Pages

Thursday, July 24, 2014

మొక్కలు-నేను

ఈమాటు   చికాగో    వచ్చేసరికి    జూన్     లో   రెండు వారాలు   దాటి పొయాయి.  విత్తనాలు వేసి  మొక్కలు పెంచే  టైం  దాటి పోయింది,  నే  వచ్చే సరికి   వాకిట్లో   సీజనల్   ఫ్లవేర్స్   పూసి  తలలూపి    స్వాగతం   పలికాయి. హాలులో    పుస్తకాలు,   వాకిట్లో    పూ ల   మొక్కలు లేకపోతె   ఇంటికి   నిండుతనం రాదు. లాన్  మూవ్   చేసేవాడు తెచ్చి వేసాడట ,మా కోడలు చెప్పింది . ఒకసారి  ఇంటి చుట్టూ   తిరిగి వచ్చాను ,బాక్ యార్డ్ లో గులాబీ చెట్టు పూసింది    కొన్ని కొమ్మలు ఎండి పోయి   వాటి  అందాన్ని  కప్పెసాయి.  పాపిన్స్ రెండు మొక్కలు పొడుగ్గా ఎదిగి మొగ్గ వెసాయి.  ఇవి కిందటి  సారివే   వాటంతట అవి పెరిగాయి. ఇంకోటి    మొగలి పొదలా  వుంటుంది ,దాని పక్క పక్క రెండు గుబుల్లు   వచ్చాయి. పూలు పూచే కాడ సన్నగా   పైకి వస్తోంది ఆమూల    ఒక తెల్ల మందారం  వుంది . దానికి పూత   అయిపోయి   ,కాడలు  ఎండి   వున్నాయి.
                                                  నాలుగు రోజులు  రెస్ట్    తీసుకొన్నాక   మొక్కల   దగ్గరికి వెళ్లి   కొన్ని ఎండు కొమ్మలు కత్తిరించి   కొన్నిటికి   పాదులు  తీసాను.   మర్నాడంతా    నడుము   నొప్పి పెట్టింది . ఓహో!  మనకి  ఇదివరకటి   శక్తి   తగ్గిందన్న మాట  అనుకొన్నా!  మా   చిన్న వాడితో   ఇదే మాట   చెపుతే " రోజూ చిన్నగా  కాస్త చెయ్యమ్మా!"అన్నాడు .  నాకు మాత్రం   కొత్త మొక్కలు పెట్టె    ధైర్యం  పోయింది .  ఇంట్లో కుండీలలో ఒక   వాము మొక్క,కనకాంబరం, తులసి ,  రాత్రిళ్ళు   తల వాల్చే   మొక్క,పొడుగాటి   ఆకుపచ్చని ఆకుతో వుంటుంది, అవి వున్నాయి.   వాటినే  ఒక పక్క పెట్టి  తవ్వి   నీళ్ళు పొసాను.   తరవాత  నాలుగు మిరప మొక్కలు,నాలుగు వంగ మొక్కలు  తెచ్చాను.   వంగ పైకి రాలేదు   ,మిరప్ మిగిలింది . పెంపుడు జంతువుల్ని,మొక్కల్ని   పెంచాక  వాటి పోషణ   సరిగా  చెయ్యకపోతే నేరమే!  ఇంటికి వచ్చిన అతిథికి   అన్నం నీళ్ళు  చూడకపోతే   ఎంతో   ఇదీ   అంతే !
                                      ఆమోక్కల్ని రోజు చూసుకొంటుంటే   మేము   వారం రోజులు     వూరు   వెళ్ళాల్సి  వచ్చింది  మాకోడలు   స్నేహితురాల్ని   అడిగింది,4రోజుల కొకసారి   మా  మొక్కలకి  కాసిని నీళ్ళు పోస్తారా?అని వాళ్ళు సరే అన్నారు  ఇక్కడ  బాక్ యార్డ్ లు   ఓపెన్  గా వుంటాయి గనక   వాళ్ళు వచ్చి నీళ్ళు  పొసారు. థాంక్స్ .  మిర్చిఅవి బతికాయి. వాకిట్లో    పూల మొక్కలకి   4 రోజుల కొకసారి   నీళ్ళు పొస్తున్నా. మర్నాటికి అవి పెద్దగా  విచ్చి ఎంత బాగుంటాయో!  బాక్ యార్డ్లో మందారం దాకా   నీళ్ళ ట్యూబ్ లాగ లేక    "పూలు పూయడం లేదుగా" అని మొన్న నీళ్ళు పోయ్యలా!  ఇవాళ    లేచి బాక్ యార్డ్ లోకి  తొంగి చూస్తె     మందార  చెట్టు మీద తెల్లగా  కనిపించింది ,కాగితం ఏదన్నా  ఎగిరిందేమో  అనుకొన్నా,నిన్న ఈదురు గాలి వచ్చింది  లెండి .దగ్గర కెళ్లి  చూస్తె  మందారం పూసింది   నామాట   విన్నట్లుంది     "పూలు పూస్తూనే వున్నా!"అన్నట్లు పూసింది   గబా గబా   నీళ్ళ ట్యూబ్  లాక్కెళ్ళి   బోదె అంతా    నిమ్పాను. అలా  అనుకొన్నందుకు    ఏమీ   అనుకోకు    అని బతిమాలా! ఎప్పుడు పువ్వులు     పూస్తే కోసి దేముడుకి పెట్టె దాన్ని ఇవాళ    దాన్ని   కొయ్యలెదు.   మొక్కలు వింటాయి,అంటారు ఇదేనేమో   అనిపించిన్ది.    పై బొమ్మల్లో  చూసారా  ఒక మొక్క చివర్లు   తెల్ల తెల్లగా   వున్నాయి  దూరం నుంచి చూస్తె  కొమ్మ చివరన   తెల్ల పూలు  పూసినట్లుగా   కనిపిస్తాయి.  .  ఈమాటు   మొక్కలు పెంచక పొతే     నారాక   నిరర్ధకం   అయినట్లుగా   అనిపిస్తోంది ,  చిగుళ్ళు,మొగ్గలు,పూలు,కాయలు ,వాటి పెరుగుదల   చూస్తుంటే     ప్రక్రుతి లోని నిశ్శబ్ద  చైతన్యం   మనకి   పాఠాలు    చెపుతుంది . ఉష; కాంతులలో  చిరుగాలి  పలకరింపులతో     మొక్కల మధ్య    ,తిరుగుతుంటే   ఆహాయే  వేరు అదే    ఆరోగ్యం,అదే ఐశ్వర్యం
మొక్కలు-నేను 

No comments: