Pages

Wednesday, October 22, 2014

ఆధారం

            ఆధారం
    నాలుగున్నర అవగానే శీను   టపాకాయలన్నీ   అరుగుమీద  పేర్చడం ప్రారంభించాడు.
   ఇప్పుడే ఎందుకురా అవన్నీ  పరుస్తున్నావు? అంది  లక్ష్మి
   "అమ్మా!"  అన్నీ   విడి విడిగా  పెట్టుకొంటున్నానే!  తీసుకొడం తేలిక,ఎన్ని కాల్చానో  ఎన్ని వున్నా యో తెలుస్తుంది.అన్నాడు శీను
   లక్ష్మి దీపాలు వెలిగించడానికి   కొత్త ప్రమిదలు తెప్పించి  నిన్ననే   నీళ్ళలొ నానబెట్టింది.అలా చేస్తే నూనె ఆట్టే పీల్చవని ,అవి నీళ్ళల్లోంచి తీసి బొర్లించి పెట్టింది. వాటిని తెచ్చి   వత్తులు వేసి  దీపాలు వెలిగించి బెల్లం ముక్క  నివేదన  చేసి  అన్నిటిని పళ్ళెంలొ పెట్టుకొని తెచ్చి  వాకిట్లో  ప్రహరీ గోడ మీద వరుసగా పేర్చింది. దిగివచ్చిన తారల్లా అవి మిణుకుమిణుకు మంటూ వెలుగుతున్నాయి.  శీను ఇంకా   టపాకాయల చుట్టూ తిరిగి మురుసుకొంటున్నాడు.
  తల్లిని చూసి"అమ్మా! విష్ణు  చక్రం కాల్చనా?
  విష్ణు చక్రం  ఏమిటిరా!పాపాయివా?  ఢాం ఢాం అని సీమ టపాకాయలు కాల్చు.
  ముందు ఇది కాల్చాక అవి
  కాదు ముందు అవేకాల్చు
  శీను భయ పడుతు భయ పడుతు  సీమ టపాకాయలు పది జడలా  అల్లినవి  తీసి రోడ్డుమీద పెట్టి కాకర పువ్వుతో వెలిగించడానికి ప్రయత్నం చేసాడు. అవి అంటుకోలా  మరో కాకర పువ్వొత్తి అయింది. మూడోది పట్టుకెళ్ళి  వెలిగించబోతుంటె  "వాటిని తిప్పి పెట్టాలి "అని వినిపించింది .తల్లీ  కొడుకు అటువేపు చూసారు ,ఒకకుర్రవాడు రొడ్డుకు అటువేపు నిలబడి వున్నాడు.సన్నగా పొడుగ్గావున్నాడు,మాసిపోయిన చొక్కావేసుకొన్నాడు. కళ్ళు మాత్రం  మెరుస్తున్నాయి.కొంచెం ముందుకు వచ్చి వాటిని సరిచేసి శీను చేతిలో కాకర  పువ్వొత్తి తీసుకొని  వెలిగించాడు. ఢాం ఢాం అని పేలాయి. ఆ కుర్రవాడి  పెదాలపై  నవ్వు కనిపించింది.
      శీను తండ్రి వేణు బయటికి వచ్చాడు.
   నాన్నా!  ఆటం బొంబ్ కాలుద్దామా? అన్నాడు శీను.
   ఒకటి తెచ్చి ఇసకలో గుచ్చారు ,అది వెలిగించేలొపలే  కింద పడింది.
మళ్ళీ ఆ కుర్రాడు "ఖాళీ సీసా వుంటె తెండి "అన్నాడు
లక్ష్మి లొపలికి వెళ్ళి పొడుగాటి సీసా తెచ్చింది.
కుర్రాడు సీసాలొ కాస్త ఇసుక నింపి ఆటం బొంబ్ పెట్టి తనే వెలిగించాడు ,అది రయ్ మని దూసుకెల్లి  పేలింది.
ఈ లోపల శీను రెండు విష్ణు చక్రాలు  తిప్పాడు.
వెరె ఏదో పెట్టె వూడదియ్యబొయాడు శీను అది రాలా.  కుర్రాడు గబగబా విప్పి అందులోంచి పిచ్చికలు బయటికి తీసాడు. శీను చేతికి ఇస్తే  వేణు నువ్వె వెలిగించవోయ్ !అన్నాడు.
   ఆకుర్రవాడు వెలిగించి ఆకాశంలొకి వదిలాడు. అంతా చూస్తూ నుంచున్నారు.
   నీపేరేమిటి బాబూ! అంది లక్ష్మి
    బెరుకుగా "అశొక్ "అన్నాడు.
    ఎక్కడుంటావ్? అన్నాడుశీను
    జవాబు చెప్పలేదు.రెండడుగులు వెనక్కి వేసాడు.
    అమ్మా,నాన్నా  ఎమిచెస్తారు? అన్నాడు వేణు
    లేరు
    అయితె  ఎక్కడికి వెళతావు?
   తెలియదు
   అసలెవూరో చెప్పు
   వైజాగ్
   ఇక్కడికి ఎందుకు వచ్చావు?
   తుఫాను వస్తోందని అమ్మ,నాన్న తమ్ముడు, చెల్లాయి ,నేను ప్ద్దొరింటికి  వెళ్ళాము.
   మా చెల్లి  ఆకలని ఏడ్చింది. మా  నాన్న కి కన్ను మసకేసింది, రొట్తె తెద్దామని వెళ్ళాను. ఇంతలో గాలి,వాన పెరిగాయి, అక్కడున్నవాళ్ళు కారెక్కి వెళ్ళిపోతున్నారు, నేను వాళ్లకి తెలియకుండా  డిక్కిలొ దూరా. ఈవూరొచ్చి పది రొజులయింది.
  మరి తిండి?అందిలక్ష్మి
  అయిదురొజులు ఒకళ్ళు పెట్టారు,ఇంకలేదు పొమ్మన్నారు.
  "పద అన్నం తిందువుగాని "అంది లక్ష్మి
   అమ్మ గుర్తుకొస్తొంది ,చచ్చిపొయిందెమో!భయంగావుంది.
   కనుక్కొందాములె!నువ్వు లొపలికిరా!అనికుర్రవాణ్ణి లొపలికి తీసుకు వెళ్ళారు.
   శీను బట్టలిచ్చి తొడుక్కోమని ,అన్నం పెట్టారు.
   శీను రేపటినుంచి నీవన్నీ   అశొక్ తో  పంచుకోవాలి !అన్నాడు వేణు. అశోక్  కి ఆధారం  దొరికింది.
   శీను గదిలొ  ఆవేళ మరొ మంచం వచ్చింది.
    

No comments: