Pages

Wednesday, May 6, 2015

రాదామనోహరాలు

              రాధా మనోహరాలు.  
                             "రామబాణం   పూల తీగ   డాబామీదకి    పాకించాము ,గుత్తులు గుత్తులు   పూలు పూస్తున్నాయి    చూసారా  అత్తయ్యగారు ". అంది   మా కోడలు . "రామ బాణం పూలా? అరె  అవి నేనెప్పుడు
చూడలేదే!  ". అన్నాను   బయటికి రండి చూపిస్తా   అంది  వెళ్లి చూసా, పైన  పిట్టగోడమీద    రాదామనోహరాలు
పూలు గుత్తులు గుత్తులు  వ్రేలాడుతూ   గాలికి  ఊగుతున్నాయి . అవే అంది కోడలు అవి రాధామనోహరాలు  అన్నాను " " రామబాణాలని  చెప్పాడు మాలి అంది . బాగున్నాయి అన్నాను.
                     రాదామనోహరాలంటే   నాకెంత ఇష్టమో!  ఈపూలు నా  ఆలోచనల్ని   ఎన్నో ఏళ్ళు  వెనక్కి  తీసుకు వెళ్ళాయి . చిన్నప్పుడు మాఇంట్లో    వీధి  గోడవారగా  ఈ తీగ   స్వేచ్చగా పాకింది . విశాల హృదయంతో   గుత్తులుగుత్తులు   పూసేది .  కానీ   ఖర్చు లేకుండా మాచిన్నతనంలో   ఆటలతో  కాలక్షేపం చేసేవాళ్ళం . తెల్లవారగానే   వికసించిన పువ్వల్లా కోసి  మాలలు కట్టి   తల్లో  పెట్టుకోవడం ,దేవుడి పటాలకు అలంకరించడం   సరదా . రాధా మనోహరాలు కోసి   జడలల్లెవాళ్ళం . దారం అవుసరం లేకుండా  దండలు తయారయేవి . పూలు  జడలల్లడం   నేర్చుకొనే   దాకా   నిద్ర పట్టేది కాదు . పూలు జడలల్లడం ,మాలదారంతో   కట్టడం రాకపోతే   తోటి   అమ్మాయిలతో   తలవంపులుగా వుండేది . పై గా అత్తలు ,అమ్మ ,అమ్మమ్మలు కేకలేసేవారు " పూలు కట్టడం,సూదిలో దారం ఎక్కించి కుట్టి     చిన్న చిన్న రిపేర్లు చేయడం,వాకిట్లో ముగ్గు కర్రలు గీయడం రాకపోతే ఎలా !  " అని . కాస్త జ్ఞానం రాగానే  ఈపనులు నేర్చుకొన్నాం .
                                జడలల్లదానికి పనికి వచ్చే పూలు  రాదా మనోహరాలు, ఆకాశమల్లిపూలు ,చంద్రకాంతం పూలు కాడలు మహా  సున్నితంగా వుంటాయి . అవి  తునిగి పోకుండా   నాజూకుగా జడ అల్లాలి . ఒకటి తునిగితే అల్లికపోయి పూలు   విడిపోతాయి . పూలు కడితే  జాగ్రత్తగా  పనిచెయ్యడం అలవాటయ్యేది . పోద్దునపూట రాదామనోహరాలు,ఆకాశామల్లిపూలు జడలల్లితే  సాయంత్రం మూడు ఘంటలయేసరికి   చంద్రకాంత పూలు వికసించేవి . చంద్రకాంత పువ్వు రంగు   సంమోహనకరంగా వుంటుంది . ఎరుపు గులాబి,పసుపుకల్సినట్టుగా   తమాషాగా వుంటుంది దీనికాడలు మరీ చిన్నవి. రాధా మనోహరాలు   ఒర్చుకోన్నట్లుగా ఇవి ఒర్చుకోలేవు
ఈపూలు రాధకి  ఇష్టం కాబోలు,రాదామనోహరాలని పేరు పెట్టారు రాదామనోహరాల తీగలల్లుకొన్న లతా నికుంజాల లోనే   కృష్ణుడు   దాక్కొనే  వాడేమో. ఇవి లేత గులాబీరంగులో,తెలుపు రంగులో,రెండు రంగుల కలయికతో పూస్తాయి . ఆకాశ మల్లి పూలు తెలుపు రంగు  . చంద్రకాన్తలువాటి అసలురంగు,పసుపు,తెలుపు,తెలుపు పైవైలేట్ రంగు చుక్కలు,పసుపు పై  ఎర్రచుక్కలు రకరకాలు పూస్తాయి చెట్టు కాడలు నీరుపట్టి  వుంటాయి,త్వరగా పుటుక్కుమంటాయి    కాని చెట్టు  మొండిగా పెరుగుతుంది చిన్నప్పుడు పువ్వు దొరికితే తల్లో  పెట్టుకోవడమే!  వాసన ఉందా లేదా, పెట్టుకోవచ్చా,నవ్వుతారా అనే ఆలోచనే వుండేది  కాదు . పండగలు వస్తే దేవుడి పటాలకన్నిటికి   ఈపూలు  జడలల్లి అలంకరించే వాళ్ళం
ఇవన్నీ గుర్తుకు తెచ్చింది  రాధామనోహరం . చిన్నతనం లోపూలె మా సఖులు 

No comments: