నూతిలో చేద
ఏదో పుస్తకం తిరగేస్తుంటే బాలింతరాలు నూతిలో చేద వేసే తప్పుడు చదివే మంత్రం అని ఒకటి వ్రాసారు .
అది చూస్తే నవ్వు వచ్చింది . బాలింతరాలు అనగానే పచ్చి పసుపు రాసుకొన్న నుదురు ,తెల్లతిచీర,నడుముకు తుండుతో బి గించిన నడికట్టు, తాంబూలంతో ఎరుపెక్కిన పెదవులు ,అలిసిపోయి చేతకాని తనం తో మాటి మాటికి వ్రాలిపోయే కనురెప్పలు,చెవులో దూది,రెండు చ చెవులు కప్పుతూ నెత్తిమీద బిగించిన రుమాలు ,కాళ్ళకి పసుపు అనన్య సామాన్యమైన, వెలలేని సంపద సంతానం ఒడిలోకి తెచ్చుకొన్న గర్వం .. ఓహో ఎంత అందమైన మగువ . ?
ఇప్పుడు కాగడా వేసి వెదకినా కనపడదు . అసలు బాలింత తనం అనుభవించే అదృష్టం ,అవకాసం
ఎక్కడుంది ? ఆఫీసు వేడికి వదిలిపోతున్న జీవితాలు . సెలవులేని ఉద్యోగాలు,విశ్రాంతి లేని సంసారాలు . పురిటి స్నానానికి నీళ్ళు కూడా తామే కాచుకోవాల్సిన "ఒంటికాయ శొంటి కొమ్ము ". ఒంటరి సంసారాలు .
బాలింతరాలికి కనీసం మూడువారాల విశ్రాంతి తప్పనిసరి మూడువారాలదాకా బాలింతరాల్ని మంచం దిగానిచ్చే వారు కాదు . ఎవరేనా ఆడవారు పనీ పాటా లేకుండా మంచం మీద కూర్చుని కాల క్షేపం చేస్తుంటే " బాలింతరాలిలా ఎలా కూర్చుందో చూడు". అనేవారు
పురుడు అయి మూడు వారాలు గడిచాక నూతిలో చేద అనే కార్యక్రమం జరిపే వారు . ఆ రోజున అయిదుగురు ముత్తైదువుల్ని పేరంటానికి పిల్చెవారు. బాలేన్తరాల్ని నూతిదగ్గరకి తీసుకెళ్ళి నూతి గట్టుకి పసుపు రాయించ ,కుంకుమ తో మూడు అడ్డగీతలు పెట్టించే వారు. మట్టితో అయిదు ఉండలు చేయించి తమలపాకులో పెట్టి పసుపు,కుంకుమలతో,అక్షతలతో, పూలతో పూజ చేయించే వారు..తరువాత నూతిలో చేద వేసి నీళ్ళు తోడించే వారు. ఆనాటి నుంచి బాలెంతరాలు ఇంటి పని చెయ్యడానికి అంగీకారం వచ్చేది . వచ్చిన
ము త్తై దువలలో ఎవరైనా సంతానం లేని వాళ్ళుంటే వాళ్లకి మట్టి ముద్దలా గౌరీ దేవిని వాయనం ఇచ్చి మళ్ళీ ఏ టికీ పిల్లలు కలగాలని దీవించేవారు . మంచి సరస సల్లాపాలతో ఈ పేరంటం జరిగేది . తరువాత ఆమె చేత పాలల్లో పెరుగుతోడూ పెట్టించేవారు . దీని అంతరార్ధం పెద్దగా తెలియదు.
నిన్న పుస్తకంలో చదివితే తెలిసింది . ఈ కార్యక్రమం శుభమైన తిథి,వారం,నక్షత్రం చూసి చెయ్యాలి . కేవలం వంట ఇంటిపనికి అర్హురాల్ని చెయ్యడం కాదు,వారున దేవుణ్ణి పూజించడం . నూతిలో నీళ్ళు ఎప్పుడూ పుష్కలంగా ఉంచమని ,కొత్తగా పుట్టిన శిశువుకు ఈనీళ్ళు ఆరోగ్యాన్నిఇచ్చి
మధురంగా ఉంచమని వరుణూణ్ణీ ప్రార్దిన్చేకార్యక్రమం. ఆనాటి నుంచి ఆమెకు పురుటి దోషం పొతున్ది.
ఇది జలపూజ . ధరిత్రి గర్భంలో వుండే నూతి నీటికి పూజ చేసి తిరిగి తనను మళ్ళీ మళ్ళీ మాత్రు మూర్తిని చేయమని ప్రార్ధన చేయడం . ఆశీస్సులు కోరెపూజ .
మన హిందూ సాంప్రదాయంలో ప్రతి దానికి వెనక ఏదో ఒక ప్రయోజనం వుంటుంది
దీన్ని తెలుసుకోక పోవడం ,తెలిసినా విశ్వసించక ఆచరించక పోవడం మామూలైంది .

No comments:
Post a Comment