శ్రీమతి&శ్రీ ఎస్.ఎస్. ప్రసాద్ విద్యా సాంస్కృతి క సంస్థ
ఒక ఆశయం మనిషి జీవితంలో వెలుగును తెస్తుంది.కళారాధనకు కాసులు గ్రుమ్మరించ నక్కరలేదు,కాసులు ప్రోగుచేయనక్కర లేదు. సహృదయుల్ని నలుగుర్ని ఆహ్వానించి సంతోషంగా ,సరదాగా కళామ తల్లికి సేవ చేయవచ్చు. కళాకారుల్ని గుర్తించి ప్రోత్స హిస్తే చాలు వారికి ఎనలేని బలం వస్తుంది.ఇటువంటి ఆశయం తోనే శింగరాజు ప్రసాదు,వారి శ్రీమతి విజయలక్ష్మి కలిసి పది సంవత్సరాల క్రితం శ్రీమతి&; శ్రీఎస్ .ఎస్. ప్రసాద్ విద్యా సాంస్కృతిక సంస్థ ని ప్రారంభించారు. వీరి కుడి భుజమై నిలబడిన శ్రీ భాగవతుల లక్ష్మణాచార్యులు, శ్రీ జమ్మల మడుగు శ్రీప్రభాకర రావుశ్రీ మహేష్ అగర్వాల్ గారలు అవిరళ కృషి సలుపుతున్నారు.
ఆనాటి నుంచి నిరాడంబరులై కళాకారులకి,విద్యార్ధులకి, సహాయమందిస్తు ,సాహిత్య రంగం లో,ఆధ్యాత్మిక క్షేత్రంలో పేరెన్నిక గన్న వారిని సత్కరిస్తున్నారు.శిధిలమైన ఆలయాల జీర్ణోధ్ధరణ చెయాలని వీరి ఆశయం. ఎక్కడ ఏప్రతిభ వికqసించినా ప్రొత్సహించాలని వీరు ఉత్సాహ పడతారు.
మొన్న తొమ్మిదవ తేదీ ఎస్ .ఎస్. ప్రసాద్ గారి ఇంట్లో కొద్దిమంది ప్రముఖులతో ఈ సంస్థ పదవ వార్షికోత్సవం జరిగింది. స్రీ భాగవతుల లక్ష్మణాచార్యులు గారు అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా శ్రీ. బి.ఎన్.ఎస్ కుమార్ గారు సతీమణితో విచ్చేసారు. ఎస్.ఎస్. ప్రసాద్ వారి మేనమామ గారయిన రావూరు గోష్టి ప్రారంభిస్తూ రావూ రుగారి హాస్యం,,రచనా పాటవం గురించి మాట్లాడారు. బి.ఎన్,ఎస్ కుమార్ దంపతులని సత్కరించారు. రావురుగారి హాస్యం గురించి టి కె విజయ కుమార్ ప్రసంగించారు. టి ,జ్ఞాన ప్రసూన {నేను} రావూరుగారి వడగళ్ళనుంచి హాస్య స్ఫోరక మైన చెణుకులను వినిపించి ,వడగళ్ళ హీరో అద్దేపల్లి మల్లి నాథ సూటి గారిని స్మరించి వారి హాస్యం వివరించారు.తరువాత అస్మదీయులకు నూతన వస్త్రాలతో సత్కరించి శ్రీమతి విజయలక్ష్మి "నాకు తెలిసిన జ్ఞాన ప్రసూనా నాభావన"అని ప్రేమాభిమానాలు పొంగులు వారెలా సన్మాన పత్రం రచించి చదివారు.
నగరం లోని ప్రముఖ వైద్య దంపతులు డా కె.వి రమణ,శ్రీమతి నాగమణి గార్లను సత్కరించారు. శ్రీ కె. శివ ప్రసాద్ గారు"సంవత్సరం తిరిగేలోపున రావూరు వారి మీద ఒక పుస్తకం తెస్తానని" వాహ్దానం చేసారు .ఈ సంస్థ వారు ఇరవై అయిదు సంవత్సరాలుగా సెలవులు,పండుగలతో న్యోఇయర్ సంక్రాంతి కాలెండర్ ప్రచురించి ఉచితంగా పంచి పెదుతున్నారు. ఈ సంవత్సరం కార్తీక మాస సందర్భంగా "ద్వాదశ జ్యోతిర్లింగాల "చిత్ర పాఠం అచ్చొత్తించి పంచారు అందరి చేతులలో వున్నవి అవే!
వీరు మరింత ఉత్సాహం తో ,ఉడుగరతో మానవ సేవ చేసి,మార్గ దర్శకులై ,ముందుకు సాగాలని కొరుతున్నాము.శ్రీ లక్ష్మీపతిగారు వందన సమర్పణ చేసారు. విందు భోజనం తో సభ ముగిసింది .
2 comments:
మహానుభావులు అందరికీ వందనాలు. విశేషాలు వివరించినందుకు ధన్యవాదాలు..
చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు వ్రాసారు మీరు. మేము అక్కడ ఉండి చూసిన అనుభూతి కలిగింది. శ్రీమతి & శ్రీ ఎస్. ఎస్. ప్రసాదు గార్లుకు అభినందనలు, శుభాకాంక్షలు.
శైలజ శర్మ
http://summersofindia.blogspot.in/
Post a Comment