మొన్న మా బంధువులింటికి వెళ్లి వస్తు వాకిట్లో అటు ఇటు చూస్తె ఒక చెట్టుకి స్ట్రా బెర్రీస్ లాంటి ఎర్రటి కాయలు గుత్తులు గుత్తులు గా కనిపించాయి ఇవేమికాయలు అని అడిగా అప్పుడు వాళ్ళు చెప్పారు ఇవి సింధూరం కాయలండీ అని. సింధూరం చూసాగానీ సింధూరం చెట్టు కాయలు ఇంతవరకు చూడలేదు . హనుమంతుడి విగ్రహం ఎప్పుడు సింధూరము తో నిండి వుంటుంది . అది ఎలా తయారవుతుంది? అనే ప్రశ్నే ఈ మట్టి బుర్రకి రాలేదు . ఈసిందూరం కాయలో వుండే గింజల తోనె సింధూరం వస్తుంది అన్నారు. అలాగా !మీకీ చెట్టెక్కడ దొరికింది ? అంటే
ఒక సారి ఫ్రెండ్స్ తో కలిసి ఫార్మ్ హౌస్ కి వెళ్ళాము వనభోజనానికి అక్కడ చూసాను వాళ్ళని బతిమాలి రెండు మొక్కలు తెచ్చాం ,ఒకటి పోయింది,ఇది బతికింది . అన్నారు పైన రాగి పళ్ళెంలో ఉన్నదే సింధూరం కాయ . నాకొకటి ఇచ్చారు. అపురూపంగా తెచ్చుకొన్నా. దీనిలోంచి సింధూరం ఎలా వస్తుంది ? అని అడిగాను ఇదిగో కాయలో ఇలా ఎర్రటి గిన్జలుంటాయిఅవి వేళ్ళతో చిదిపితే సింధూరం రంగు వస్తున్ది. ఇదీ అసలైన సిందూరం .

చెట్టుకి తెల్లటి పూలు పూస్తాయి . కిన్జిల్కాలు గుత్తులు వున్తాయిఅవె తరువాత కాయలు కాస్తాయి .చెట్టునే కాయ విచ్చుకొంటుంది .ఎంత జాగ్రత్తగా విచ్చు కొంటుందంటే సగం డిప్ప మూ త తెరిచినట్లు పైకి లేస్తుంది కానీ ఒక్క గింజ కూడా కిందపడదు . గింజలన్నీ ఒక పాత్రలో చేర్చి కాస్త నీళ్ళు చిలకరించి కలుపుతే సింధూరం తయార్ . ఈ చెట్టుని ఆంగ్లంలో "లిప్స్టిక్ ట్రీ " అంటారుట. దీనితో ఒంటిమీద రంగులు వేసుకొంటారుట ,వంటకాలలో వాడ తారట. బట్టలకి రంగులు వేస్తారట .యురొప్ ,నార్త్ అమెరికాలలో దీన్ని బాగా వాడతారట బట్టర్ ,చీజ్ ,మైక్రోవేవ్ పాప్కార్న్ ,సాఫ్ట్ ద్రింక్ల లో వాడతారట . పకృతి మాత ఖజానాలో ఎన్ని వున్నాయో!చెట్లు కొట్టివేసి ,నదీప్రవాహాల్ని ఆపేసి, అడవుల్ని అంతం చేసి వెర్రి మానవుడు ముందు కేడుతున్నానని మురుస్తున్నాడు .
No comments:
Post a Comment