చతుర్దాధ్యాయము
మంచి రోజులు వచ్చే నని మామ ఆల్లుళ్ళు రమా నాథా
తీర్థ యాత్ర లెన్నో త్రోవలో చేసారు ''
బ్రాహ్మణులకు , బీదాబిక్కికి ''
దానధర్మాలెన్నో చేసారు ''
తమనగరమునకు ప్రయాణ మైరి ''
సముద్ర తీరాన వెళ్ళు చుండిరి ''
ఇది చూసి సత్య నారాయణ స్వామి ''
వీరిని పరీక్షించ నిశ్చయించీ ''
కలావతి ,లీలావతి ఎట్టకేలకు ''
నామహిమ తెలిసి నావ్రతము చేసిరి''
వైశ్యునకు ఇప్పటికైనా ''
నావ్రతం సంగతీ గుర్తు రాదా ? ''
సత్యమూర్తి సన్యాసి వేషమున ''
వారివద్దకు వచ్చి ఇట్లనెను ''
వర్తకులారా ! పడవ యందు ఏమి వున్నవి ? ''
వర్తకులు విజయ గర్వముతో ''
మదొన్మత్తులైఒడలెరుగా కుండిరి ''
మా పడవలో ఎమున్నా నేమి సన్యాసీ ! ''
నీ కెందు కయ్యావాటి సంగతీ సన్యాసీ !
నీవు దొంగతనము చేయ వచ్చి తి వి ఒసన్యాసీ ! ''
ఈపడవలో ఏమీ ధనములేదు సన్యాసీ ! ''
వట్టి ఆకులు అలములు తప్ప ఒసన్యాసీ ! ''
అనిన విని సత్యదేవుడు చిరు నవ్వుతో ''
"ఆకులు అలములే వుంటాయి లే " అని వెడలె ''
అల్లంతదూరం పోయి నిలచే ''
మామా ,అల్లుడు పడవ దిగి ''
కాలక్రుత్యాల్ తీర్చుకొని వచ్చినారు ''
పడవ దగ్గర పోగానే ''
అది కాగితం పడవలా తెలు చుండే
పడవలోకి వెళ్లి చూడ ''
ధనమునకు బదులు ఆకులు వుండే ''
వైశ్యుడు చూసి మూర్ఛ పోయే ''
తెలివి వచ్చి విల పింప సాగే ''
అప్పుడు అల్లుడు మామను చూసి ఇట్లనే ''
సన్యాసి శపించెను కదా !అందువలన ''
ఇట్లు ధనము ఆకులలములయ్యే ''
అతని వెదికి ప్రార్ధింతుము ''
అతడే తిరిగీ మన ధనము మన కియ్యగలడు ''
అల్లుడుమాట నిజమని ''
సన్యాసి వద్దకు పోయిరిరువురు ''
మహాత్మా అనినమస్కరించి ''
మీము అవివేకము తో ప్రేలినాము ''
మా అప రాధము క్షమిమ్పవయ్య ''
అని అన్ని విధముల ప్రార్ధించిరి ''
ఇప్పటికైనా బుద్ది వచ్చేనా ! వెర్రివాడా ! ''
నీవు సత్యనారాయణ వ్రతం చేస్తానని ''
మాట తప్పి మరచినావు ''
దానివలననీ ఈ దారుణ దు :ఖం ''
వైశ్యుడు చేతులు జోడించి ''
ఈలోక మంత నీ మాయచే నిండెను ''
బ్రహ్మాది దీవతలు గుర్తింపలేరు ''
అజ్నానుడను ,మూర్ఖుడను ''
మూఢుడను , జడమతిని ''
నిన్ను అనేక విధముల ప్రార్దింతును ''
నాపై కరుణ జూపి రక్షించు ''
నా ధనము నాకు అంద చేసి ''
నాకుటుంబమును కాపాడ వయ్యా ''
అతని విన్నపాలు వినిస్వామికి దయ కలిగి ''
తిరి గి ధనమునంత ఇచ్చేసి అద్రుశ్యు డయ్యె ''
మామా ,అల్లుడు పడవ ఎక్కి చూడగానే ''
ఆకులుపొయి రూకలు వచ్చే పడవలో ''
స్వామికి కృతజ్ఞతా తెలిపి ''
కడు ముదముతో ఇరువురు వెడలిరి ''
స్వనగరము దాపుకు రాగానే ''
అదేనోయి , మనవుఉరు వచ్చివేసాం ''
అని అల్లునికి మామ చూపించాడు ''
సేవకునిపిలచిభార్యకు , బిడ్డకు ''
తమరాక తెలిపి రమ్మనేను ''
సేవకుడు వర్తకుని ఇంటికి వెళ్లి ''
కళావతికి , లీలావతికి ''
వారిపతులరాక నేరిగించి ''
త్వరలో వస్తున్నారనే ''
లీలావతి ఈమాటలువిని ''
ఆనందం పట్టలేకపోయే ''
మన వాళ్లు వచ్చేసారటే అమ్మాయీ ''
వ్రతం త్వరగాముగించి రావే పోదాం ''
పూజ పూర్తి చేసినారు వారిరువురు ''
తొందరలో ప్రసాదం తినలేదు ''
అందువలన సత్య మూర్తికి కోపం వచ్చి ''
ధనముతో సహా పడవను నీట ముంచే ''
పడవతోపాటు అల్లుడు కూడా మునిగి పోయే ''
లీలావతి నెట్టి బాదుకు ఏడవ సాగే ''
అల్లుడా ! కళ్ళెదుట నీట మునిగితివా ''
ఇది అంతా స్వామి మాయ నిశ్చయముగా ''
అని కుమార్తెను కౌగాలించుకు విల పించే ''
భర్త మృతి చెందేననివిని కళావతి ''
అతని పాదుకలతో సహగమనము ''
చేయుదు నని నిశ్చయించీ ''
స్వామికి కోపం వచ్చెనని షావుకారు ''
చీత ఇట్లయ్యేనని ''
నా శక్తి కొలది వ్రతము చేతు ''
భక్తీ శ్రద్ధలతో ప్రార్ధింతు ''
స్వామిని తలచి సాష్టాంగ పడి ''
అనీక విధముల స్తుతియించే ''
అప్పుడు సత్యదేవుడు సంతోషించి , ఇట్లనెను ''
భర్త వచ్చినాడను ఆనందముతోను ''
నీకుమార్తే నా వర ప్రసాదము ''
తినకుండా పడవ దగ్గర కొచ్చే ''
అందువలన భర్త ఆమెకు ''
కనిపించకుండా మునిగిపోయే ''
ఇంటికి పోయి ప్రార్ధించి ''
ప్రసాదంతిని వచ్చిన వెంటనే ''
అల్లుడు జీవించి వచ్చు ''
అంతయు శుభ కర మగును ''
ఆకాశ వాని వినిన తోడనే కలావతి ''
పరుగుపరుగున ఇంటికి పోయి ''
ప్రసాదమును స్వీకరించి ''
తిరిగీ పడవ వద్దకు వచ్చే ''
వచ్చి చూచు సరికే అచట ''
పడవనీటిపై తీలి యుండె ''
ఆమె భర్తా కూడా కను పించే ''
అది చూచి అందరు ఆనందిన్చిరి ''
తండ్రీ !ఆలస్య మింకీల మనకు ''
భక్తీ శ్రద్ధలతో వ్రతం చేద్దాం ''
ఆమాటవిని షావుకారు ''
బంధువులతో కలసి నదిఒడ్డున ''
వ్రతము చేసి సుఖముగా ఇంటికి చేరే ''
జన్మ అంతా షావుకారు ''
పౌర్ణమి దినమునవ్రతము చేసే ''
రవి సంక్రమణ దినమున కూడా చేసే ''
అట్లు నియమము తప్పక పూజ చేసి ''
సకల భోగాలు అనుభ వించి ''
అన్త్యమున సత్య పురికి పోయే ''
చతుర్ధ అధ్యాయము సమాప్తము
No comments:
Post a Comment