Pages

Thursday, May 15, 2014

వాకిట్లో వసంతం

మా వాకిట్లో చెట్టు 15 రోజుల ముందు   ఒట్టి   మోడు  పోయిన వారం   ఇలా  మొగ్గ తొడిగింది
ఇప్పుడు ఇలా   
కొమ్మ కొమ్మనా        పూలు రేకలు విచ్చి 
కన్నెపిల్ల  మొఖం లా   కళకళ      లాడుతున్నాయి 
  లేత పసుపు     వర్ణం పూలు  రేకల  అంచున                
రాగి రంగు        వర్ణపు పూతలు                                      
పూల బొడ్డులో   ఆవ గింజంత  ఆకుపచ్చని కాయలు  
అవి ఇప్పుడు అదే రంగుతో  కందిగింజ అంత  పెరిగాయి 
ఒక్కొక్క కొమ్మ ఎంత అందంగా  వుందో 
చుక్కలన్నీ  వరసగా కూర్చున్నట్లు 
అందాల నర్తకి   పొడుగు చేతుల 
జుబ్బా  వేసుకొని    చేయి జాస్తే     వాటిపై  కుట్టిన 
వెండి బిళ్ళల్లా మెరుస్తున్నట్లున్నాయి 

పెళ్ళికి వెళ్ళే   పెరంటాళ్ళ లా వున్నాయి 
సెలయేటి జాలులా వున్నాయి 
బొండు మల్లె దండ లా  వున్నాయి  
మబ్బు పింజల్లా వున్నాయి 
మధుర భావాల్లా వున్నాయి 
కిటికీ  దగ్గర నిలబడి  ఆదృశ్యం చూస్తుంటే 
కాళ్ళు కదల నంటు న్నాయి 
ప్రభూ! పొద్దు పొడిచే సరికి 
ప్రకృతిలో ఎన్ని అందాలు పరుస్తావు?
ఎన్ని రూపాలు,ఎన్ని వర్ణాలు, ఎంత పరిమళం!
నిన్ను మించిన చిత్ర కారుడివి  నువ్వే!
                   

1 comment:

సుజాత వేల్పూరి said...

అవును, వసంతం అందాల్ని ఈ దేశంలోనే మనసులో మూట కట్టుకోవాలి. మోడు వారిన చెట్టు నిండా సన్నని పూలతో నిండి పోవడమూ, ఆ పైన ఆకులతో పచ్చ దనాన్ని సంతరించుకోవడమూ, పూలూ పుప్పొడీ, గాలిలో ప్రయాణిస్తూ.. ఎంతో రసికుడు దేవుడని పదే పదే మురిసిపోయేలా చేస్తుంది

మరి వసంతం అందాల్ని మీరేమైనా చిత్రించారా?