Pages

Thursday, April 25, 2019

ఆమ్ములు. వెళ్ళిపోయింది

మొఖాన చిరునవ్వు ,కళ్లుకూడా నవ్వుతాయి .బంగారు శరీర ఛాయ..  మనిషి నెమ్మది ,మాట నెమ్మది. మా సీతా మహాలక్ష్మిని ముద్దుగా ”అమ్ములూ ” అని పిలుచుకొంటాము. నాకు వరసకి ఆడపడుచైనా  నేనూ అమ్ములూ అనే పిలిచేదాన్ని. నా పెళ్ళైన ప్పటికీ అదియుక్త వయస్కురాలు. ఆవయస్సు ఆడపిల్లలంటే నాకు
ఏమిటో మొహం !నాచుట్టూ వుంది నాతొ సరదాగా కబుర్లు చెపుతూ ఉండేది దాని మాటలు వింటూ ?దాని కదలికలు గమనిస్తూ మురిసిపోయేదాన్ని. మా చిన్న మామగారి అమ్మాయి. మేమిద్దరం కలిసి ఉండటం తక్కువ అయినా ,కలిసి వున్నపుడు ఏంతో ఆప్యాయం ,ఏంటో ఇష్టం,
                       పని చేసుకొనే వేళ ,తల సరిగా దువ్వుకోక, ఎదో చీర కట్టుకొని ఉంటే “ అబ్బా ! నీ పని ఎప్పుడవుతుంది ? అని చిటపట లాడేది. తరవాత మొహం కడుక్కొని , జడవేసుకొని  మంచి చీర కట్టుకొంటే హిహి అని “ నువ్వెప్పుడూ ఇలామంచి చీరలు కట్టుకొని వుండు “ అనేది ?( ఈమాట అనే తీరిక మా ఆయనకీ ఉంటే బాగుండును కదా ,!)అనుకునేదాన్ని. పొగడ్తలు ఎంత బాగుంటాయి. జన్మంతా మరచిపోలేము.
         ఒక్కసారి అమ్ములు ఇంటికి బొంబాయి వెళ్ళాము. గదిలో కూచోపెట్టి ఎన్నో కబుర్లు చెప్పింది. తరవాత యు .ఎస్  వెళ్ళినపుడు వాళ్ళ అమ్మాయి వైజయంతి ఇంటికి వెళ్లి కలిశా. అప్పటికే తనకి ఆరోగ్యం బాగాలేదు. శరీరం రుగ్మతతో పెనుగులాడుతోంది. అయినా ఏంతో ప్రేమగా  మాట్లాడింది. మనకి దగ్గరయిన వాళ్లకి
ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్లి వాళ్ళతో వుండి !నాలుగు కబుర్లు చెప్పి సేద తీరుద్దామని మనసు కొట్టుకొంటుంది, కానీ సంసారంలో సంకెళ్లు , కాళ్ళని, చేతుల్ని కట్టి వేస్తాయి. ఏది చెయ్యాలనుకొంటామో !అది తప్ప ఏవేవో చెయ్యాల్సి వస్తుంది.
                    అమ్ములు ఒంట్లో బాగాలేదని ఎవరికీ చెప్పేదికాదు, ఎక్కడికి వచ్ఛేదికాదు. వాళ్ళు వీళ్ళు ఏదన్నా కబుర్లు చెపితే వినేదాన్ని. ఇవాళ పొద్దున్నే మాబాబి   అమ్ములు  వెళ్లిపోయిందని ఫోన్ చేసాడు. అబ్బా , ఎంత బాధ వేసిందోవెళ్లి చూసే ఓపిక లేదు  మనసు ముద్ద కట్టుకు పోయింది. మనకంటే చిన్న వాళ్ళని ,మనముందే కాలం కబళిస్తే భరించడం క్యాష్ తమ్. మావారు అనేవారు.ఎక్కువ కాలం బతక కూడదు, బతికితే ఎన్నో అశుభ వార్తలు వినాల్సి వస్తుంది “ అని .అది నిజం ..అమ్ములు ఆత్మకి శాంతి నిమ్మని భగవంతుని ప్రార్థిస్తున్నా.  అమ్ములు నిన్ను మర్చిపోలేనే !

No comments: