Pages

Saturday, February 17, 2007

బంగారు తీగ (హేమలత )

కన్నీటి బిందువు
రైల్ ప్రయాణం లాటి జీవితంలో ఎంతోమందిని కలుసుకొంటు వుంటాం .వారిలో చాలా మంది వేళ్ళ మధ్య నుండి నీళ్లు జారినట్లుగా , జారిపోతూ వుంటారు . కాని కొందరు నిలిచిపోతారు ,హృదిలో .95 లో మీము ఢిల్లీ నుంచి కాపురం హైదరాబాద్ కి
మార్చాము .ఇది వరకు వుండి వెళ్ళిన వూరయినా మారి పోయి కొత్తగా వుంది . అప్పుడు మొదట పరిచయం అయ్యింది
హేమలత . చూడ గానే నన్ను ఆకర్షించింది , స్వచ్చ మైన నీరు లాటి స్వభావం ,మర్యాదా , మన్నన , నొప్పింపక తా నొవ్వక ,నలుగురితో శారద మహిళా మండలి తానూ ఒక్కొక్క మెట్టే ఎక్కి అధ్యక్షురాలు కావటం చూస్తేనే తెలుస్తుంది . హైదరాబాదు రాంగానే శ్రావణ మాసం ,వచ్చింది .షాపులు అవి తెలియవు ,ఎలా అనుకొంటుంటే ''హేమలత మీకేందుకండి మా ఇంటి దగ్గరే బోలెడు షాపులు వున్నాయి ,నేతెచ్చి పెడతాగా ! అని పంచి పెట్టటానికి చిన్నచిన్న కుంకుమభరిణెలు అద్దాలు తెచ్చిపెట్టింది .మండలిలో యక్జిబిషను పెడితే రిబ్బన్ కట్ చేయడానికి పిలిచింది ,అప్పుడు వెళ్ళాను . రెండేళ్ళ క్రితమే సభ్యురాలిగా చేరాను .అప్పటి నుంచి పరిచయం మండలిలో గాడ మైనది . మండలే తన ప్రపంచం ,దాన్ని పైకి తీసుకు రావ డమే తన జీవిత లక్ష్యం ,అన్నట్లుగా శ్రమిన్చిఇది .అందరూ ఇకమత్యన్తో కల్సి మండలిని పైకి తీసుకు రావడానికి సేవ చేయాలని అనుకొనేది . డబ్బు విషయం లోకి వస్తె నాది ,మీది అనే భావనే తనకి వుండేది కాడు . పిక్నిక్ కి వెడితే పెద్దవాళ్లందరూ సుఖంగా కూర్చున్నారో లేదో చూసుకోనీది . తను నిలబడి అయినా వేరే వాళ్ళకి సీట్ ఇచ్చి కూర్చో పెట్టేది . అనారోగ్యానిఎమాత్రం
లక్ష్య పెట్టకుండా మండలికి వచీది . అందరితో కలవాలని ఎంత ప్రేమ వుంటే అలా వచ్చేదో ? ఇలా చెప్పుకొంటూ పొతే ఎన్నో వున్నాయి .హైదరాబాదు వెళితే హేమలత లేదని బాధగా వుంది . మొగ్గ వేయడం ,పండు రాలటం అని జీవితాని పోలుస్తారు వేదాంతులు .కళ్ళముందే మన ఆప్తులు అద్రుస్యమయిపోతే నిలవరించుకోవడం కష్టమే ,కాని హేమలత లేనిలోటును భరించ లేక విచారిస్తున్నా హేమలత ఆత్మకి శాంతి కలగాలంటే ఆమెని ఆదర్శంగా తీసుకొని మండలిని పైకి తెచ్చేందుకు మన సభ్యులందరూ కృషి చీయాలనిభావిస్తున్నా . నేను దగ్గర లేను కనుక ఇక్కడినుంచే వారి కుటుంబ మన్తతికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను .
ఇట్లు
టి .జి .ప్రసూన

No comments: