Pages

Monday, July 20, 2015

చ్యవనప్రాస

చ్యవనప్రాస
        జీవేన  శ రద:శతం బ్రతికి నన్నాళ్ళు     సుఖంగా  జీవించాలి . ఈ కోరిక  ప్రతి మానవుడికి
సహజం . విటమిన్ సి లో   మహత్తర మైన   శక్తులున్నాయని ,అవి మనిషి శరీరానికి   కావలసిన
ఆరోగ్యాన్నిచ్చి ,యౌవనాన్ని   వ్రుధ్దిచేసి ,రోగాలను  నివారిస్తాయని వైద్య శాస్త్రం చెపుతుంది. భారత
దేశపు పురాతన  వైద్యులు ఈ విషయాన్ని వేల సంవత్సరాల క్రితం  పరిశోధన చేసి   నిర్ధారణ చేసారు .
        ఆరోగ్య రక్షణ  కోసం వాళ్ళు  ఎన్నో మందులు,  చికిత్సలు, లేహ్యాలు  కనిపెట్టారు . అందులో
చ్యవన ప్రాస ఒకటి . పల్లెటూరి వాళ్ళయినా,పట్టణాలలో వాళ్ళయినా ,చదువుకొన్న   వాళ్ళయినా,చదువుకొని వాళ్ళయినా   దీన్ని వాడి లాభం  పొందారు . చ్యవన ప్రాస ప్రాశస్త్యం తెలియక పోయినా  దీనిని వాడడం   వలన
రోగాలు  రావని ,శరీరంలో ఉష్ణత నిలకడగా ఉంటుందని నమ్మకం    కలిగింది . తియ్యతియ్యగా,పుల్లపుల్లగా వుండటం  వలన పిల్లలు కూడా దీన్ని చాలా   ఇష్టంగా   తింటారు . డాక్టరు గారి సలహా ప్రకారం   తాతగారు ఒక చెంచా   తినిపిస్తే  మనుమలు లాక్కుని  మరో  చెంచా  తింటారు .
          ఈ లేహ్యానికి    చ్యవన  ప్రాస  అనే  పేరు  ఎందుకు  వచ్చింది ?ప్రతిదాని  వెనక  ఒక  కద  వుంటుంది చ్యవన మహర్షి  పేరుతో   ఈలేహ్యం ప్రచారం లోకి వచ్చింది . వృద్ధుడైన చ్యవన మహర్షి వనంలో కూర్చుని  తపస్సు  చేసుకొంటున్నాడు . తపోదీక్షలో చాలా సంవత్సరాలు కదలకుండా కూర్చోవడం వల్ల ఆయనచుట్టూ చెదలు   పుట్టలు  పెట్టాయి . ఆసంగతే   ఆయనకు  పట్టలేదు . శరీరం అంతా చెదలపుట్ట తో కప్పి వేయబడింది కళ్ళు మాత్రం   మెరుస్తూ కనిపిస్తున్నాయి అక్కడికి సుకన్య అనే   రాజకుమారి చెలికత్తెలతో    విహారానికి   వచ్చింది . పుట్ట చూసింది . పుట్టపై కళ్ళు  మెరుస్తున్నాయి . కుతూహలం తో  చిన్న   పుల్ల తీసి  మహర్షి కళ్ళల్లో పొడిచింది . ఆయన  కళ్ళు పోయాయి . తను తప్పు చేసినందుకు    విపరీతంగా పశ్చాత్తాప పడి   ఋషిని పెళ్లి చేసుకొంది .   అశ్వనీ దేవతల్ని    ప్రార్ధించింది ,తన  భర్తకి  పూర్తీ  ఆరోగ్యము  నేత్రదానము చెయ్యమని . దేవతలా వైద్యులు అశ్వనీ    కుమారులు ఓషధుల్ని తెచ్చి లేహ్యం తయారు చేసి    ఋషికి    ఇచ్చారు దాన్ని  సేవించడం వలన    చ్యవన మహర్షికి   కళ్ళు రావడమే కాదు   పున :  యౌవ్వనం    వచ్చింది . ప్రాస అనే మాటకి
తినడం   అని  అర్ధం . చ్యవన   మహర్షి   తిన్న  లేహ్యం కనుక   ఈలేహ్యానికి   చ్యవనప్రాస   అనే పేరు వచ్చిందిట .
                   ఇందులో   ఇంత   శక్తి  వుందా ?  అని సంశయం   రావచ్చు . ఇది జలుబు,దగ్గులు పోగొట్టి   ఆరోగ్యాన్నివ్వడమే కాదు   కాయకల్పం చేస్తుంది .. ప్రత్యెక మైన   విధి వుంది .ఔషధులు , ఉపకరణాలు పెట్టి
రోగిని ఒక    గదిలో  నిర్ణీత కాలం పెట్టేవారట ,బయట ప్రపంచం   తో   రోగికి   సంబంధం వుండేది కాదట
అప్పుడు చ్యవన ప్రాస ప్రయోగించే   వారట . అప్పుడు కాయకల్పం జరిగేదిట. పండిత మదన మోహన మాలవ్యాకూడా   కొంత కాలం ఈ చికిత్స ప్రయోగించారంటారు . చ్యవనప్రాస తాజాగా సేవిస్తే   మంచి ఫలితాన్ని
ఇస్తుంది . చెట్ల   వేళ్ళు ,ఆకులు వాటిని ఉపయోగిస్తారు    కనుక ఒక సంవత్సరం  దాటాక వాటి  శక్తి తగ్గడం
ప్రారంభ మౌతుంది ట . పూర్వం వైద్యులు  ఈ  లేహ్యం    ఇలా  తయారు చేసి  అలా రోగికి  ఇచ్చే వారట .
                                  చ్యవన ప్రాస తయారు  చెయ్యాలంటే కాలము,  శ్రమ ఎక్కువ వినియోగించాలి . ఔషధీ యుక్త మైన    వేర్లు,ఆకులు,  కొమ్మలు    అడవిలో  వెతికి   వెతికి   తేవాలి . దీనికి   చాలా  సమయం పడుతుంది .
పదిమంది   పది వేపులకి   పోయినా  రోజులు   పడుతుంది . సారంగాధరసంహిత,చరక సంహిత మొదలైన
గ్రంధాలలో చ్యవనప్రాస   తయారు చేసే   పద్ధతి,  దాని  ప్రాశస్త్యం   వివరంగా వున్నాయి . ఇది శీతా కాలంలో వాడితే   చాలా  మంచిది . దీన్ని  తయారు  చేయడం  కూడా  శీతా కాలం లోనే   జరుగుతుంది . పక్వానికి వచ్చి,
తాజాగా  వున్న ఉసిరి కాయలు,వేర్లు ,ఆకులు తెచ్చి కలిపి ,కళాయి   పెట్టిన పెద్ద పెద్ద పాత్రలలోపెట్టి నీళ్ళూ
పోసి ఉడికిస్తారు . శీతా కాలంలో ఉసిరి కాయలు  పుష్కలం గా    దొరుకుతాయి . ఉసిరి  కాయలనిండా విటమిన్
సి పుష్కలంగా    వుంటుంది . గులాబి,బిల్వ పత్రం ,పగడ చెట్టు ,మినపచెట్టు,విష్ణు క్రాంత ,రావి,ఎండ్ర గబ్బకొమ్ము
మునక్కాయ,కరక్కాయ,జీవంతి,నేల ఉసిరి ,కజ్జూరం, తామరదుంప ,చందనం , ఆకుపచ్చ ఏలకులు , శోం ఠీ
,అష్ట వర్గ మొదలైన వాటి  ఆకులు,కొమ్మలు  ,వేర్లు  వాడతారు . అందుకనే చ్యవన ప్రాస    సీసాలపై  విశేష అష్ట వర్గ లతో చేసింది . అని  వ్రాస్తారు . తమ్మివేరు,కాకి దొండ ,వృద్ధ మేధా , మహా మేధా ,రుషభుక్ , జీవక , కాకోలీ ,
క్షీర కాకోలీ    ఈ  ఎనిమిది   ఔషధాలని అష్ట వర్గలు   అంటారు . ఇవి  దుర్గమ మైన  హిమాలయ మంచు
పర్వతాలపై పుడతాయి .
                   నీళ్ళలో మరిగించిన ఉసిరి  కాయలలో   గింజలు  తీసివేసి ,పైన చెప్పిన వాటిని కూడావేసి  మెత్తగా
ఉడికిస్తారు . సన్నని సెగ మీద మంచి నెయ్యి కాచి  దానిలో  ఈముద్ద   వేసి  వేగిస్తారు . లేహ్యం పూర్తిగా   వేగాక
నెయ్యి పైకి  తేలుతుంది . పెద్ద బాణలిలో నీళ్ళు పొంగనించి    అందులో   పంచదార వేసి పాకం  పట్టి అందులో
నేతిలో వేగిన  ఉసిరి  హల్వావేస్తారు . పిప్పలి,వంశ లోచన,దాల్చీనీ , ఏలకులు,నాగ కేసర్ ,తేజ్ పత్తా  మెత్తగానూరి  ఇందులో కలుపు తారు . చల్లబడ్డాక డబ్బాలలో కానీ,సీసాలలోకానీ పెట్టి సీల్ చేస్తారు
                           ఉదయం ఫలహారం చేసే   గంట ముందు పాలతో గానీ,వేడి నీటి తో గానీ 20 గ్రాములు పుచ్చుకోవాలి . మళ్ళీ నిద్ర పోయే ముందు   పుచ్చుకోవాలి . శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది . ఇది ఉత్కృష్ట మైన రసాయనం . ఊపిరితి త్తు లకి ,మస్తిష్కానికి శక్తి నిస్తుంది . సంతానోత్పాదక అన్గాలకి ,మూత్ర ప్రణా ళి కకి   సత్తువ నిస్తుంది . గుండెలోని  ధమనులని,నాడులని   బల పరుస్తుంది . విద్యార్ధులకి   స్మరణ శక్తిని పెంచి
లాభానిస్తుంది . పేగులలో  మలం చేరితే వచ్చే రోగాలను   నిరోధిస్తుంది . నియమంగా పుచ్చుకొంటే రక్త వృద్ది చేసి
శరీరంలో కాంతి  నిస్తుంది . వంశ లోచన  అంటే    ప్రక్రుతి సిద్ధ మయిన  క్యాలిషం ,అది ఇందులో వుంది ,ఏముకని గట్టి పరుస్తుంది .
                               ఇన్ని మంచి గుణాలున్నాయని   ఆశ పడి   అందరు  పుచ్చుకో కూడదు . వాయు పీడితులు ,విరోచనాలయే వారు , ఆకలి  లేని  వాళ్ళు , అజీర్ణం తో బాధపడే వాళ్ళు తీసుకోకూడదు . స్వప్నావస్థలో వీర్య
స్రావం అయేవారు , మూత్రం పచ్చ రంగులో   విడిచే  వారు , నిద్రిస్తూ మూత్ర విసర్జన కోసం మాటి  మాటికి లేచేవారు తీసుకోకూడదు .
                   ఇది   సహజ మైన,సులభమైన   దివ్యౌషధం .




No comments: