ఘోరకలి
గుండెలు దడదడ లాడాయి
కాళ్ళు గజగజలాడాయి
కళ్ళు జలపాతాలయాయి
అక్షరాలు అలుక్కుపోయాయి
ఘోరమైన వార్త భరించ లేని దృశ్యం
గరళం మింగ వచ్చుకానీ
గర్భశోకం మహా బాధ
స్కూలు కెళ్ళ డ మేమిటి ,
పసికూనలు ,పసరు మొగ్గలు
అసువులు బాయడ మేమిటి?
అమ్మా నాన్నల మనస్సులో
ఆరని చిచ్చు రగిలింది
ఆ ఆలు నేర్చుకొని
ఇం త వాళ్ళు అంతై
కంటికి పండగ చేస్తారనుకొంటే
కంట బావులు తవ్వారు?
స్టీరింగ్ చేతికి రాగానే
శ్రీ మహావిష్ణువు ని
అనుకొనే వాహన చోదకులు
బస్సు నడుపుతూ
నాలుగు పక్కలా చూడని
నరహంతకులు
గేట్లు లేని రైల్వే క్రాసింగులు
అక్కడ చిన్న ఉద్యోగి కూడా లేని
స్వతంత్ర భారతం
రైలు హటాత్తుగా తగుల్కొని
బస్సుని బరబరా
లాక్కుపోతుంటే
ఆ చిన్నిప్రాణాలు
ఎలా ఆవటించిపోయాయో ?
అమ్మా,నాన్నా, అయ్యో, బాబోయ్
అని గోల పెట్టి వుంటారు
రైలు పట్టాల మాటలో
కేకలన్నీ గాలిలో కలిసివుంటాయి
ఇక ఏ తల్లయినా బిడ్డని
బడికి పంపగలదా ?
బతికుంటే చాలు
బలుసాకు తినొచ్చని
కొంగు చాటున
దాచుకొంటుంది
బిడ్డల్ని పోగొట్టుకొన్న
తలితండ్రులారా
మీకేమి చెప్పగలం?
ఎలా ఒదార్చ గలం
కష్టాలను మార్చేది
కన్నీళ్లను ఆపేది
కాల పురుషుడే!
అందుకే ఆయనకే
విన్నవిస్తున్నాం
మీ గుండె పగల కుండా
బతుకు ఒరగకుండా
కూసింత ధైర్యం ఇమ్మని
రవంత శక్తినిమ్మని
ఘోరకలి
గుండెలు దడదడ లాడాయి
కాళ్ళు గజగజలాడాయి
కళ్ళు జలపాతాలయాయి
అక్షరాలు అలుక్కుపోయాయి
ఘోరమైన వార్త భరించ లేని దృశ్యం
గరళం మింగ వచ్చుకానీ
గర్భశోకం మహా బాధ
స్కూలు కెళ్ళ డ మేమిటి ,
పసికూనలు ,పసరు మొగ్గలు
అసువులు బాయడ మేమిటి?
అమ్మా నాన్నల మనస్సులో
ఆరని చిచ్చు రగిలింది
ఆ ఆలు నేర్చుకొని
ఇం త వాళ్ళు అంతై
కంటికి పండగ చేస్తారనుకొంటే
కంట బావులు తవ్వారు?
స్టీరింగ్ చేతికి రాగానే
శ్రీ మహావిష్ణువు ని
అనుకొనే వాహన చోదకులు
బస్సు నడుపుతూ
నాలుగు పక్కలా చూడని
నరహంతకులు
గేట్లు లేని రైల్వే క్రాసింగులు
అక్కడ చిన్న ఉద్యోగి కూడా లేని
స్వతంత్ర భారతం
రైలు హటాత్తుగా తగుల్కొని
బస్సుని బరబరా
లాక్కుపోతుంటే
ఆ చిన్నిప్రాణాలు
ఎలా ఆవటించిపోయాయో ?
అమ్మా,నాన్నా, అయ్యో, బాబోయ్
అని గోల పెట్టి వుంటారు
రైలు పట్టాల మాటలో
కేకలన్నీ గాలిలో కలిసివుంటాయి
ఇక ఏ తల్లయినా బిడ్డని
బడికి పంపగలదా ?
బతికుంటే చాలు
బలుసాకు తినొచ్చని
కొంగు చాటున
దాచుకొంటుంది
బిడ్డల్ని పోగొట్టుకొన్న
తలితండ్రులారా
మీకేమి చెప్పగలం?
ఎలా ఒదార్చ గలం
కష్టాలను మార్చేది
కన్నీళ్లను ఆపేది
కాల పురుషుడే!
అందుకే ఆయనకే
విన్నవిస్తున్నాం
మీ గుండె పగల కుండా
బతుకు ఒరగకుండా
కూసింత ధైర్యం ఇమ్మని
రవంత శక్తినిమ్మని
ఘోరకలి
1 comment:
కళ్లు చమర్చాయండీ.భగవంతుడు ఆ తల్లిదండ్రుల కు బ్రతికే ధైర్యాన్ని ఇస్తాడు తప్పకుండా .
Post a Comment