Pages

Wednesday, August 10, 2016

           ఆంధ్రుల  భోజనం లొ   పచ్చడికి ఒక ప్రాముఖ్యత వుంది. భొజనం లొ కూర,పప్పు, పులుసు తో పాటు పచ్చడి  కూడా   వుంటేనే గాని
భొజనం తిన్న సంత్రుప్తి   వుండదు. ఏపూట కాపూట ఏదో పచ్చడి  స్రుష్టించి  ఇల్లాలు వడ్డించక పోతే   ఆవిడ వంటకి   మార్కులు పడేవికావు.గొదావరి జిల్లాల వారికి   ఆవకాయ ,మాగాయ వుంటె చాలు  ముప్పొద్దులా తినమన్నా   తింటారు. క్రిష్నా  జిల్లావారికి పచ్చళ్ళు  తాజాగా వుండాలి. ఒక ఇల్లాలి ఇంటికి రాజు గారు  వేళకాని వేళ భొజనానికి వస్తె ,ఆవిడ పచ్చని గరిక కొసుకొచ్చి  పచ్చడి చేసి వేడిగా అన్నం వండి పెట్టిందీట,  ఉప్పు కారం   పులుపు  సమానం గా పడి ఘాటైన  తిరగమూత పెట్టింది.పచ్చడి మంచి  రుచిగావుంది. రాజుగారు మెచ్చుకొని ఆమెకొక  అగ్రహారం   వ్రాసి ఇచ్చారట. పచ్చడి చెయ్యటానికి సహనం కావాలి.ముఖ్యంగా కొబ్బరి పచ్చడి  ,పప్పు పచ్చళ్ళు  చెయ్యలంటే సమయం వినియోగించాలి. చాలా మంది వంట అంతా చేసిపారేస్తారుగానీ పచ్చ్డి చెయ్యాలంటే బధ్ధకిస్తారు, దాటేస్తారు, లెకపోతే ఎమి లెస్తూ అనుకొంటారు. పచ్చ్ది వుంటే అన్నంలో కలుపుకొని ఒక  ఆధరువుగా  తినవచ్చు, పప్పులో పెరుగులొ నంచుకోవచ్చు. భొజనం మధ్య రవంత పచ్చడి నాలుకకి రాసుకొంటే జిహ్వ లేచివస్తుంది. వంట చెయడం ఒక కళ అయితే  పచ్చడి చెయ్యడం ప్రత్యెకమైన కళ అని చెప్ప వచ్చు.
                       వంట ఇంట్లో వూరగాయ లుంటే  ఆస్థాన  విద్వాన్సులు
అంటారు. అవి చాలా సార్లు తలకాస్తాయి, పరువు కాపాడతాయి, ఆకలి తీరుస్తాయి. అందుకనే అప్పో సప్పో చెసి ఆవకాయలు పెట్టుకోవాలి అంటుంటారు గ్రుహిణులు .   ఏడాదికి ఒక్కసారి కష్ట పడితే సంవత్సరం పొడుగునా వూరగాయ జాడీలు అలమారాలో కూర్చుని ధైర్యం చెప్తు వుంటాయి.ఈ వూర గాయలు రొజు చెసుకొనే బండ పచ్చళ్ళూ,ఎన్నిరకాలున్నాయో సరదాగా లెఖ్ఖ
వ్రాద్దామనిపించింది. చిత్తగించండి.
        ఆంధ్రా పచ్చళ్ళు
       *********************
   1.ఆవకాయ
   2.మాగాయ
   3.కాయ ఆవకాయ
   4.నీటి ఆవకాయ
   5.బెల్లపు  ఆవకాయ
    6.పులిహోర ఆవకాయ
   7.పెసర ఆవకాయ
   8.నువ్వు ఆవకాయ
   9.తొక్కుదు పచ్చడి
   10. మెంతికాయ
   11.ఉసిరి కాయ ఆవకాయ
    12.ఉసిరిక పచ్చడి
   13.చింతకాయ పచ్చడి
    14.నిమ్మకాయ వూరగాయ
    15.దబ్బకాయ వూరగాయ
    16.నారింజకాయ వూరగాయ.
    17.పంపరమనాస వూరగాయ
    18.కొరివికారం పచ్చడి
    19. గోంగూర పచ్చడి
    20.అల్లం వూరగాయ
    21. కందిపప్పు పచ్చడి
    22. పెసరపప్పు పచ్చడి
    23.సెనగపప్పు పచ్చడి
    24.మినప పప్పు పచ్చడి
    25.వేరు సెనగ పప్పు పచ్చడి
    26.చింత పండు పచ్చడి
    27.అల్లం,బెల్లం పచ్చడి
    28.వుల్లిపాయ కారం
    29.దోసకాయ పచ్చడి
    30.కీర దోసకాయ పచ్చడి
    31.బీరకాయ పచ్చడి
    32.వంకాయ పచ్చడి
    33.మామిడికాయ పచ్చడి
    34.మామిడికాయ కొబ్బరి పచ్చడి
    35 మామిడికాయ వాక్కాయ పచ్చడి.
    36.మామిడికాయ పెసరపప్పు పచ్చడి.
    37.  దొసకాయ చింతకాయ పచ్చడి
    38.దొండకాయ పచ్చడి
    39.వాక్కాయ పచ్చడి.
    40.వాక్కాయ పెసరపప్పు పచ్చడి
    41.వెలక్కాయ పచ్చడి
    41.కొబ్బరిపచ్చడి
    42.మెంతికూర పచ్చడి
    43.నేతి బీరకాయ పచ్చడి
     44.దొసావకాయ
     45.టొమాటా పచ్చడి
      46.కొత్తిమీర పచ్చడి
      47.కరివేపాకు పచ్చడి
      48.కాబేజీ పచ్చడి
       49.సొరకాయ పచ్చడి
        50. కారెట్ పచ్చడి
       51.బీట్రూట్ పచ్చడి
      52.చిలకడదుంప పచ్చడి
      53. కొబ్బరి పెరుగు పచ్చడి.
      54.మాగాయ పెరుగుపచ్చడి
      55.వంకాయ పెరుగు పచ్చడి
      56.వుల్లిపాయ పెరుగు పచ్చడి
      57.టొమాటొ పెరుగుపచ్చడి
      58.నువ్వుపప్పు పెరుగు పచ్చడి
      59.ఆవ పెరుగు పచ్చడి
      60.అరటి దూట పెరుగు పచ్చడి
      61.వంకాయ వుల్లిపాయ పులుసు పచ్చడి
      62.పొట్లకాయ పెరుగు పచ్చడి
      63.టొమాటొ పుట్నాల పప్పు పచ్చడి.
      64.వుల్లిపాయ కొత్తిమీర పచ్చడి
      65.టొమాటొ వుల్లిపాయ చట్నీ
      66.ద్రాక్ష పళ్ళ పచ్చడి
    ఇవండీ నాకు తెలిసిన పచ్చళ్ళు . పొద్దున్నె  వాట్సప్ లో వంటల వూసులు తెచ్చి
ఈపచ్చళ్ళ పద్దు వ్రాయడానికి  దొహదం చేసిన  మా పెద్దకోడలు జయశ్రీ కి కానుక











  

No comments: