజు తేదీలు ఎవరివి గుర్తు వుండవు ంఆ గ్రూపులో ఎవరో ఒకరుగుర్తు పెట్టుకొని విష్ చేస్తారు ఇక శుభా కాంక్షల వర్షం కురుస్తుంది .
ఇవాళ మా వారి పుట్టిన రోజు . ఆయన గతించి 12 సంవత్సరాలయినా అందరి మనస్సుల్లో కదులుతూనే వుంటారు . 4ఘంటలకే మెలకువ వచ్చిన్ది. ఏవో తలచుకొంటూ కూర్చున్నాను .
ఇంకేముంది వాట్స్ ఆప్ లోకి మావారు వచ్చెసారు. మనవళ్ళు,మనుమరాళ్ళతో సహా ఆయన కబుర్లు చెప్పారు. ఆరోజులు
సినిమా రీళ్ళల్లా కళ్ళముందు తిరిగాయి. వర్కింగ్ డే కనుక ఆగారు లేకపోతె ఇంకా ఎన్ని సంగతులు చెప్పేవారో! రాత్రికి మళ్ళీ కొనసాగించవచ్చు. అందరమ్ కలిసి ఇలా మాట్లాడుకొంటే మనస్సుకు శాంతి
కలిగిన్ది. వాట్స్ ఆప్ కి ధన్యవాదాలు . భగవంతుడు కల్పించే సౌకర్యాలకి ఆయన్ని అభినందించి సక్రమం గా వాడుకొంటే ఏంటో సంతోషాన్ని కలిగిస్తాయి. మానవుడిలో వుండే అతి తెలివి, కోతి బుద్ది వీటిని వంకర దారుల్లో నడపకుండా వుంటే లాభాన్వితులం కావచ్చు.

3 comments:
thanks for sharing
thanks for sharing
చదువుతుంటే చాలా సంతోసంగా అనిపించింది.
సాంకేతికపరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో సౌకర్యం అందరికీ. అక్కడక్కడా ఎవరైనా దుర్వినియోగం చేస్తే ఎంతోమందికి చికాకు.
నేను ఏదో టెకీనే ఐనా ఈ వాట్సప్ దాకా ఇంకా రాలేదు!
ఐనా నా కెవ్వరున్నారని అంతగా నా కోసం అంతగా ఆరాటపడే వాళ్ళు! అందుకేనేమీ అటువంటివాటి గురించి చదవి సంతోషించటమే సరిపోతోంది కాని నాకు అవసరపడటం లేదు స్వానుభవంలోకి రావటం జరగటం లేదందుకే.
Post a Comment