Pages

Thursday, August 4, 2016

శ్రావణ లక్ష్మి

              శ్రావణ  లక్ష్మి
      శ్రావణలక్ష్మికి  స్వాగతం
      సర్వాంగ సుందరికి  స్వాగతం

      గోరు వెచ్చని నీటితో  నీకు
      స్నానము చేయించెద మమ్మా!
      మెత్తని వలువతో తనువును అద్ది
      అత్తరు పూసెద మమ్మా!

      ఎర్రని కుంకుమ  నుదుటను దిద్ది
      నల్లని కాటుక  కన్నుల కద్ది
      కురులను దువ్వెదమమ్మా!
      జాజి విరులను తురిమెదమమ్మా!
     
     పచ్చని రంగు పట్టు చీరను
    ఎర్రని రంగు కంచుకంబును
     చక్కని నీలపు వల్లె వాటును
     సింగారించెద మమ్మా!

     లత్తుక ఒత్తుగ పదముల పూసి
     ఘల్లను గజ్జెలు కట్టెదమమ్మా!
     మట్టెలు, చుట్లు, పాంజెబులు
     కడియాలను పెట్టెదమమ్మా!

     లేత నడుముకు వడ్డాణంబు
      మణి మేఖల కటి భాగమ్మునకు
      చెతుల నిండుగ    గాజులు వేసి
     వేళ్ళకు ఉంగరాల్ వేడుక పెడ్దుము

     ముత్యాలసరాలు,పగడాలదండలు
     నవర్త్నాల నాజూకు దండలు
     చంద్రహారాలు,జిగినీ గొలుసులు
     నల్లపూసలు పెట్టెదమమ్మా!

     తాటంకములు  తళతళ మెరియగ
     ముక్కున ముక్కెర ముద్దులొలుకగా
     లోలకులు, బేసరి నత్తు
      ఆనందముతో పెట్టెద మమ్మా!

      త్రిలొక వాసిని ,త్రిలోక పాలిని
      తీరును కోరిక నిను స్తుతియించగ
      శిరసున కిరీట మలంకరించి
      శిరసు వంచి నిను వేడెద మమ్మా!
         
      

No comments: